రణవీర్ సింగ్, దీపికా లతో సంజయ్ లీలా బన్సాలీ సృష్టించిన రామ్ లీలా బాక్సాఫీస్ దగ్గర దూసుకెళుతోంది. అంతేకాదు, సినీ దిగ్గజాలంతా ఈ సినిమా చూసి ఫిదా అయిపోతున్నారట. ముఖ్యంగా బిగ్ బీ అమితాబ్ కైతే ఈ సినిమా పిచ్చపిచ్చగా నచ్చేసిందంట. 24 గంటల్లోనే ఈ సినిమాను మూడుసార్లు చూశారట బచ్చన్ సాబ్. అంతేకాదు, ఇంకా ఇంకా చూడాలనిపిస్తోందంటూ ఆయన బ్లాగ్ లో పేర్కొన్నారు. రామ్ లీలా నటీనటుల్లో ప్రొఫెషనలిజం కనిపిస్తోందని, భారతీయ సినిమాకు అద్భుతమైన భవిష్యత్తు ఉంటుందని ప్రశంసించారాయన.
Read more...
Amitab లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Amitab లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
18, నవంబర్ 2013, సోమవారం
6, సెప్టెంబర్ 2013, శుక్రవారం
ఏడు కోట్ల సవాల్
Categories :
Amitab . entertainment . kbc 7 . koun banega crorepati . sony . TOP
బస్తీమే సవాల్.. దమ్ముంటే ఏడు కోట్లు మీవే. అవును.. అత్యంత ప్రజాదారణ పొందిన కౌన్ బనేగా కోర్ పతి.. ఇప్పుడు ఏడు కోట్ల రూపాయల బహుమతితో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇవాళే ఏడో సీజన్ లో తొలి ఎపిసోడ్ ప్రసారం కాబోతోంది. దీనికి బిగ్ బీ అమితాబ్ బచ్చనే వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఒక్క మూడో సీజన్‌కు షారుక్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. మిగిలిన అన్ని సీజన్లలోనూ అమితాబ్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఏడు కోట్లు గెలుచుకున్న విజేతను 'మహాకరోడ్‌పతి' అనబోతున్నారు. హాట్‌సీట్ చేరుకునే మార్గం కూడా ఈసారి మరింత కఠినతరమైంది. ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్... లో ఇంతకు ముందు ఒక్క ప్రశ్నే ఉండేది. ఇప్పుడు మూడు చేశారు. మూడిటికీ సరైన సమాధానం చెప్పిన తొలి వ్యక్తికి కేబీసీ ఆడే అవకాశం దొరుకుతుంది. ప్రధానపోటీలో గతంలో 12 ప్రశ్నలుంటే ఇప్పుడు 15 ప్రశ్నలు అయ్యాయి. చివరి నాలుగు ప్రశ్నలను 'సప్తకోటి సందూక్' అంటున్నారు. ఈ ప్రశ్నల బహుమతి విలువ కోటి, 3 కోట్లు, 5 కోట్లు, 7 కోట్లు ఉంటుంది. అలాగే లైఫ్‌లైన్స్ కూడా ఇప్పుడు ఐదున్నాయి. ఫిల్మ్‌సిటీ బదులుగా ఈసారి షోని యష్‌రాజ్ ఫిల్మ్ స్టూడియోలో చిత్రీకరిస్తున్నారు.
Read more...
2, మార్చి 2013, శనివారం
ఐష్ కూతురికి రూ.54 కోట్ల గిఫ్ట్
ఐశ్వర్య కూతురు అదృష్టంతో పుట్టినట్లుంది. పుట్టినరోజుకు ముందు 24 లక్షల రూపాయల విలువైన బీఎండబ్ల్యూ మినీకూపర్ కారును గిఫ్ట్ గా పొందిన ఆరాధ్యకు.. తాజాగా దుబాయ్ లో 54 కోట్ల రూపాయల విలువైన ప్రాపర్టీని అభి-ఐష్ లు బహుమతిగా అందించారు. బచ్చన్ ఫ్యామిలీ పుట్టడం అంటే మాటలా మరి.. త్వరలోనే ఓ ప్రైవేటు ఐలాండ్ ను కొనిచ్చినా కొనిస్తారు. ముద్దుల మనుమరాలిని చూసుకుని బిగ్ బీ అమితాబ్ అయితే, ఈలోకాన్నే మైమరిచిపోతున్నారట.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)

