మద్యం సిండికేట్ల వ్యవహారంలో మంత్రి మోపిదేవి మెడకు ఉచ్చు బిగుసుకున్నట్లే కనిపిస్తోంది. ఏసీబీ అధికారులకు చిక్కిన ఖమ్మం జిల్లా మద్యం సిండికేట్ నున్న రమణ పదే పదే మోపిదేవి పేరును చెబుతున్నట్లు తెలుస్తోంది. ఖమ్మం జిల్లాలో రెండు సిండికేట్ల మధ్య గొడవను రాజీ కుదర్చినందుకు గానీ.. మంత్రికి పది లక్షలు ముట్టజెప్పామని రమణ ఏసీబీ అధికారులకు చెప్పినట్లు సమాచారం. మంత్రి డబ్బులు తీసుకున్న మాట ముమ్మాటికి నిజమని రమణ చెబుతుండడంతో.. మంత్రికి కష్టాలు తప్పవని తెలుస్తోంది. దీంతో కలత చెందిన మోపిదేవి నిన్న సీఎంను హుటాహుటీన కలిసి కన్నీటి పర్యంతమయ్యారు. తనపేరు పదేపదే ప్రస్తావనకు రావడంపై ఆందోళన వ్యక్తం చేశారు. తనను పదవినుంచి తొలగించాలని లేదంటే తానే పదవినుంచి వైదొలుగుతానని స్పష్టం చేశారు. అయితే.. ఈ వ్యవహారం నుంచి బయటపడతారన్న నమ్మకం తనకుందని, ఆందోళన చెందాల్సిన పని లేదని.. సీఎం.. మోపిదేవికి నచ్చజెప్పారు. దీంతో మోపిదేవి రాజీనామా విషయంలో వెనక్కి తగ్గారు. అయితే.. ఈ విషయంలో నిజా నిజాల నిగ్గుతేల్చడానికి పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని కోరారు.
Read more...
madyam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
madyam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
22, ఫిబ్రవరి 2012, బుధవారం
12, ఫిబ్రవరి 2012, ఆదివారం
అరసవల్లికి పరుగెత్తిన మంత్రి మోపిదేవి
మద్యం ముడుపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి మోపిదేవి అరసవల్లి శ్రీ సూర్యనారాయణుడిని దర్సించుకున్నారు. ఈ ఉదయాన్నే అరసవల్లికి చేరుకున్న ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పరిపాలన సజావుగా సాగానే కోరుకున్నానని మంత్రిగారు మీడియాకు చెప్పినా, ఇంత హడావిడిగా అరసవల్లికి వచ్చి పూజలు చేయడంలో ఆంతర్యం వేరే అయ్యి ఉంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మద్యం ముడుపుల గొడవ నుంచి తనను బయటపడేయాలని స్వామిని వేడుకున్నట్లు తెలుస్తోంది. అన్నట్లు.. గాలి అక్రమాల కేసులో అరెస్ట్ కావడానికి ముందు కూడా ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి ఇలానే అరసవల్లికి వచ్చి పూజలు చేశారు. మరి మోపిదేవి సంగతి ఏమవుతుందో...!
Read more...
29, జనవరి 2012, ఆదివారం
మద్యం వ్యాపారులకు మూడింది
మద్యం సిండికేట్లపై రెండోరోజూ ACB దాడులు కొనసాగాయి. మొదటిసారి జరిపిన దాడుల్లో లభించిన ఆధారాల మేరకు ACB పక్కాగా దాడులు నిర్వహించింది. నెల్లూరు జిల్లాలో భారీగా అరెస్టులు చోటుచేసుకున్నాయి. సింగరాయకొండ ఎక్సైజ్ సీఐ గురవయ్య, సిండికేట్ అధ్యక్షుడు వెంకట్రావు, కోవూరు ఎక్సైజ్ ఎస్సై విజయకుమార్,బుచ్చిరెడ్డిపాళ్యం సిండికేట్ అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.
ప్రకాశం జిల్లాలో మద్యం వ్యాపారి వెంకట్రావు ఇంట్లో సోదాలు నిర్వహించిన అధికారులు తర్వాత అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించి ఆస్తులున్న ఎక్సైజ్ సీఐ గురవయ్యని అదుపులోకి తీసుకున్నారు...
ఇక ఉత్తరాంధ్రలో రెండ్రోజుల సోదాల్లో ముగ్గురు ఎక్సైజ్ అధికారులు, ఓ హెడ్‌కానిస్టేబుల్ సహా 11మందిని అరెస్ట్ చేశారు. సోదాల్లో ఎక్సైజ్ సిబ్బందితో పాటు మీడియా ప్రతినిధులకు నెలవారి కమిషన్లు అందినట్లు పక్కా ఆధారాలు లభించాయి. వ్యాపారుల అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ మద్యం డీలర్లు ACB కార్యాలయానికి తరలివచ్చారు. ప్రభుత్వం వేధిస్తోందని ఆరోపించారు.
వరంగల్‌లో ఎనిమిదిమంది వ్యాపారులతో పాటు ఓ ఎక్సైజ్ సీఐని అరెస్ట్ చేసిన ACB వారికి MGMలో వైద్య పరీక్షలు నిర్వహించింది. తర్వాత వారిని హైదరాబాద్ తరలించింది. ఇంతకాలం దర్జాగా సిండికేట్లతో దోచుకున్న అక్రమార్కులు ఎప్పుడు ACB విరుచుకుపడుతుందా అన్న ఆందోళనతో కాలం గడుపుతున్నారు.
Read more...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)


