దిల్ సుఖ్ నగర్ పేలుళ్ల వెనుక భారీ కుట్రను చేధించే దిశలో దర్యాప్తు బృందాలు వేగంగా కదులుతున్నాయి. ఈ పేలుళ్లకు పాల్పడ్డవారు స్థానికంగా ఉన్న ఓ హోటల్ లోనే ఉన్నారని తేల్చిన పోలీసులు, సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ఆధారంగా వారిని కనిపెట్టే పనిలో పడ్డారు. అటు పేలుడు ప్రాంతంలో ఓ షాపింగ్ మాల్ కెమెరాలో సైకిల్ పై వచ్చిన దుండగుడి దృశ్యాలు రికార్డైనట్లు తెలుస్తోంది. అయితే, దృశ్యాలు అస్పష్టంగా ఉండడంతో వాటిని ముంబైలోని ఓ ఫిలిం ల్యాబ్ కు పంపించింది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ.
ఇక ఈ పేలుళ్లకు పాల్పడిన దుండగులకు ఆర్థిక సహకారం దుబాయ్ నుంచి అందినట్లు NIA గుర్తించింది. దుబాయ్ లోని ఓ ఇండస్ట్రియల్ ఏరియా నుంచి హవాలా మార్గంలో భారీ మొత్తం హైదరాబాద్ కు వచ్చినట్లు తెలుస్తోంది. ఇండియన్ ముజాహిదీ సహ స్థాపకుడు యాసిన్ భత్కాల్ ఈ డబ్బును పంపించి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఎవరికి ద్వారా ఈ డబ్బు చేరిందన్నదానిపై దర్యాప్తు సాగిస్తున్నారు.
dilsuknagar blast లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
dilsuknagar blast లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
25, ఫిబ్రవరి 2013, సోమవారం
దిల్ సుఖ్ నగర్ కు దుబాయ్ కు లింకు
Categories :
dilsuknagar blast . dubai link . hyderabad blasts . INDIAN MUJAHIDEEN . money . news . TOP
దిల్ సుఖ్ నగర్ పేలుళ్ల వెనుక భారీ కుట్రను చేధించే దిశలో దర్యాప్తు బృందాలు వేగంగా కదులుతున్నాయి. ఈ పేలుళ్లకు పాల్పడ్డవారు స్థానికంగా ఉన్న ఓ హోటల్ లోనే ఉన్నారని తేల్చిన పోలీసులు, సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ఆధారంగా వారిని కనిపెట్టే పనిలో పడ్డారు. అటు పేలుడు ప్రాంతంలో ఓ షాపింగ్ మాల్ కెమెరాలో సైకిల్ పై వచ్చిన దుండగుడి దృశ్యాలు రికార్డైనట్లు తెలుస్తోంది. అయితే, దృశ్యాలు అస్పష్టంగా ఉండడంతో వాటిని ముంబైలోని ఓ ఫిలిం ల్యాబ్ కు పంపించింది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ.
ఇక ఈ పేలుళ్లకు పాల్పడిన దుండగులకు ఆర్థిక సహకారం దుబాయ్ నుంచి అందినట్లు NIA గుర్తించింది. దుబాయ్ లోని ఓ ఇండస్ట్రియల్ ఏరియా నుంచి హవాలా మార్గంలో భారీ మొత్తం హైదరాబాద్ కు వచ్చినట్లు తెలుస్తోంది. ఇండియన్ ముజాహిదీ సహ స్థాపకుడు యాసిన్ భత్కాల్ ఈ డబ్బును పంపించి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఎవరికి ద్వారా ఈ డబ్బు చేరిందన్నదానిపై దర్యాప్తు సాగిస్తున్నారు. 22, ఫిబ్రవరి 2013, శుక్రవారం
రాజధానిలో ఇంకెన్నాళ్లు రక్తం చిందాలి..?
Categories :
dilsuknagar blast . hyderabad blasts . news . terrorist . TOP . twin blasts
దిల్ సుఖ్ నగర్ పేలుళ్ల ఘటన.. హైదరాబాద్‌ను మరోసారి ఉలిక్కి పడేలా చేసింది. బాంబ్ బ్లాస్టులు రాజధాని నగరానిక కొత్తేంకాదు. లష్కరే తొయిబా, ఇండియన్ ముజాయిద్దీన్ లాంటి ఉగ్రవాద సంస్థలు తమ ఉనికిని చూపాలకున్న సందర్భాల్లో చాలాసార్లు హైదరాబాద్‌పై తెగబడ్డాయి. నెత్తురు చిందించాయి.. ఇప్పటివరకు హైదరాబాద్‌లో జరిగిన పేలుళ్లను ఒక్కసారి చూద్దాం
2002 నవంబర్ 21
దిల్‌సుఖ్‌నగర్‌లోని సాయిబాబా ఆలయం వద్ద ఉగ్రవాదులు బాంబులు పేల్చారు . ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, 22 మంది గాయపడ్డారు.
2004
ఈ ఏడాది మూడుసార్లు బాంబు పేలుళ్ల జరిగాయి. నవంబర్ 1న సరూర్ నగర్ దగ్గర పార్క్ చేసిన ఓ ఇంజినీరింగ్ కాలేజ్ బస్సు కింద బాబు పేలింది. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. ప్రాణనష్టం ఏమి జరుగకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం మూడు రోజులకే అంటే నవంబర్ 4న పోలీస్ కంట్రోల్ రూం సమీపంలోనే పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ పాదాచారి గాయపడ్డారు. 2004 నవంబర్ 12 జామై ఉస్మానియా రైల్వేస్టేషన్ సమీపంలో ప్రైవేటు బస్సులో పేలుడు జరిగింది.
2005
ఈ ఏడాది కూడా రెండుసార్లు నగరంలో పేలుళ్లు జరిగాయి. ఏప్రిల్ 14న నక్లెస్ రోడ్డు సమీపంలో రైల్వే ట్రాక్ పక్కన బాంబు పేలుడు జరిగింది. అనంతరం సరిగ్గా ఆరునెలలకు అంటే ఆక్టోబర్ 12వ తేదీన బేగంపేటలోని టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో హోం గార్డు మరణించాడు. కానిస్టేబుల్ ఒకరు తీవ్రంగా గాయపడ్డాడు.
2006
ఈ ఏడాది రెండుసార్లు పేలుళ్లు జరిగాయి. మే 7న నగరంలోని ఒడియన్ థియేటర్‌లో బాంబు పేలుళ్లు సంభవించి ఓ యువతితో సహా ముగ్గురు గాయపడ్డారు. అదే నెల 11న బంజారాహిల్స్ సమీపంలో ఇందిరా నగర్‌లో ఇంట్లో చెత్త సామాన్లు తొలగిస్తుండగా బాక్స్‌లోని బాంబు పేలింది. మరో బాంబును పోలీస్‌లు నిర్వీర్యం చేశారు.
2007
మూడుసార్లు ఉగ్రవాదులు బాంబులు పేల్చారు. మే 1న మలక్ పేటలో లెటర్ పార్శిల్ బాంబు పేలుడు జరిగి ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. మే 18న పాతబస్తీ మక్కా మసీదులో బాంబులు పేలి 14 మంది మృత్యవాత పడ్డారు. మరో మూడు బాంబులను నిర్వీర్యం చేశారు పోలీసులు. ఆగస్ట్ 25న లుంబినీ పార్క్ , కోఠిలోని గోకుల్ ఛాట్‌లో సంబంవించిన పేలుళ్లలో 42 మంది మరణించారు. దిల్‌సుఖ్‌నగర్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కింద పెట్టిన మరో బాంబును పోలీసులు నిర్వీర్యం చేశారు.
2013
ఫిబ్రవరి 21న దిల్ సుఖ్ నగర్లో జంట పేలుళ్లు.
ఐఈడీ అంటే ఏమిటి..?
Categories :
bomb blast . dilsuknagar blast . IED . news . terrorist . TOP
దేశంలో ఎక్కడ ఏ బాంబు పేలుడు జరిగినా, అందుకు వాడుతున్నది ఐఈడీనే. IEDనే. తక్కువ పరిమాణంలో ఉండే బాంబులను వాడి.. ఎక్కువ నష్టాన్ని కలిగించడానికి ఈ ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజెస్‌నే టెర్రరిస్టులు ఎక్కువగా వాడుతున్నారు. రెండో ప్రపంచ యుద్ధకాలంలోనే వీటి తయారీ మొదలైంది. ప్రధానంగా, గెరిల్లా దాడులకు పాల్పడేవారు, ఉగ్రవాదసంస్థలు, మావోయిస్టులు వీటిని దాడులకు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఆర్డీఎక్స్ కన్నా ఎక్కువ విధ్వంసాన్ని ఈ ఐఈడీల ద్వారా సృష్టించవచ్చు.
దిల్‌సుఖ్‌నగర్ జంటపేలుళ్లలోనూ IEDలనే ఉపయోగించారు టెర్రరిస్టులు. ముంబై, పూణే,ఢిల్లీ, బెంగళూరు పేలుళ్లోనూ వీటినే వాడారు. ఉగ్రవాదులు జనాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ బాంబులను తరచూ పేల్చుతున్నారు. అటు మావోయిస్టులు కూడా అడవుల్లో కూబింగ్ చేస్తున్న పోలీసులను లక్ష్యంగా చేసుకుని ఐఈడీలను ప్రయోగిస్తున్నారు. నేషనల్ సెక్యూరిటీ గ్రూప్ ఆధ్వర్యంలో పనిచేసే నేషనల్ బాంబ్ డాటా సెంటర్ వివరాల ప్రకారం.. 2012లో మనదేశంలో మొత్తం 241 IEDల పేలుళ్లు జరిగాయి. వీటిలో 119 IEDలు ప్రజలను లక్ష్యంగా చేసుకుని ప్రయోగించినవే. ఈ పేలుళ్లలో 113మంది సామాన్యులు ప్రాణాలను వదిలారు.
IED లో స్విచ్, ఫ్యూజ్, కంటైనర్, పేలుడు పదార్థం, బ్యాటరీలు ఉంటాయి. స్విచ్ స్థానంలో మొబైల్‌ఫోన్‌ను గానీ, టైమర్‌ను గానీ ఇపయోగిస్తున్నారు. ఇక పేలుడు పదార్థాల విషయానికి వస్తే అమ్మోనియం నైట్రేట్ లాంటివి ఉపయోగిస్తారు. దీనికి PETNను జోడిస్తే పేలుడు తీవ్రత మరింత పెరుగుతుంది. టెర్రరిస్టులు వీటి తయారీపైనే ఎక్కువగా కాన్‌సన్‌ట్రేట్ చేస్తున్నాయి. హైదరాబాద్ లో జరిగిన అన్ని పేలుళ్లలోనూ ఐఈడీలనే ఎక్కువగా ఉపయోగించారు. వీటిని మన దేశంలో ఎక్కువగా ఇండియన్ ముజాహిదీన్ సంస్థే ఉపయోగిస్తోంది.
ఐదు చోట్ల కాదు.. రెండు చోట్లే పేలుళ్లు.. 15 మంది వరకూ దుర్మరణం
Categories :
dilsuknagar blast . news . terrorist . TOP
ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రద్దీగా ఉండే దిల్‌సుఖ్ నగర్‌లో రెండు చోట్ల బాంబు పేలుళ్లు వరసగా సంభవించాయి. ఆఫీసులు, స్కూళ్లు, కాలేజీలనుంచి అంతా ఇళ్లకు వెళ్లే సమయాన్ని ఎంచుకున్న ఉగ్రవాదులు.. అత్యంత దారుణంగా పేలుళ్లకు ఒడిగట్టారు. కోణార్క్ థియేటర్ దగ్గర తొలి పేలుడు సంభవించిన కొంతసేపటికే, ఫుట్‌ఓవర్ బ్రిడ్జి దగ్గరున్న మోతేశ్వరీ కాంప్లెక్స్‌లోని ఓ సెల్‌ఫోన్ షాప్ దగ్గర రెండో బాబు పేలింది.
సైకిళ్లపై ఉంచిన రెక్సిన్ బ్యాగుల్లో బాంబులు పెట్టి పేల్చారు ఉగ్రవాదులు. పేలుడు దాటికి కొంతమంది అక్కడికక్కడే మృతి చెందారు. భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో జనం ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ప్రాణభయంతో పరుగులు తీశారు. పేలుడు కారణంగా కోణార్క్ థియేటర్ పరిసర ప్రాంతాలు భీతావహంగా మారిపోయాయి. మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి.
పేలుడు సంభవించిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు భారీగా సోదాలు నిర్వహించారు. గాయపడిన వారిని యశోదా, ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగేలా కనిపిస్తోంది. డీజీపీ సహా పోలీసు ఉన్నతాధికారులు ఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించారు. వరుస పేలుళ్లు ఉగ్రవాదుల చర్యేనన్నారు డీజీపీ. రెండు చోట్ల IED బాంబులు పేల్చడం వల్లే భారీ ప్రాణనష్టం జరిగిందన్నారు. బాంబుల్లో మేకులతో పాటు.. ఐరెన్ బాల్స్ వాడినట్లు గుర్తించామన్నారు దినేశ్‌రెడ్డి.
అటు ఈ పేలుళ్లపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి. ఈ దారుణానికి ఒడిగట్టినవారికి పట్టుకుని శిక్షిస్తామన్నారాయన. పేలుళ్లు జరిగిన ప్రాంతానికి వెళ్లి.. వివరాలు తెలుసుకున్నారు. పేలుళ్లలో చనిపోయిన వారి కుటుంబాలకు కేంద్రం 2 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం 6 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియాను ప్రకటించింది. క్షతగాత్రులకు కేంద్రం 50 వేలు, రాష్ట్రం 50 వేల నుంచి లక్ష రూపాయల వరకూ సహాయాన్ని అందిస్తామని తెలిపాయి. గాయపడిన వారికి పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతోనే అత్యాధునిక వైద్యం అందిస్తామన్నారు సీఎం.
సీఎంతో పాటే హోంమంత్రి సబితారెడ్డి రెడ్డి కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆస్పత్రులకు వెళ్లి గాయపడ్డవారిని పరామర్శించారు. ప్రజలు మనో ధైర్యంగా ఉండాలనీ... పుకార్లు నమ్మొద్దన్నారు సబితా ఇంద్రారెడ్డి . ఈ పేలుళ్ల వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ హుటాహుటీన రంగంలోకి దిగింది. పేలుళ్లు జరిగిన ప్రాంతాల నుంచి NIA టీమ్ ఆధారాలను సేకరించింది. దీనిపై హైదరాబాద్ పోలీసులు కూడా దర్యాప్తు మొదలుపెట్టారు.
NSG కి చెందిన పోస్ట్ బ్లాస్ట్ టీమ్ కూడా రంగంలోకి దిగింది. ఢిల్లీ నుంచి అర్థరాత్రి హైదరాబాద్‌కు వచ్చిన ఈ బృదం నేరుగా దిల్‌సుఖ్‌నగర్‌కు వెళ్లి పూర్తి వివరాలను సేకరించింది.
ఇండియన్ ముజాహిదీన్ పనే..!
Categories :
dilsuknagar blast . INDIAN MUJAHIDEEN . news . terrorist . TOP
దిల్‌సుఖ్ నగర్ పేలుళ్లు ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదుల దుశ్చర్యగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పేలుళ్లకు సైకిళ్లు వినియోగించడం ఈ అనుమానాలకు కారణంగా చెబుతున్నారు. మక్కా మసీద్ పేలుళ్లకు ప్రతీకారంగా.. 2007 ఆగస్టు 25న గోకుల్‌చాట్, లుంబినీ పార్కుల్లో ఐఎం మాస్టర్‌మైండ్ రియాజ్ భత్కల్ నేతృత్వంలో విధ్వంసాలకు తెగబడిన ఉగ్రవాదులు దిల్‌సుఖ్‌నగర్ ఫుట్‌ఓవర్ బ్రిడ్జి వద్దా బాంబు పెట్టారు. గోకుల్,లుంబినీల్లో చాలామంది ప్రాణాలు కోల్పోగా.. దిల్‌సుఖ్‌నగర్ బాంబు మాత్రం పేలలేదు. ఐదున్నరేళ్ల తర్వాత.. కసబ్, అఫ్జల్ గురుల ఉరితీత నేపథ్యంలో మళ్లీ ఇదే ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని పేలుళ్లు జరిగాయి. ఇవి కూడా రియాజ్ నేతృత్వంలోని ఐఎం ఉగ్రవాదుల పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు.
హైదరాబాద్‌లో చాలాకాలంగా ఇండియన్ ముజాహిదీన్ తీవ్రవాదులు మకాం వేశారు. పూణే,ఢిల్లీ, బెంగళూరు బ్లాస్ట్‌లతో సంబంధం ఉన్న కొంతమంది IM టెర్రరిస్టులు ఆయా ప్రాంతాల పోలీసులు హైదరాబాద్‌లోనే అరెస్ట్ చేశారు. నిషేధిత ఉగ్రవాద సంస్థ సిమి నుంచే ఇండియన్ ముజాహిదీన్ ఏర్పడింది. సిమి అగ్రనేతలపై నిఘా సంస్థల నజర్ ఉండడంతో, దిగువస్థాయి నేతలు ఇండియన్ ముజాహిదీన్‌ను ఏర్పాటు చేశారు. పాకిస్తాన్‌కు చెందినది కాకుండా.. దేశీయ జిహాదీ సంస్థగా ప్రచారం చేసుకోవడం కోసం.. ఇండియన్ ముజాహిదీన్ అన్న పేరును పెట్టారు. 2005 నుంచి ఈ సంస్థ మన దేశంలో దాడులకు తగబడుతోంది. 2008లో బాట్లా ఎన్‌కౌంటర్‌లో చాలామంది ఉగ్రవాదులు చనిపోయినా, ఈ సంస్థ తన కార్యకలాపాలను కొనసాగిస్తూనే ఉంది.
2010లో పూణేలోని జర్మన్ బేకరీలో, 2011లో ముంబాయి జవేరీ బజార్‌లో, 2012 ఆగస్టు 1న మళ్లీ పూణేలో, ఇప్పుడు హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లో పేలుళ్లకు పాల్పడింది. ఇటీవలి కాలంలో దేశంలో జరిగిన అతిపెద్ద ఉగ్రవాద దాడి ఇదే. రద్దీగా ఉన్న సమయాలు, మార్కెట్లు, దుకాణాల దగ్గరే బాంబులు పేల్చడం ఇండియన్ ముజాహిదీన్ అలవాటు. దిల్‌సుఖ్‌నగర్‌లోనూ అలాంటి ప్రాంతాల్లోనే బాంబులు పెట్టింది. పైగా, అత్యాధునిక బాంబులు తయారు చేసే పరిజ్ఞానం కూడా ఐఎం తీవ్రవాదుల వద్ద ఉంది. 2008 జైపూర్ పేలుళ్లకు, దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్లకూ పోలికలు కనిపిస్తున్నాయి. రెండుచోట్లా సైకిల్ బాంబులనే ఉపయోగించారు. దీంతో.. ఈ పేలుళ్లు ఇండియన్ ముజాహిదీన్ పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు.
21, ఫిబ్రవరి 2013, గురువారం
హైదరాబాద్ బాంబు పేలుళ్ల దృశ్యాలు
Categories :
blast . dilsuknagar blast . hyderabad blasts . news . POLITICS . TOP
హైదరాబాద్ బాంబు పేలుళ్లలో దాదాపు 20 మంది మరణించినట్లు తెలుస్తోంది. వెంకటాద్రి థియేటర్ దగ్గర ఓ బాంబును పోలీసులు గుర్తించారు. ఈ పేలుళ్లపై పూర్తిస్థాయి విచారణకు సీఎం కిరణ్ ఆదేశించారు. పేలుళ్లు జరిగిన ప్రాంతంలో రక్తపుమరకలతో అత్యంత విధ్వంసకరంగా కనిపిస్తోంది. ఉస్మానియా ఆస్పత్రి క్షతగాత్రులతో నిండిపోయింది.




బ్రేకింగ్ న్యూస్: హైదరాబాద్ లో బాంబు పేలుళ్లు.. 20 మందికి పైగా మృతి
Categories :
bomb blast . dilsuknagar blast . hyderabad . news . terrorist . TOP
అత్యంత రద్దీగా ఉండే దిల్ సుఖ్ నగర్ ప్రాంతంలో ఐదు చోట్ల బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో దాదాపు 20మంది చనిపోయి ఉండొచ్చని తెలుస్తోంది. 50 మందికి పైగా గాయాలయ్యాయి. దిల్ సుఖ్ నగర్ బస్టాండ్ కు ఎదురుగా ఉన్న వెంకటాద్రి, కోణార్క్ థియేటర్, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, ఆనంద్ టిఫిన్ సెంటర్ ల దగ్గర రాత్రి 7 గంటల నుంచి 7 గంటల 7 నిమిషాల మధ్య బాంబులు ఒక్కసారిగా బాంబుల పేలాయి. పేలుళ్ల శబ్ధం విని జనం భయాందోళనలకు గురయ్యారు. తలోదిక్కూ పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలోనూ చాలా మంది గాయపడ్డారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు పోలీసులు. భారీగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. పేలుళ్లపై కేంద్ర హోంమంత్రి షిండే ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)