అయితే, ఇప్పుడో అద్భుతమైన అవకాశం వచ్చినా దాన్ని రాహుల్ కు అందించడంలో విఫలమయ్యారు సోనియా గాంధీ. ప్రస్తుత లోక్ సభలో ఎవరికీ ప్రతిపక్ష హోదా దక్కనప్పటికీ, రెండో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్సే ఉంది. ఆ పార్టీ లోక్ సభ నేతగా ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం కాంగ్రెస్ లోక్ సభా పక్ష నేతకే దక్కుతుంది. ఈ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తే, దేశవ్యాప్తంగా పాపులారిటీని సంపాదించుకునే అవకాశం ఉంటుంది. కానీ, రాహుల్ సమర్థత మీద అవగాహన ఉండడం వల్లో ఏమో ఆ పదవిని రాహుల్ కు అందించలేదు సోనియా. ఒకవేళ మోడీ వాక్చాతుర్యాన్ని, మాటల దాడిని రాహుల్ ఎదుర్కోలేకపోవచ్చని సోనియా భావించి ఉండొచ్చు. అయితే, కాంగ్రెస్ లోక్ సభా పక్ష నేతగా కొంతమంది ఎంపీలనే నడిపించే సామర్థ్యం లేని వ్యక్తి దేశాన్ని ముందుకు నడిపించగలడా.. ? ఇదే ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం. సోనియా, రాహుల్ లు ఇదే తరహాలో వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లోనూ వారి ఛరిష్మా పనిచేయదనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.
దీనికి పనికిరానివాడు దానికి పనికొస్తాడా..?
అయితే, ఇప్పుడో అద్భుతమైన అవకాశం వచ్చినా దాన్ని రాహుల్ కు అందించడంలో విఫలమయ్యారు సోనియా గాంధీ. ప్రస్తుత లోక్ సభలో ఎవరికీ ప్రతిపక్ష హోదా దక్కనప్పటికీ, రెండో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్సే ఉంది. ఆ పార్టీ లోక్ సభ నేతగా ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం కాంగ్రెస్ లోక్ సభా పక్ష నేతకే దక్కుతుంది. ఈ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తే, దేశవ్యాప్తంగా పాపులారిటీని సంపాదించుకునే అవకాశం ఉంటుంది. కానీ, రాహుల్ సమర్థత మీద అవగాహన ఉండడం వల్లో ఏమో ఆ పదవిని రాహుల్ కు అందించలేదు సోనియా. ఒకవేళ మోడీ వాక్చాతుర్యాన్ని, మాటల దాడిని రాహుల్ ఎదుర్కోలేకపోవచ్చని సోనియా భావించి ఉండొచ్చు. అయితే, కాంగ్రెస్ లోక్ సభా పక్ష నేతగా కొంతమంది ఎంపీలనే నడిపించే సామర్థ్యం లేని వ్యక్తి దేశాన్ని ముందుకు నడిపించగలడా.. ? ఇదే ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం. సోనియా, రాహుల్ లు ఇదే తరహాలో వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లోనూ వారి ఛరిష్మా పనిచేయదనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.
తెలంగాణ ముగిసింది.. ఆంధ్ర మిగిలింది
తెలంగాణలో ప్రచారానికి తెరపడుతుండడంతో సీమాంధ్రపైకి దృష్టి మళ్లించాయి ప్రధాన పార్టీలు. ఇప్పటికే చంద్రబాబు కొన్ని జిల్లాల్లో ప్రచారం పూర్తి చేయగా, బాలయ్య కూడా విరామం లేకుండా ఆ పార్టీ తరపున ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ కు స్టార్ క్యాంపైనర్ గా చిరంజీవి తన పని మొదలుపెట్టారు. అన్నింటికీ మోడీ మంత్రాన్నే వల్లె వేస్తున్న బీజేపీ, సీమాంధ్రలోనూ ఆయన్నే ప్రచారానికి పిలుస్తోంది. ఏప్రిల్ 30, మే1 తేదీల్లో ఆయన సీమాంధ్రలో పలు సభల్లో పాల్గొననున్నారు. ఏప్రిల్ 30న తిరుపతిలో, మే 1న విశాఖలో బహిరంగ సభల్లో ఆయన పాల్గొననున్నారు. ఇక మే 2 సోనియా విశాఖ బహిరంగ సభలో పాల్గొంటారు. మోడీ సభ జరిగిన తర్వాతి రోజే సోనియా సభ జరుగుతుండడంతో దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు. అటు రాహుల్‌తో కూడా వీలైనంతగా సభలను నిర్వహించాలని భావిస్తున్నారు కాంగ్రెస్ నేతలు.
సోనియా సంపన్నురాలు కాదట.. వెనక్కి తగ్గిన హఫింగ్టన్
Categories :
congress . huffingtonpost.com . POLITICS . sonia . sonia assets . TOP
రాహుల్‌కు సోనియా వార్నింగ్
Categories :
congress . POLITICS . rahul gandhi . sonia . sonia warns rahul . TOP
ఇటీవలే మధ్యప్రదేశ్‌లోని సభలో మాట్లాడుతూ ఆహార భద్రతా బిల్లుపై ఓటింగ్‌లో పాల్గొనలేకపోవడంతో సోనియా కన్నీరుమున్నీరయ్యారని, హాస్పిటల్‌కు కూడా రానని మొండికేశారంటూ చెప్పుకొచ్చాడు యువరాజు. ఇదే పెద్ద వార్త అయిపోయింది. ఇలానే కొనసాగితే సానుభూతి సంగతేమో గానీ, తానో ఏడుపుగొట్టుదాన్నని అంతా అనుకుంటారని అనుకున్నారో ఏమో గానీ, సోనియా మాత్రం తనయుడికి తలంటేసినట్లున్నారు. ఇంకెప్పుడూ ప్రసంగాల్లో తన పేరు వాడొద్దంటూ ఆర్డర్ పాస్ చేశారు. అంత మాత్రాన రాహుల్ గాంధీ ఊరుకుంటారా.. ఆ విషయాన్ని కూడా రాజస్థాన్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో బయటపెట్టేశారు. అందుకే ఆమె గురించి మాట్లాడడం లేదని చెప్పేశారు. ఇదీ ఇప్పుడు పెద్ద వార్తైపోతుంది. సోనియా ఎందుకు తన పేరు ఎత్తొద్దని చెప్పారన్నదానిపై మీడియా కావల్సినంత వండుకుంటుంది. దీన్నిబట్టి చూస్తే రాహుల్ ఇంకా పూర్తిగా ఎదగలేదోమో అన్న అనుమానాలు కలగకమానవు.
ఇక తల్లి పేరును తప్పనిసరి పరిస్థితుల్లో పక్కన పెట్టిన రాహుల్, నాన్నమ్మ, నాన్నలపై భావోద్వేగ ప్రసంగాన్ని చేశారు. తన నాన్నమ్మ, తండ్రి ఉగ్రవాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయారని, తన ప్రాణాన్ని కూడా ఏదో ఓ రోజు అలానే తీయవచ్చనీ చెప్పారు. అయితే, చావుకు భయపడేవాడిని కాదన్నారాయన.
ప్రియాంకను పిలిస్తే.. పార్టీ పొమ్మంది
రాజీనామాపై రాజీ పడ్డ పల్లంరాజు
Categories :
cabinet note . congress . GOM . pallam raju . POLITICS . RESIGN WITHDRAW . sonia . t note . telangana . TOP
ఇవాళన్నా తేలుతుందా..
వ్యూహాత్మకంగా విభజన అడుగులు
ట్రాన్స్ ఫర్స్ లో ఈయన్ని మించినోడు లేడు
Categories :
ashok khemka . haryana . ias officer . news . rabert vadra . sonia . TOP . transfer
ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి, 20 ఏళ్ల సర్వీసులో ఎన్నిసార్లు ట్రాన్స్ ఫర్ అయి ఉంటారు.. సాధారణంగా ఒక్కో చోట కనీసం రెండేళ్లన్నా ఐఏఎస్ అధికారులు పనిచేస్తారు. పోనీ ఏడాదే వేసుకున్నా.. 20 ఏళ్లలో 20 ట్రాన్స్ ఫర్స్. కానీ, హర్యానా కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి, అశోక్ ఖేమ్కా మాత్రం, ఈ 20 ఏళ్లలో 44 సార్లు ట్రాన్స్ ఫర్స్ ఆర్డర్స్ అందుకున్నారు. అంటే సగటున ఆర్నెళ్లు కూడా ఆయన్ను ప్రభుత్వం స్థిరంగా ఉండనివ్వలేదన్నమాట.
ఇంతకీ ఈ అశోక్ ఖేమ్కా ఎవరో తెలుసా.. రియాల్టీ దిగ్గజం డీఎల్ ఎఫ్ కు సోనియా అల్లుడు రాబర్డ్ వాద్రాకు మధ్య అక్రమంగా జరిగిన భూ బదలాయింపును రద్దు చేసిన అధికారి. ఆ కేటాయింపులు రద్దు చేసిన వెంటనే ఆయన్ను ఆ పోస్టు నుంచి తప్పించింది హర్యానా సర్కార్. అనంతరం హర్యానా సీడ్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఎండీగా నియమించింది. అక్కడ జరిగిన 60 కోట్ల కుంభకోణాన్ని బయటపెట్టారు ఖేమ్కా. మోసపూరితంగా ఫంగిసైడ్స్ ను రైతులకు అమ్మినందుకు ఓ జర్మనీ పురుగుమందుల కంపెనీపై క్రిమినల్ కేసుకు సిఫార్సు చేశారు ఖేమ్కా. దీంతో కలవరపడ్డ సర్కార్, ఆయన్ను అత్యంత అప్రాధాన్య పోస్టైన హర్యానా ఆర్కైవ్స్ కు సెక్రటరీగా బదిలీ చేసింది. ఈ ఆదేశాలు ఇంకా ఆయనకు అందకుముందే, మరో జూనియర్ అధికారిని పంపించి, బాధ్యతలను బలవంతంగా బదిలీ చేయించింది. ఏడాది కాలంలో ఖేమ్కా ట్రాన్స్ ఫర్ కావడం ఇది నాలుగోసారి. నిజాయితీగా పనిచేసే అధికారులకు మన ప్రభుత్వాలు ఇచ్చే బహుమతులు ఇలానే ఉంటాయి మరి..
ఆయనంటే ఆమెకు ఎందుకంత మంట?
Categories :
congress . helicopter scam . pv narasimharao . sonia . sonia angry . TOP
పీవీ నర్సింహారావు.. భారతదేశ తొలి తెలుగు ప్రధాని. అంతేకాదు.. ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించిన పరిపాలనా దక్షుడు. అత్యంత కష్టకాలంలో ఐదేళ్లపాటు కాంగ్రెస్ పార్టీని అధికారంలో నిలబెట్టిన అపర చాణక్యుడు. అయినా.. కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు ఆయనంటే పట్టరాని కోపం. .. మన పీవీ అంటే ఆమెకు ఎందుకంత ఆగ్రహం....? తాజాగా బయటపడ్డ హెలికాప్టర్ స్కామ్‌లో దీనికి సంబంధించి ఓ లింకు దొరికింది.
ఢిల్లీలోనే కాదు.. కాంగ్రెస్ పార్టీలోనూ పీవీ నరసింహారావు ఆనవాళ్లు పెద్దగా కనిపించవు. అభివృద్ధి విషయంలో ఎంత చెప్పుకున్నా.. పీవీ పేరు లేకుండానే కాంగ్రెస్ నేతల ప్రసంగాలు కొనసాగుతాయి. నెలరోజుల కూడా పనిచేయని ప్రధానులకు ఢిల్లీలో సమాధులు, పార్కులు కట్టించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. సొంత పార్టీ నేత, ఐదేళ్లు దేశాన్ని పాలించిన పీవీకి మాత్రం చిన్న స్థలం కూడా ఇవ్వడానికి ఒప్పుకోలేదు. సోనియాకు ఆయనపై ఉన్న ఆగ్రహమే దీనికి కారణమని అందరికీ తెలిసిందే.. అయితే.. పీవీపై సోనియాకు ఎందుకంత మంట అన్నది మాత్రం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది.
పీవీ ప్రధానిగా పనిచేస్తున్న సమయంలో కాంగ్రెస్‌లో కొంతమంది సోనియాను రాజకీయాల్లోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. పార్టీలో క్రమంగా ఆమె పవర్ సెంటర్‌గా మారడాన్ని గమనించిన పీవీ.. ఆమెపై నిఘా పెట్టారు. ఇదే సమయంలో సోనియా బ్రిటన్ పర్యటనకు వెళ్లారు. సోనియా రాజకీయ మద్దతు కూడగట్టుకోవడానికే వెళ్లి ఉండొచ్చని అనుమానించిన పీవీ.. ఆమె కదలికలపై నిఘా వర్గాలతో ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకున్నారు. ఆమె ఎవరెవరిని, ఎక్కడెక్కడ కలుసుకున్నారన్న సమాచారం అంతా పీవీ సేకరించారు..
ఈ విషయం అంతా, దేశంలో ప్రకంపనలు పుట్టిస్తున్న హెలికాప్టర్ స్కామ్ వివరాలను తవ్వుతుంటే బయటపడింది. ఈ డీల్‌లో మధ్యవర్తిత్వం వహించిన
క్రిస్టియన్ మైఖేల్ తండ్రి వుల్ఫ్ గ్యాంగ్ సోనియాపై సమాచారాన్ని సేకరించడంలో నిఘా వర్గాలకు సహాయం చేశాడు. వోల్టర్స్ అని రా అధికారులు ముద్దుగా పిలుచుకునే వుల్ఫ్ గ్యాంగ్ బ్రిటన్‌లో ఆయుధాల వ్యాపారం చేసేవాడు. మన నిఘా అధికారులకు కీలక వివరాలను ఎప్పటికప్పుడు అందించేవాడు. ముఖ్యంగా పాకిస్తాన్ ఆయుధ ఒప్పందాలపై రహస్య సమాచారాన్ని వోల్ఫ్ గ్యాంగ్ ద్వారానే పొందారు మన రా అధికారులు. ఇక వోల్ఫ్ గ్యాంగ్ ఢిల్లీకి వచ్చినప్పుడు కాంగ్రెస్ కీలక నేతలను స్వేచ్ఛగా కలిసేవాడు. పీవీ హయాంలో సోనియాపై నిఘా పెట్టినప్పుడు.. బ్రిటన్‌లో ఆమె ఏంచేసిందన్న వివరాలు అందించడంలోనూ వోల్ఫ్‌గ్యాంగ్ సమాచారం అందించాడు.
ఈ విషయం సోనియాకు తెలిసింది. తన కదలికలపైనే ఆరాతీయడాన్ని తీవ్ర అవమానంగా భావించిన ఆమె.. అప్పటినుంచి పీవీపై ఆగ్రహం పెంచుకున్నారని తెలుస్తోంది.అదంతా మోడిని తట్టుకోవడానికేనా..?
Categories :
afzal guru . congress . election . hang . modi . POLITICS . rahul gandhi . sonia . TOP
తెలంగాణపై ఎల్లుండే తేలిపోతుందా..? సీఎంను ఎందుకు పిలిచినట్లు?
అల్లుడి గిల్లుడుతో సోనియా అవస్థలు
క్విడ్ ప్రో కో: సోనియా అల్లుడికి డీఎల్ఎఫ్ సొమ్ములు
సహనం కోల్పోయిన సోనియా
Categories :
advani . congress . parliament . POLITICS . sonia . sonia angry . TOP
ఆ మాట నిజం కాదన్న అబ్దుల్ కలాం!
మేడం ముందుకు మెగాస్టార్..
Categories :
chirnajeevi . congress . sonia . TOP
ఎన్నికల ప్రచారములో గాంధీల ఐదోతరం
Categories :













