రాష్ట్ర విభజన సెగ ఆర్టీసీని అథోగతి పాలు చేస్తోంది. సమైక్య ఉద్యమం కారణంగా ఇప్పటికే సీమాంధ్ర జిల్లాల్లో బస్సులు అరకొరగా నడుస్తున్నాయి. సర్వీసులు రద్దు కావడం కారణంగా రోజుకు నాలుగుకోట్ల రూపాయల వరకూ ఆర్టీసీ నష్టపోతోందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే 4600 కోట్ల రూపాయల నష్టాల్లో ఆర్టీసీ ఉంది. ఆర్టీసీ ఉపయోగపడుతున్నంతగా, ప్రజలకు ఉపయోగపడే మరో ప్రభుత్వ సర్వీసు రాష్ట్రంలో లేదు. ఆర్టీసీ ఛార్జీలకు, ప్రైవేటు బస్సు ఆపరేటర్ల ఛార్జీకి మధ్య వ్యత్యాసం చూస్తే అది అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, ఆర్టీసీ అన్నదే లేకపోతే, ప్రైవేటు ఆపరేటర్ల దోపిడీకి హద్దనేదే ఉండదు. అలాంటి ఆర్టీసీకి ఇప్పుడు సమ్మెట పోటు మొదలయ్యింది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్రలోని ఆర్టీసీ కార్మిక సంఘాలు ఈ నెల 12 నుంచి సమ్మెకు దిగుతున్నాయి. అటు ఈ సంఘాల తీరుకు నిరసనగా, రాష్ట్ర విభజన చేయాలంటూ తెలంగాణలోని ఆర్టీసీ యూనియన్లూ అదే సమయం నుంచి సమ్మెకు సిద్ధమయ్యాయి. ఈ పోటాపోటీ సమ్మెల వల్ల నష్టపోయేది ఎవరు.. రాష్ట్ర విభజనకు ఆర్టీసీకి సంబంధం ఏమిటి.. కార్మికులారా ఒక్క క్షణం ఆలోచించండి. గతంలోనూ తెలంగాణలో సమ్మె జరిగినప్పుడు వచ్చిన నష్టం ఇంతవరకూ పూడ్చుకోలేకపోయింది ఆర్టీసీ. మీ మనోభావాలకు తగ్గట్లుగా పోరాడడంలో తప్పు లేదు. కానీ, ప్రభుత్వ నిర్లక్ష్యంతో, రకరకాల కారణాలతో అసలే సగం చచ్చిన ఆర్టీసీని మీరు పూర్తిగా చంపకండి. మీకు అన్నం పెడుతున్న తల్లినే ఉరితీయకండి.
Read more...
rtc లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
rtc లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
8, ఆగస్టు 2013, గురువారం
23, డిసెంబర్ 2012, ఆదివారం
ఆర్టీసీ ఎన్నికలు రాజకీయ పార్టీల వైఖరిలో మార్పు తెస్తాయా..?
వాడివేడిగా సాగిన ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు ఉత్కంఠ భరిత ఫలితాలను ఇచ్చాయి. ఆర్టీసీలో ఇంతకాలం ఏకఛత్రాధిపత్యం వహిస్తూ వచ్చిన నేషనల్ మజ్జూర్ యూనియన్ ఈ ఎన్నికల్లో చావు దెబ్బతింది. ఎంప్లాయిస్ యూనియన్-తెలంగాణ మజ్దూర్ యూనియన్ కూటమి ఘన విజయం సాధించింది. అయితే.. ఈ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాలపైనా ప్రభావం చూపించే అవకాశం ఉంది.
తెలంగాణ మజ్దూర్ యూనియన్ తో కలిసి ఎంప్లాయిస్ యూనియన్ కూటమిగా ఏర్పడడంతోనే ఈ ఎన్నికలకు విశేష ప్రాధాన్యం లభించింది. సమైక్యవాదాన్ని బలపరిచేదిగా ఎన్ఎంయూ, తెలంగాణకు మద్దతిచ్చేదానిగా ఎంప్లాయిస్ యూనియన్-తెలంగాణ మజ్దూర్ యూనియన్ కూటమి అంటూ ప్రచారం సాగింది. అయితే.. తెలంగాణ ప్రాంత కూటమితో పొత్తుపెట్టుకున్న ఎంప్లాయిస్ యూనియన్ సీమాంధ్రలోని మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవడం రాజకీయవర్గాలను నివ్వెర పరుస్తోంది. తెలంగాణ వాదానికి సీమాంధ్ర ప్రజలు మద్దతు ఇస్తున్నారనడానికి ఇదే నిదర్శనమంటోంది తెలంగాణ రాష్ట్ర సమితి. రెండు కళ్ల సిద్ధాంతంతో ఎన్నో ఇబ్బందులు పడుతున్న తెలుగుదేశం కూడా ఈ ఫలితాలను విశ్లేషించే పనిలో పడింది. డిసెంబర్ 28న జరగనున్న అఖిలపక్ష సమావేశానికి ముందు ఈ ఫలితాలు రావడం... రాజకీయ పార్టీల వైఖరిలో మార్పు తెచ్చే అకాశాలు కనిపిస్తున్నాయి.
Read more...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)

