23, డిసెంబర్ 2010, గురువారం
మగాళ్లకు మాత్రమే..
Categories :
అమ్మాయిని చూస్తే.. అబ్బాయికి.. అబ్బాయిని చూస్తే అమ్మాయికి... కలిగేదే ఆకర్షణ. నచ్చినవారు కనిపిస్తే మది పులకిస్తుంది. మదనరాగం ఆలపిస్తుంది. స్త్రీ పురుషుల మధ్య ఇలాంటి ఆకర్షణ సహజసిద్ధం. కానీ.. ఓ మగాడికి. .మరో మగాడి మధ్యే ఆకర్షణ చిగురిస్తే.. అది ఏ బంధం... దాన్ని ఏమని పిలవాలి..? ఇప్పుడు మన చుట్టూ ఇలాంటి వారే పెరుగుతున్నారు.
అందమైన అమ్మాయిని చూడగానే అబ్బాయి మనస్సు గాల్లో తేలిపోతుంది. మెచ్చినవాడు కంటపడితే అమ్మాయి ఊహాలోకంలోకి పరుగులు పెడుతుంది. అబ్బాయికి అమ్మాయి కావాలి.. అమ్మాయికి అబ్బాయి కావాలి. ఒకరికొకరు తోడు కావాలి. స్త్రీ, పురుషుల మనసులు కలిస్తే.. ఊహాలోకం నేలకు దిగివస్తుంది. వారిని ఏకం చేస్తుంది. అందరూ ఉన్నా.. వారిద్దరికీ ఏకాంత లోకమవుతుంది. స్త్రీ పురుషుల శరీరాల్లోనే ఓ అద్భుతమైన అయస్కాతం ఉంటుంది. ప్రకృతి పులకరించినప్పుడు ఆ ఆకర్షణ పెరుగుతుంది. రెండు తనువులను ఏకం చేస్తుంది. సృష్టి ధర్మాన్ని కాపాడుతూ మరో జీవికి ప్రాణం పోసే మహాయజ్ఞం నిర్విఘ్నంగా సాగుతుంది.
సృష్టి ప్రారంభం నుంచి, కొనసాగుతున్న మహాప్రక్రియ ఇది. అందుకే.. స్త్రీ, పురుషుల మధ్య శృంగారం ప్రకృతి ధర్మమయ్యింది. కట్టుబాట్లకు లోబడి అది సాగితే ఎవరికీ ఇబ్బంది లేదు. కానీ, శృంగారంలో ఇప్పుడు ప్రకృతి విరుద్ధమైన పోకడలు ఎక్కువవుతున్నాయి. లైంగిక వాంఛలు తీర్చుకోవడానికి ఇంతకాలం.. స్త్రీనే కోరుకున్న పురుషుడు.. ఇప్పుడు మనసు మార్చుకుంటున్నాడు. తనలాంటి మరో మగాడితో గడపడానికి ప్రాధాన్యం ఇస్తున్నాడు. అదే.. మేల్ సెక్స్ విత్ మేల్. MSMగా పిలిచే ఈ శృంగార పద్దతి మన దగ్గర శరవేగంగా విస్తరిస్తోంది. అసలు మగాడితో మగాడికి అవసరం ఎందుకు వస్తోంది..?
మగాళ్లే కావాలి..
వాళ్లూ మగాళ్లే... అందరిలాంటి వారే. కానీ, శృంగారం విషయంలో మాత్రం వారి ఫీలింగ్స్ వేరు. తోడు కోసం తపించినా వారికి కావాల్సింది స్త్రీ సాంగత్యం కాదు. పురుష సంభోగం. తమలాంటి మగాళ్లతోనే ఏకాంతాన్ని కోరుకుంటున్నారు కొంతమంది మగాళ్లు. వాళ్లే MSMలు. ఆడవాళ్లను చూస్తే రాని ఫీలింగ్.. మగాళ్లను చూడగానే మదిలో మొలకెత్తుతాయి. వారితో కాసేపన్నా గడపాలన్న కోరిక పుడుతుంది. హోమోసెక్స్‌ను ఎంజాయ్ చేయడానికి తమలాంటి వారికోసం అన్వేషణ మొదలుపెడతారు. అలాంటి వారు తారసపడితే, వారికి బంగారు నిధి దొరికినట్లే. కొంతమంది స్త్రీలతోనూ శృంగారంలో పాల్గొంటున్నా.. మగాళ్లతో గడిపినప్పుడే అసలైన అనుభూతిని పొందుతామనుకుంటారు.
ప్రపంచ వ్యాప్తంగా హోమోసెక్సువల్స్ పెరుగుతున్నారు. స్త్రీ,పురుషులు కలిసి జంటగా ఉండడం కన్నా, ఇద్దరు మగాళ్లే జంటగా ఏర్పడుతున్నారు. ఫారిన్ కంట్రీస్‌లో ఇలాంటి వారికి ఆదరణ కూడా లభిస్తుండడంతో, ఈ ధోరణి మరింతగా పెరుగుతోంది. మన దగ్గర కూడా ఎంతో కాలంగా ఇలా మగాళ్లనే కోరుకునే మగాళ్లున్నప్పటికీ, వారి సంఖ్య ఈ మధ్యే వేగంగా పెరుగుతోంది. ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ చేసిన సర్వే ప్రకారమే.. రాష్ట్రంలో పురుష స్వలింగ సంపర్కుల సంఖ్య 60 వేలు. ఇది అధికారికంగా గుర్తించిన సంఖ్య మాత్రమే. బయటపడకుండా.. గుట్టు చప్పుడుగా స్వలింగ సంపర్కాన్ని కొనసాగిస్తున్న వారు లక్షమందికి పైగా ఉండొచ్చన్నది స్వచ్ఛంద సంస్థల అంచనా.
తోటి పురుషులతో తాత్కాలికంగానూ, శాశ్వతంగానూ శారీరక సంబంధాలను ఏర్పరుచుకుంటున్నారు చాలామంది మగాళ్లు. కొంతమంది సాధారణ జీవితం గడుపుతూనే, తరచుగా పురుషులతోనూ సెక్స్‌లో పాల్గొంటుంటారు. ఇక మరికొంతమంది స్త్రీలకు పూర్తిగా దూరంగా ఉండి పురుషులతోనే లైంగికవాంఛలు తీర్చుకుంటారు. ఈ రెండు కేటగిరీలు కాకుండా..మరో రకం మగాళ్లు, పురుషుల వాంఛలను తీర్చడానికి సిద్ధంగా ఉంటారు. చెప్పాలంటే శృంగారంలో స్త్రీ పాత్రను వీరు పోషిస్తారు. అయితే.. ఇది సెక్స్ ట్రేడ్‌లో భాగంగానే సాగుతుంది. ఓ రకంగా.. వీరు మగవేశ్యలన్నమాట.
హోమోసెక్స్ ట్రేడ్
మగవేశ్యలు పెరుగుతున్నారు. మగాళ్లను తృప్తి పరచడానికి మగాళ్లే వేశ్యల అవతారం ఎత్తుతున్నారు. ప్రతీ జిల్లాలోనూ ఇలా కమర్షియల్‌గా సెక్స్ ట్రేడ్‌లోకి దిగుతున్న ఎంఎస్‌ఎంల సంఖ్య వేయికి పైనే ఉంది. జనాలు ఎక్కువగా ఉండే బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్లు, సినిమాహాళ్లే వీరి హాట్‌స్పాట్‌లు. అక్కడే తమ అవసరం ఉన్న మగాళ్ల కోసం ఎదురు చూస్తుంటారు.
ఎంఎస్ఎంలు సెక్స్ ఛేంజ్ ఆపరేషన్లు చేయించుకోరు. హిజ్రాలుగా మారరు. మగాళ్లలానే జీవిస్తారు. కానీ, శృంగారాన్ని మాత్రం స్త్రీలతో కాక, పురుషలతో సాగిస్తుంటారు. స్వలింగ సంపర్కులు అందరి మగాళ్లలానే ఉన్నప్పటికీ, సెక్స్ ట్రేడ్‌లో ఉండే వారు మాత్రం తమ గెటప్‌ను కొద్దిగా మారుస్తారు. తాము హోమోసెక్స్‌వల్స్ అన్న సిగ్నల్స్‌ను జనంలోకి పంపిస్తుంటారు. ఈ పద్దతుల్లోనే మరో మగాడ్ని ఆకర్షిస్తారు. వీలైతే ఆ ప్రాంతంలోనే సెక్స్ జరుపుతారు. లేదంటే, ఫోన్ నెంబర్లు తీసుకొని, కుదిరినప్పుడు ఏకాంతంగా కలుస్తారు.
స్వలింగ సంపర్కం ఎందుకు?
వ్యభిచారంపై మనదగ్గర ఉన్న నిషేధమే ఎంఎస్‌ఎంల సంఖ్యను పెరిగేలా చేస్తోంది. సెక్స్ వర్కర్స్‌తో లాడ్జిలకు వెళ్లడం, జనం మధ్య గడపడమూ కష్టమే. పైగా పోలీసుల రైడింగ్‌లో దొరికితే ఎన్నో సమస్యలు. అదే మగవాడితో అయితే.. ఫ్రెండ్స్‌లా మూవ్ కావచ్చు. ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లిపోవచ్చు. ఎవరికీ అనుమానం రాదు. మేల్ సెక్స్ విత్ మేల్ ఎక్కువగా పెరగడానికి ప్రధాన కారణం ఇదే. స్వలింగ సంపర్కులు.. సెక్స్‌ట్రేడ్‌లోకి రావడానికి ఎన్నో కారణాలున్నాయి. మొదటిది ఆర్థికపరమైన ఇబ్బందులు. సులువుగా డబ్బు సంపాదించవచ్చన్న ఆశే.. హోమోసెక్స్‌వల్స్‌ను వ్యభిచారంలోకి దింపుతోంది.
మగవేశ్యలకు డిమాండ్ పెరుగుతోందంటున్నాయి స్వచ్ఛంద సంస్థలు. ప్రతీ ఏటా, ఇలాంటి వారిని కోరుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతోందంట. ఇప్పటివరకూ అయితే.. మన దగ్గర ఈ హోమోసెక్స్ చీకటిమాటునే సాగుతోంది. మరికొన్నాళ్లు పోతే, విదేశాల్లో సర్వసాధారణంగా కనిపించే దృశ్యాలు మనదగ్గరా కనిపించవచ్చు.
మగాళ్లు ఎందుకు మారుతున్నారు?
స్వలింగ సంపర్కులు పెరగడానికి రకరకాల పరిస్థితులు దోహదం చేస్తున్నాయి. చెప్పాలంటే చిన్న తనంలోనే ఎంతోమంది దీనికి అలవాటు పడుతున్నారు. విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన రెసిడెన్షియల్ స్కూళ్లలోనే దీనికి బీజం పడుతోంది. లైగింక వేధింపులకు గురయ్యే విద్యార్థులు క్రమంగా హోమోసెక్స్‌కు అలవాటు పడిపోతున్నారు. ఇప్పుడు ఎంఎస్‌ఎంలలో చాలామంది బ్యాక్‌గ్రౌండ్ ఇదే.
హాస్టల్స్‌లో పిల్లలంతా ఒకే చోట పడుకోవాల్సి ఉంటుంది. టీనేజ్‌లో అడుగుపెట్టే సమయంలో వారి శరీరాల్లో వచ్చే మార్పులు అనుకోకుండానే లైంగిక కోరికలను కలిగిస్తాయి. రాత్రుళ్లు ఒకేచోట ఆనుకొని పడుకొని ఉన్నప్పుడు వారి మధ్య సాన్నిహిత్యం పెరుగుతోంది. విద్యార్థుల మధ్య స్నేహబంధం క్రమంగా లైంగిక బంధంగా మారిపోతోంది.
ఇక, స్త్రీ సాంగత్యానికి మగాళ్లు ఎక్కువ కాలం దూరమైనప్పుడూ స్వలింగ సంపర్క బంధాలు ఏర్పడుతున్నాయి. రోజురోజుకూ పెరిగిపోయే లైంగిక వాంఛలను తీర్చుకోవడానికి ఎక్కువమంది ఈ పద్దతినే అనుసరిస్తున్నారు. తోటి మగాళ్లలోనే తోడును వెదుక్కుంటున్నారు. జైళ్లలోని ఖైదీల్లో ఈ తరహా ధోరణి గమనించవచ్చు.
ఇవి కాక.. పుట్టుకతోనే వచ్చే జన్యుపరమైన లోపాలు కూడా మగాళ్లను హోమోసెక్స్‌వల్స్‌గా మార్చుతున్నాయి. చిన్నప్పటి నుంచే అమ్మాయిలా ఉండాలనుకునేవారు స్వలింగ సంపర్కంవైపు మొగ్గు చూపుతున్నారు. జన్మత వచ్చిన శరీరాన్ని మార్చుకోలేక, లైంగికంగా మాత్రం మనసుకు నచ్చిన విధంగా ఉంటున్నారు.
MSMలు పెరగడంలో సమాజం పాత్ర కూడా ఉంది. హార్మోన్స్ సమస్యతో స్త్రీ లక్షణాలతో ఉన్నవాళ్లను అవహేళన చేయడం.. అడుగడుగునా అవమానించడం వల్ల, వారు మానసికంగా ధైర్యం కోల్పోతున్నారు. స్త్రీలతో సెక్స్‌కు పనికిరామేమోననుకుని.. హోమోస్‌గా మారుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా..
స్వలింగ సంపర్కం అసహజమైన ప్రక్రియే కావచ్చు.. కానీ, దాన్ని అంగీకరించాలా.. వద్దా అన్న విషయంలో మాత్రం ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చే సాగుతోంది. కొన్ని దేశాలు గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. మరికొన్ని దేశాలు మరణశిక్షనూ విధిస్తున్నాయి. చాలా దేశాల్లో హక్కుల కోసం హోమోస్ పోరాటాన్ని సాగిస్తున్నారు. మన దేశంలో స్వలింగ సంపర్కం నేరం కాదని నిరుడు సుప్రీంకోర్టు స్వయంగా తీర్పు నిచ్చింది. అయితే.. ఇద్దరు మగాళ్ల మధ్య బంధానికి మాత్రం చట్టబద్ధత లేదు. అందుకే, ఎంఎస్‌ఎంలకు పోలీసుల నుంచి వేధింపులు తప్పడం లేదు.
పద్దతి మార్చుకోలేరా..?
మరి వీరంతా మారడం సాధ్యం కాదా అంటే ఓ రకంగా కాదనే చెప్పొచ్చు. ఎందుకంటే, మందులతోనో, మాటలతోనే నయం చేయడానికి ఇది జబ్బు కాదు. మానసికంగా వచ్చిన మార్పు. మనసుకు నచ్చినట్లు ఉన్నప్పుడే వారు స్వేచ్ఛగా జీవిస్తారు. మార్చడానికి ప్రయత్నిస్తే .. మరింతగా కుంగిపోతారు.
ఎయిడ్స్ ఎఫెక్ట్
హోమోసెక్సువల్స్‌ను వేధిస్తున్న ప్రధాన సమస్య ఎయిడ్స్. మేల్ సెక్స్ విత్ మేల్ గ్రూపుల్లోనే హెచ్‌ఐవీ ఎక్కువగా వ్యాపిస్తోందని రిపోర్టులు చెబుతున్నాయి. 2007లో ఎంఎస్‌ఎంల్లో 17 శాతంగా ఉన్న హెచ్‌ఐవీ కేసులు.. 2010 కల్లా 23 శాతానికి చేరుకున్నాయి. అరక్షిత పద్దతుల్లో సంభోగించడమే దీనికి ప్రధాన కారణం. మలద్వారం సున్నితంగా ఉంటుంది కాబట్టి, అది త్వరగా చిట్లి పోతుంది. ఫలితంగా చాలా వేగంగా ఎయిడ్స్ ఎఫెక్ట్ అవుతుంది. సాధారణంగా స్త్రీలతో సంభోగించే వారితో పోల్చితే మగాళ్లతో కలిసే వారిలో 30 శాతం అధికంగా ఎయిడ్స్ సోకుతోందట.
హోమోసెక్స్ నిర్మూలన సాధ్యం కాదు కాబట్టే.. ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వీరిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. అందుకే, ల్యూబ్రికేషన్ ఎక్కువగా ఉన్న కండోమ్స్‌ను ప్రత్యేకంగా MSMల కోసం మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. శృంగారం జరిపేటప్పుడు తప్పనిసరిగా కండోమ్‌ను వాడమని ప్రచారం చేస్తోంది. లేదంటే.. ఎయిడ్స్ వచ్చే రిస్క్ చాలా ఎక్కువ.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి