కరుడు గట్టిన ఉగ్రవాది కసబ్ ఉరిశిక్ష అమలును ఆపరేషన్ కోడ్ ఎక్స్ గా నామకరణం చేసిన ప్రభుత్వం ఆఫ్జల్ గురు ఉరిశిక్షను ఆపరేషన్ త్రీస్టార్ గా పేర్కొంది. తీహార్ లోని మూడో నెంబర్ జైల్లో శిక్ష అమలుజరగడంతోనే ఆపరేషన్ త్రీస్టార్ అని వ్యవరించినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ఉరిశిక్ష అమలు గురించి చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసని వారంటున్నారు. ఎప్పుడెప్పుడు ఏం చేయాలన్నది ముందుగానే నిర్ణయం జరిగిపోయిందని, అంతా ప్లాన్ ప్రకారం పూర్తి చేసుకున్నాకే, ఉరి తీసిన విషయం బయటకు వచ్చిందని వారంటున్నారు. ఆఫ్జల్ ను ఎక్కడ ఖననం చేయాలన్నదానిపై తర్జనభర్జనలేవీ జరగలేదని, దాన్ని కూడా ప్రభుత్వం ముందే నిర్ణయించిందని తీహార్ జైలు అధికారులు చెబుతున్నారు.
ఉరిశిక్షకు జైలు నుంచి బయటకు వస్తున్న సమయంలో ఓ లెటర్ ను జైలు సూపరింటెండెంట్ కు అందించిన ఆఫ్జల్, దాన్నితన భార్యకు చేరాల్సిందిగా కోరాడు. తన మరణం గురించి వేదన చెందవద్దని, కొడుకును జాగ్రత్తగా పెంచాలని, ఇతర కుటుంబ విషయాలను అందులో పేర్కొన్నట్లు జైలు సిబ్బంది తెలిపారు.
Read more...
tihar jail లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
tihar jail లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
12, ఫిబ్రవరి 2013, మంగళవారం
దానిపేరు ఆపరేషన్ త్రీస్టార్ అట
Categories :
afzal guru . death . hang . news . operation three star . tihar jail . TOP
9, ఫిబ్రవరి 2013, శనివారం
ఆఫ్జల్ గురును ఉరి తీశారు
Categories :
afzal guru . death centence . hang . news . terrorist . tihar jail . TOP
పార్లమెంట్ పై దాడి కేసులో ప్రధాన నిందితుడు ఆఫ్జల్ గురును ఎట్టకేలకు ఉరి తీశారు. ఉదయం 8 గంటలకు తీహార్ జైల్లో ఉన్న ఆఫ్జల్ గురును, అదే జైల్లో ఉరి తీశారు. ఉరిశిక్ష అమలు విషయం తెలుసుకుని గురు కుటుంబ సభ్యులు తీవ్ర మనస్తాపం చెందారు. అతని మృతదేహాన్ని తమకు అప్పగించమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అయితే, ఆఫ్జల్ గురును బయటెక్కడ ఖననం చేసినా, అది తీవ్రవాదులకు, మతోన్మాదులకు పవిత్రస్థలంగా మారిపోతుందని, ఉగ్రవాదులను మరింతగా రెచ్చగొడుతుందని కేంద్రం భావిస్తోంది. అందుకే, కసబ్ తరహాలోనే తీహార్ జైల్లోనే ఓ ప్రాంతంలో ఖననం చేయనున్నట్లు తెలుస్తోంది. కసబ్ వ్యవహారంలానే ఈ విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం అత్యంత రహస్యంగా వ్యవహరించింది. కసబ్ కు క్షమాభిక్ష ఇవ్వకూడదని కేంద్ర హోంశాఖ నిర్ణయించుకున్నప్పటి నుంచి.. దానికి రాష్ట్రపతి ఆమోదం.. జైలు అధికారులకు ఆదేశాలు.. చివరకు ఉరిశిక్ష అమలు వరకూ చిన్న విషయాన్ని కూడా బయటకురాకుండా జాగ్రత్త పడింది. సమస్యాత్మక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేసింది.
కేసు పూర్వాపరాలు
డిసెంబర్13, 2001 లో పార్లమెంట్ పై దాడికి జైషే -ఈ - మహమ్మద్ టెర్రరిస్ట్ అయిన ఆఫ్జల్ గురు కుట్ర పన్నాడు. దీనిపై విచారించిన ఢిల్లీ కోర్టు డిసెంబర్ 18, 2002న ఉరి శిక్ష విధించింది. అక్టోబర్ 29, 2003న ఢిల్లీ హైకోర్టు దీన్ని సమర్థించింది. ఉరిశిక్షను రద్దుచేయాలన్న అప్పీల్ ను సుప్రీంకోర్టు ఆగస్టు 4, 2005న తిరస్కరించడంతో.. ఆఫ్జల్ గురుకు ఉరిశిక్ష ఖరారయ్యింది. అయితే.. దాదాపు ఏడేళ్ల పాటు దీనిపై నిర్ణయం తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం పెండింగ్ లో పెట్టింది. ఇటీవల కసబ్ ను ఉరితీసిన ప్రభుత్వం.. గురు వ్యవహారంలోనూ నిర్ణయం తీసుకుంది. ఉరి తీయాలన్న ఫైల్ ను రాష్ట్రపతికి జనవరి 21న పంపించింది కేంద్ర హోంశాఖ. ఫిబ్రవరి 3న దీనిపై సంతకం చేశారు ప్రణబ్ ముఖర్జీ. అప్పటినుంచి ఈ వ్యవహారాన్ని రహస్యంగా ఉంచిన కేంద్రం.. ఫిబ్రవరి 9న ఉదయం 8 గంటలకు తీహార్ జైల్లోనే ఆఫ్జల్ గురును ఉరి తీసింది.
Read more...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)

