దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరుషి హత్య కేసు, సినీ నిర్మాతలకు మాంచి మార్కెట్ సరుకుగా మారింది. ఎవరు చంపారో స్పష్టమైన ఆధారాలు లేకపోయినా, సంఘటన జరిగిన తీరును బట్టి తల్లిదండ్రులే హంతకులని తేల్చింది కోర్టు. ఐదేళ్లపాటు దేశం మొత్తాన్ని కుదిపేసిన ఈ కేసును ఆధారంగా చేసుకుని సినిమా తీస్తే బాక్సాఫీస్ దగ్గర కాసులు కొల్లగొట్టొచ్చని కలలు కంటున్నారు సినీ నిర్మాతలు. సర్కార్ సినిమాకు స్క్రిప్ట్ అందించిన మోహన్ గుప్తా అయితే, సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేసేశాడు కూడా. మరో బాలీవుడ్ నిర్మాత సినిమా తీయడానికి సిద్ధమవుతున్నాడు. ఇదంతా ఓ ఎత్తైతే బ్రిటన్ కు చెందిన ఓ హాలీవుడ్ డైరెక్టర్ ఆరుషి కథపై సినిమా తీయడానికి, పుస్తకం రాయడానికి సహకరిస్తే ఏకంగా ఐదు కోట్లు ఇస్తానంటూ ఆమె తల్లిదండ్రల ముందు ప్రతిపాదన పెట్టాడు. జైలు అధికారులు అనుమతించకపోవడంతో రాజేశ్, నుపూర్ లను కలవలేకపోయిన ఆయన, ఎలాగైనా సినిమా తీయడానికి వారిని ఒప్పించాలనుకుంటున్నాడు. అయితే, ఇప్పటికీ ఆరుషిని తాము హత్య చేయలేదంటున్న ఆ దంపతులు, ఈ సినిమా వార్తలతో తీవ్ర కలవరానికి గురైనట్లు సమాచారం. ఎవరైనా తమ కుమార్తెపై సినిమా తీస్తే, న్యాయపరమైన చర్యలు తప్పవని వారి లాయర్ ద్వారా హెచ్చరికలు జారీ చేశారు.
Read more...
arushi talwar లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
arushi talwar లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
1, డిసెంబర్ 2013, ఆదివారం
సినిమా తీస్తే కోర్టుకీడుస్తాం
Categories :
arushi talwar . double murder case . movie on arushi . news . noida . TOP
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)
