దేశ వ్యాపంగా సంచలనం సృష్టించిన దాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌యాదవ్‌ను రాంచీ సీబీఐ కోర్టు దోషిగా తేల్చింది. 16 ఏళ్ల క్రితం మొదలైన ఈ కేసు విచారణకు, ఎట్టకేలకు శుభం కార్డు పడింది. బీహార్ ముఖ్యమంత్రిగా లాలూప్రసాద్ ఉన్నప్పుడు పశువుల దాణాకు సంబంధించి 37కోట్ల 70 లక్షలు కాజేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై సీబీఐ విచారణ చేపట్టింది. ఈ కేసులో ఇరుక్కోవడంతో బీహార్ సీఎం కుర్చీ నుంచి దిగిపోయిన లాలూ, తన భార్య రబ్రీదేవిని పదవిలో కూర్చోబెట్టి పాలన సాగించారు. సుదీర్ఘకాలం జరిగిన దర్యాప్తు, విచారణ అనంతరం సీబీఐ కోర్టు, లాలూను దోషిగా తేల్చింది. ఆయన తో పాటు మరో 45 మందిని దోషులుగా నిర్థారించింది. వీరందరికీ అక్టోబర్ 3న శిక్షలు ఖరారు చేయనుంది కోర్టు. ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం లాలూ ప్రసాద్‌కు మూడు నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. సీబీఐ
కోర్టు తీర్పు వెలువరించిన వెంటనే లాలూను బిర్సాముండా సెంట్రల్ జైలుకు తరలించారు. ఒకప్పుడు బీహార్ లో ఏకఛత్రాధిపత్యం వహించిన లాలూకు ఇది ఊహించని పరిణామమే. ఇప్పటికే కుదేలైన ఆర్జేడీ కి కూడా కోలుకోలేని దెబ్బే. అంతేకాదు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రా కూడా ఇదే కేసులో దోషిగా తేలి జైలుపాలయ్యారు. ఒకే కేసులో రెండు ప్రత్యర్థి పార్టీలకు చెందిన నేతలు, అందునా ముఖ్యమంత్రులుగా పనిచేసినవాళ్లు జైలుకు వెళ్లడం ఇదే ప్రథమం.
Read more...
jail లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
jail లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
30, సెప్టెంబర్ 2013, సోమవారం
లాలూ జైలు పాలే..
Categories :
BIHAR . cbi . FODDER SCAM . jail . LALU PRASAD YADAV . news . POLITICS . TOP
21, మార్చి 2013, గురువారం
మున్నాభాయ్ మళ్లీ జైలుకు
Categories :
bombay bomb blast . jail . news . sanjay dutt . TOP
1993 బోంబే బాంబు పేలుళ్ల కేసులో గతంలో అరెస్ట్ అయి 18 నెలల కారాగారవాసాన్ని అనుభవించిన హిందీ సినీనటుడు సంజయ్ దత్, మళ్లీ జైలుకు వెళుతున్నాడు. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్న నేరానికి గాను టాడా కోర్టు అప్పట్లో విధించిన 6 ఏళ్ల జైలు శిక్షను, సుప్రీంకోర్టు ఐదేళ్లకు తగ్గించింది. దీంతో మిగిలిన మూడేళ్ల 8 నెలల జైలుశిక్షను ఆయన అనుభవించాల్సి ఉంది. నాలుగు వారాల్లోగా సంజయ్ లొంగిపోవాలంటూ సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయం తెలియగానే సంజయ్ దత్ సోదరి ప్రియాంకదత్ కుప్పకూలిపోయారు. ఆయన భార్య మాన్యత తీవ్ర దుఖంలో మునిగిపోయారు. సంజయ్ ధైర్యంగానే ఉన్నారని, ఈ గడ్డు పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొంటారని ఆయన లాయర్ తెలిపారు. 1, ఫిబ్రవరి 2013, శుక్రవారం
ఇలాంటి వాళ్లకే ఆ రూల్సేమో..!
జైలు శిక్ష రెండేళ్లు పడ్డ ఖైదీ ఎన్నాళ్లు జైల్లో ఉంటాడు... ? రెండేళ్లే కదా..? కానీ, కొంతమందికి మాత్రం ఇది మారిపోతుంది. అధికారులకు విపరీతంగా నచ్చేస్తే రెండేళ్ల జైలు శిక్షలో 223 రోజులు అనూహ్యంగా తగ్గిపోతాయి. తక్కువ కాలం శిక్షలకూ తగ్గింపు సూత్రం వర్తిచ్చేస్తుంది. నానక్ రాం గూడ భూముల స్కామ్ లో బ్యాంకును మోసం చేయడంతో రెండేళ్ల జైలు శిక్షకు గురై కటకటాల వెనక్కు వెళ్లిన సూర్య పత్రిక అధిపతి నూకారపు సూర్యప్రకాశరావు ఇలానే విడుదలయ్యారు. సత్ప్రవర్తన బాగుందని ఆయన్ను 223 రోజుల ముందుగానే జైలు అధికారులు విడుదల చేశారు.
ఇదే సూత్రాన్ని వర్తింప జేసి, ఎంతమంది సాధారణ ఖైదీలను అధికారులు విడుదల చేసి ఉంటారు..? రెండేళ్ల జైలు శిక్షలోనూ దాదాపు సగం శిక్షను తగ్గించేసిన అధికారుల తీరును ఏమంటారు..?
Read more...
24, జనవరి 2013, గురువారం
అక్బరుద్దీన్ అవస్థలు
అనవసరంగా నోరు పారేసుకున్నందుకు తగిన మూల్యం చెల్లించుకుంటున్నారు ఎంఐఎం అగ్రనేతల్లో ఒకరైన అక్బరుద్దీన్. రాజమహల్ లాంటి ఇంట్లో హైక్లాస్ జీవితం అనుభవించే అక్బర్.. ఇప్పటికే జైలు జీవితంతో నానా అవస్థలు పడుతున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, కేసుల కారణంగా జైలు నుంచే కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. కొన్ని రోజుల క్రితమే ఆదిలాబాద్ నుంచి సంగారెడ్డి కోర్టుకు రావాల్సి వచ్చింది. నిజామాబాద్ కోర్టుకూ హాజరు కావాల్సి ఉంది. మరోవైపు రాష్ట్రంలో పలుచోట్ల ఆయనపై కేసులు నమోదవుతూనే ఉన్నాయి. వీటిపై కోర్టులు విచారణ మొదలుపెడితే, ఆయా కోర్టులకూ ఆయన్ను పోలీసులు తరలించాల్సి వస్తుంది.
తాజాగా అక్బరుద్దీన్ పై నమోదైన కేసులో బెంగళూరు ఛీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 23లోగా తమ ముందు అక్బరుద్దీన్ ను తమ ఎదుట హాజరు పరచాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో, మరోసారి సుదీర్ఘ ప్రయాణం అక్బరుద్దీన్ కు తప్పకపోవచ్చు. పైగా, ఈ కేసులన్నీ తేలేసరికి ఎన్నాళ్లు పడుతుందో, అప్పటివరకూ బెయిల్ వస్తుందో లేదో చెప్పడం కష్టమే. ఒక వేళ బెయిల్ వచ్చినా, పలు కోర్టుల్లో జరిగే ఈ విచారణకు హాజరుకావడంతోనే విలువైన సమయం అంతా హరించుకుపోతుంది.
Read more...
22, జనవరి 2013, మంగళవారం
అన్నదమ్ములిద్దరూ ఇక జైల్లో మగ్గాల్సిందేనా..?
మైనార్టీ కార్డు చూసుకుని నోరు పారేసుకున్నందుకు మూల్యం చెల్లిస్తున్నారు మజ్లిస్ పార్టీ అగ్రనేతలు అక్బరుద్దీన్, అసదుద్దీన్. ప్రభుత్వం తమను ఏమీ చేయలేదన్న ధీమాతో రెచ్చిపోయిన మాట్లాడినందుకు ఇప్పుడు జైలు పాలయ్యారు. 15 నిమిషాల సమయం ఇస్తే దేశంలోని హిందువుల అంతు చూస్తామన్న అక్బరుద్దీన్.. ప్రస్తుతం ఆదిలాబాద్ జైల్లో ఉన్నారు. ఆయనకు బెయిల్ వచ్చే సూచనలు కనిపించడం లేదు. పైగా, జిల్లాకో కేసు ఆయనపై నమోదయ్యింది.
అటు 2005లో మెదక్ జిల్లా ముత్తంగి రోడ్డు విస్తరణ పనులను అడ్డుకోవడంతో పాటు అప్పటి జిల్లా కలెక్టర్ సింఘాల్ ను దూషించినందుకు అసద్ చిక్కుల్లో పడ్డారు. ప్రభుత్వం అండ చూసుకుని ఇంతకాలం విచారణకు కూడా హాజరుకాకుండా ఉన్న అసద్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ కావడంతో.. ఒక్కసారిగా పరిణామాలు మారిపోయాయి. దీంతో దిక్కుతోచని అసద్.. నేరుగా కోర్టుకు వెళ్లి లొంగిపోయారు. ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. బెయిల్ ఇవ్వాలంటూ దాఖలు చేసిన పిటిషన్ పై మంగళవారం విచారణ జరిపిన కోర్టు.. దాన్ని కొట్టివేయడంతో అసద్ కు కష్టకాలం మొదలైనట్లే.
ఇప్పటికే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న జగన్ ఎనిమిది నెలలుగా జైల్లోనే ఉన్నారు. ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న ఎంఐఎం నేతలు కూడా జైలు పాలయ్యారు. తాజా పరిస్థితులు చూస్తుంటే.. ఇప్పట్లో మజ్లిస్ సోదరులకు బెయిల్ వచ్చే సూచనలు కనిపించడం లేదు. ఎంఐఎంలోనే మరో కీలక నేత పాషాఖాద్రీపై కూడా కేసులు నమోదు కావడంతో.. ఎంఐఎం నేతలకు దిక్కుతోచడం లేదు. ఓవైసీ బ్రదర్స్ త్వరగా బయటకు రాకపోతే మాత్రం.. ఎంఐఎం పరిస్థితి తెగిన గాలిపటంలా మారిపోయే అవకాశం ఉంది.
Read more...
మాజీ సీఎంకు పదేళ్ల జైలు
అధికారంలో ఉన్నప్పుడు ఎంత అవినీతికి పాల్పడినా చెల్లుతుందనుకునే నేతల తీరుకు చెల్లు చెప్పింది ఢిల్లీ కోర్టు. టీచర్స్ స్కామ్ లో ప్రధాన నిందితులైన హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓంప్రకాశ్ చౌతాలా, ఆయన తనయుడు అభయ్ చౌతాలాకు పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ, ఢిల్లీలోని రోహిణీ కోర్టు తీర్పు చెప్పింది. ఈ స్కామ్ లో పాలుపంచుకున్న మరో ముగ్గురికి కూడా ఇదే శిక్షను విధించింది. 1999-2000 మధ్య 3206 మంది జూనియర్ బేసిక్ ట్రైన్డ్ టీచర్ల నియామకంలో ముడుపులు తీసుకున్నారని వీరిపై అభియోగాలున్నాయి. వీటిపై సుదీర్ఘ విచారణ జరిపిన కోర్టు చౌతాలా, ఆయన కుమారుడు దోషులుగా తేల్చింది. ఇవాళ శిక్షను ఖరారు చేసింది. చౌతాలాకు జైలు శిక్ష విధించడంతో ఢిల్లీ వీధుల్లో ఆయన అనుచరులు, ఐఎన్ఎల్డీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. రోహిణి కోర్టుల దగ్గర పోలీసులపైనా దాడి చేశారు.
Read more...
11, డిసెంబర్ 2012, మంగళవారం
జైల్లో గాయపడ్డ జగన్
చంచల్‌గూడ జైలు లో ఉన్న వైయస్ జగన్‌మోహన్ రెడ్డి గాయపడ్డారు. వారం రోజులుగా గాయం వేధిస్తున్నా తేలిగ్గా తీసుకోవడంతో.. ఆయన నడవలేని స్థితికి చేరుకున్నారు. షటిల్ ఆడుతున్న సమయంలో కిందపడడంతో ఈ గాయం తగిలినట్లు తెలుస్తోంది.
ఆస్తుల కేసులో అరెస్టైన జగన్ ఆరు నెలలకు పైగా జైలు జీవితం గడుపుతున్నారు. ప్రతి రోజు కాలక్షేపం చేయడానికి ఏదో ఓ గేమ్ ఆడుతుంటారు. జగన్ ఎంతో ఇష్టంగా ఆడే గేమ్ షటిల్..ప్రతి రోజు సాయంత్రం సమయంలో గంటపాటు షటిల్ అడుతారాయన. అదే అలవాటుతో జైల్లో కూడా షటిల్ ఆడుతుండగా కాలు జారడంతో అతని బొటన వేలు కు ఫ్రాక్చర్ అయింది.
చిన్నదే కదా అనుకోని తేలిగ్గా తీసుకున్న జగన్ కు..నొప్పి తీవ్రం కావడంతో నడవలేని పరిస్థితికి చేరుకున్నారు. రెండు రోజుల్లో కాలువాపు ఎక్కువైంది. దీంతో వైద్యం కోసం ఉస్మానియా అసుపత్రికి తరలించాలనుకున్నారు జైలు అధికారులు. అయితే సెక్యూరిటీ ఇబ్బందులు ఉండడంతో .. డాక్టర్లనే జైలుకు తీసుకువెళ్లి చికిత్స చేయిస్తున్నారు. ప్రైవేటుగా ఉన్న ఓ ల్యాబ్ టెక్నిషీయన్ ను జైలులోకి తీసుకువచ్చి..లోపల ఎక్సరే తీయించారు.. చిన్న ఫ్యాక్చర్ అయినట్లు అందులో తేలింది. దీంతో వారంరోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని ..ఎక్కువగా నడవకూడదని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం జగన్ కాలి గాయం ఇప్పుడిప్పుడే తగ్గుతోందని చెబుతున్నారు వైద్యులు.
Read more...
11, జూన్ 2012, సోమవారం
డొక్కు బండిలో జగన్..
2, జనవరి 2012, సోమవారం
సబ్బులో టెర్రరిస్టుల ఎస్కేప్ స్కెచ్
Categories :
escape plan . jail . news . terrorist . TOP . vikaruudin
అత్యంత ప్రమాదకర ఐఎస్‌ఐ ఉగ్రవాది వికారుద్దీన్ వరంగల్ జైలు నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఉన్నట్లు జైలు అధికారులకు ఆధారాలు దొరికాయి. వరంగల్ సెంట్రల్ జైలు లో ఉంటున్న ఐఎస్‌ఐ ఉగ్రవాది వికారుద్దీన్, సులేమాన్, ఖాజాలు.. చాలా రోజులుగా అధికారులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. కోర్టు విచారణల కోసం.. నాంపల్లికి తరచూ రావాల్సి ఉండడంతో.. మార్గమధ్యలోనే తప్పించుకోవడానికి వారు వ్యూహరచన చేశారు.
డిసెంబరు నెలలో నాంపల్లి కోర్టులో హాజరుపరిచి.. తిరిగి తీసుకువెళుతుండగా.. వికారుద్దీన్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు.. బిర్యానీ ఇప్పించాల్సిందేనంటూ.. గొడవకు దిగాడు. ఈ టెర్రరిస్టును కంట్రోల్ చేయడానికి జనగాంలో అదనపు పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. కావాలనే, వికార్.. ఈ గొడవ సృష్టించినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీన్ని రుజువు చేస్తూ.. వరంగల్ జైలులో దొరికిన ఓ పేపర్ ముక్క.. ఉగ్రవాదుల ప్లాన్‌ను బయటపెట్టింది. రెండు రోజుల కిందట బ్యారెక్‌లో ఉన్న ఖైదీ సులేమాన్ ఓ సబ్బు ముక్కను మరో ఐఎస్‌ఐ నిందితుడు ఖాజాకు ఇవ్వాలని జైలు సిబ్బందిని కోరారు. అనుమానంతో, ఆ సబ్బును ముక్కలు చేసి చూడగా.. అందులో ఉర్దూలో రాసి ఉన్న ఓ పేపర్ కనిపించింది. దీంతో ఆ పేపర్‌ను జైలు అధికారులకు వార్డర్ అందించాడు. అందులో, ఏ ఏ కేసులు ఎప్పుడెప్పుడు కోర్టులో విచారణకు వస్తాయో తెలపాలని ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.
అయితే.. ఈ లెటర్‌లో జైలు నుంచి తప్పించుకోవడానికి కోడ్ వర్డ్స్‌తో వేసిన ఓ స్కెచ్ ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని బయటపెట్టిన సిబ్బందిని చంపేస్తానని సులేమాన్ బెదిరిస్తుండడంతో జైలు సిబ్బంది భయాందోళనలో ఉన్నారు. ఐఎస్‌ఐ ఖైదీల ప్లాన్ బయటపడడంతో, వారిని హైసెక్యూరిటీ జోన్‌లో పెట్టారు. తదుపరి కోర్టు విచారణలకు వీరిని తరలించడంపై ఉన్నతాధికారులతో సమీక్షిస్తున్నారు. జైలు భద్రతను కూడా కట్టుదిట్టం చేశారు.
Read more...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)






