పెళ్లంటే అమ్మాయి సిగ్గుల మొగ్గవుతుంది. పెళ్లి గడియలు సమీపించే కొద్దీ.. సిగ్గు ఎక్కువవుతుంది. పెళ్లి మండపంలోకి అడుగుపెడుతుంటే.. కనురెప్పలు కిందకు వాలిపోతాయి. అడుగులో అడుగువేసుకుంటూ.. అమ్మలక్కలు వెంటరాగా.. అతికష్టమంగా పెళ్లిపీటలపై అమ్మాయి కూర్చుంటుంది. ఇదీ అందరికీ తెలిసిన పెళ్లికూతుళ్ల సంగతి. కానీ ఈ పెళ్లి కూతురు కాస్త డిఫరెంట్. అందరిలా మండపంలోకి వస్తే వింతేముంటుంది.. అందుకే, వెరైటీగా ప్లాన్ చేసింది. సూపర్ స్టెప్పులు వేస్తూ.. సందడి చేసింది. పెళ్లి మండపంలో హుషారు నింపింది. సింగపూర్ లో ఫిబ్రవరి 12న జరిగిన దిలిప్, మోహనల వివాహ వేడుకల్లో ఈ వింత చోటు చేసుకుంది. పెళ్లి కూతురు మోహన పెర్ఫార్మెన్స్ చూసి.. అతిరథమహారథులంతా చప్పట్లు కొట్టారు.. కావాలంటే మీరూ వీడియో చూడొచ్చు..
Read more...
bride dance లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
bride dance లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
26, ఫిబ్రవరి 2012, ఆదివారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)
