తొమ్మిది మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశామని పీసీసీ చీఫ్ బొత్స ప్రకటించడం ఆలస్యం, రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ కలకలం మొదలయ్యింది. కిరణ్ సర్కార్ తో విభేదించి ఎంఐఎం దూరమయ్యాక, సభలో కాంగ్రెస్ కు 155 సభ్యుల బలం మాత్రమే ఉంది. తాజాగా తొమ్మిదిమందిపై సస్పెండ్ వేటు పడడంతో ఆ సంఖ్య 146కు చేరింది. దీంతో కిరణ్ సర్కార్ మైనార్టీలో పడినట్లేనంటోంది వైఎస్సార్ సీపీ. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో తిరుగుతున్న చంద్రబాబు ఈ అవకాశాన్ని ఎందుకు ఉపయోగించుకోరని వైఎస్సార్ సీపీ నిలదీస్తోంది. కాంగ్రెస్ తో టీడీపీ కుమ్ముక్కయ్యిందని ఆరోపిస్తున్న జగన్ పార్టీ.. ఆ ఆరోపణలు నిజం కాదని తేలాలంటే మాత్రం టీడీపీ అవిశ్వాసం పెట్టాల్సిందేనని డిమాండ్ చేస్తోంది. అవిశ్వాసం పెట్టకపోతే మాత్రం టీడీపీ-కాంగ్రెస్ లు కుమ్మక్కాయన్నదే నిజమని తేలుతుందని చెబుతోంది.
జగన్ పార్టీ మాటలదాడితో ఏంచేయాలో అర్థం కావడంలేదు తెలుగుదేశం పార్టీ నేతలకు. అవిశ్వాసంపై మాత్రం ఇంతవరకూ అధికారికంగా పార్టీ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఒకవేళ టీడీపీ స్పందిచకపోతే మాత్రం , వచ్చే సమావేశాల్లో తామే ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాలని భావిస్తోంది వైఎస్సార్ సీపీ.
Read more...
noconfidence motion లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
noconfidence motion లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
3, ఫిబ్రవరి 2013, ఆదివారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)
