టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు లోకేశ్‌ని తెలంగాణ ఏసీబీ టార్గెట్ చేసుకోగానే.. ఏపీ సీఐడీ నుంచి ప్రతీకార చర్యలు మొదలైనట్లు కనిపిస్తోంది. లోకేశ్ కారు డ్రైవర్ కు తెలంగాణ ఏసీబీ నోటీసులు ఇస్తే.. కేసీఆర్ తనయుడు మంత్రి కేటీఆర్ కారు డ్రైవర్ కు, గన్ మెన్ కు ఏపీ సీఐడీ నోటీసులు అందించింది. ఓటుకు నోటు కేసులో మత్తయ్యను చంద్రబాబు పేరు చెప్పాలంటూ బెదిరించారని నమోదైన కేసులో ఈ నోటీసులు జారీ చేసింది సీఐడీ. కొన్నాళ్లుగా స్తబ్ధుగా ఉన్న ఓటుకు నోటు కేసు తాజానోటీసులతో మళ్లీ దుమారం రేపడం మొదలుపెట్టింది. అటు టీడీపీ, ఇటు టీఆర్ఎస్ రెండూ.. ఈ నోటీసుల వ్యవహారాన్ని రచ్చరచ్చ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
cash for vote లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
cash for vote లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
12, ఆగస్టు 2015, బుధవారం
టిట్ ఫర్ టాట్ - కేటీఆర్ పై ఏపీ సీఐడీ కన్ను
Read more...
లోకేశ్ పై తెలంగాణ ఏసీబీ నజర్
Categories :
acb . cash for vote . chandrababu . lokesh . POLITICS . tdp
ఓటు కు నోటు కేసులో ఏసీబీ వేస్తున్న అడుగులు టీడీపీలో కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, సండ్ర ను అరెస్ట్ చేసిన ఏసీబీ.. ఇప్పుడు టీడీపీలో కీలక నేత.. చంద్రబాబు వారసుడు లోకేశ్ ను లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఓటుకు నోటు కేసు విచారణకు హాజరు కావాలంటూ.. లోకేశ్ కారు డ్రైవర్ కొండల్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఓటు కు నోటు డీల్ జరిగిన రోజు లోకేశ్ ఎవరెవరిని కలిశారన్నదానిపై ఏసీబీ కొండల్ రెడ్డిని ప్రశ్నించే అవకాశం ఉంది. కీలక వివరాలను రాబట్టగలిగితే.. ఆ తర్వాత లోకేశ్ కూ నోటీసులు జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏసీబీ తాజా నోటీస్ వ్యవహారంపై అప్పుడు టీడీపీలో టెన్షన్ మొదలయ్యింది.
9, జూన్ 2015, మంగళవారం
బాబు సెంటిమెంట్‌ను రగిలిస్తున్నాడా?
Categories :
ANDHRA PRADESH . babu . cash for vote . chandrababu . maha sankalpam . POLITICS . revanth reddy . tdp
ఓటుకు నోటు వ్యవహారం ఊహించని మలుపులు తిరుగుతోంది. ఆడియో టేపులు బయటపడడంతో బాబుపై కేసు నమోదు చేయడంపై తెలంగాణ ప్రభుత్వం సమాలోచనలు జరుపుతోంది. బాబును ఏ వన్ గా చేర్చాలంటూ ఇప్పటికే టీఆర్ఎస్ నేతలు పదేపదే డిమాండ్ చేస్తున్నారు. సరిగ్గా ఈ సమయంలోనే స్టీఫెన్ సన్ తో బాబు జరిపిన ఫోన్ సంభాషణలు బయటకు పొక్కాయి. ఇప్పటికే రేవంత్ రెడ్డి అరెస్ట్ తో బిక్కచచ్చిపోయిన టీడీపీ నేతలను మరింత కుంగదీసింది ఈ వ్యవహారం. దీన్ని ఖండిస్తూ రకరకాల ప్రకటనలు చేసినా.. బాబు ఇమేజ్ డ్యామేజ్ అయ్యిందన్న సంగతి మాత్రం అందరికీ అర్థమయ్యింది.
తెలంగాణలో చంద్రబాబుపై ఎక్కడ కేసులు నమోదవుతాయో అన్న అందోళనతో కొత్త స్కెచ్ ను అమలు చేయడంలో బిజీగా ఉన్నాయి తెలుగుదేశం శ్రేణులు. ఆంధ్రప్రదేశ్్లో ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తున్నాయి. చంద్రబాబు ప్రతిష్ట దిగజార్చాయంటూ కేసీఆర్ పై కేసులు పెడుతున్నాయి. ఒకవేళ హైదరాబాద్లో చంద్రబాబుపై కేసు నమోదైతే.. ఈ పోలీస్ స్టేషన్లన్నింటి నుంచీ కేసీఆర్ కు నోటీసులు పంపించాలన్నది ఏపీ ప్రభుత్వ పెద్దల వ్యూహంగా కనిపిస్తోంది.
ఎన్నికల సమయంలో నోట్ల పంపిణీ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాలు రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పటినుంచో తెరవెనుక జరుగుతున్న తతంగమే. ఈ విషయంలో ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడా లేనే లేదు. కాకపోతే.. చంద్రబాబు అండ్ కో ఇప్పుడు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. అయితే.. ఈ కేసులో బాబు టీమ్ ఎంత హుందాగా ప్రవర్తిస్తే అంత ప్రతిష్ట పెరుగుతుంది. కానీ.. చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు చేస్తున్న ప్రకటనలు సెంటిమెంట్ ను రగిలించే దిశగానే సాగుతున్నాయి. గుంటూరు మహాసంకల్పసభలో ఈ విషయాన్ని ప్రస్తావించిన చంద్రబాబు.. ఇది తనపై పెట్టిన కేసు కాదని.. ఐదుకోట్ల ఆంధ్రుల ప్రతినిధిపై పెట్టిన కేసంటూ భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. బాబు చేసిన ప్రకటనలతో రెండు పార్టీల వ్యవహారం కాస్తా రెండు రాష్ట్రాల వివాదంగా మారిపోయింది. ఇప్పటివరకూ నీటికోసం, విద్యుత్ కోసం, విద్యావ్యవస్థలో ఆధిపత్యం కోసం కొట్టుకున్న రెండు రాష్ట్రాలు.. ఇప్పుడు ఓటుకు నోటు వ్యవహారంపైనా కయ్యానికి దిగేలా పరిస్థితి దిగజారింది.

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)