తిరుమల శ్రీవారి సన్నిధిలో తరతరాలుగా వారసత్వ అర్చకత్వాన్ని అనుభవిస్తున్న ఆ నాలుగు కుటుంబాలకు చెక్ చెప్పారు ఈవో ఎల్వీ సుబ్రమణ్యం. ప్రస్తుతం ప్రధానార్చకులుగా ఉన్న రమణదీక్షితుల కుటుంబంతో పాటు మరో మూడు కుటుంబాలకు రొటేషన్ పద్దతిలో ప్రధాన అర్చకత్వ పదవి ఇంతకాలం దక్కుతూ వస్తోంది. ఈ నాలుగు కుటుంబాలకు చెందిన వారు తప్ప మరోవ్యక్తి ప్రధాన అర్చకత్వాన్ని పొందే అవకాశం ఇంతవరకూ రాలేదు. అయితే, సర్వీస్ నిబంధనలను అర్చకులకూ వర్తింప చేసిన టీటీడీ ఈవో, 65 ఏళ్లు దాటిన ప్రతీ ఒక్కరూ పదవీ విరమణ చేయాల్సిందేనని ఆదేశించారు. దీంతో, తిరుమలలో ఒకరు, తిరుచానూరు పద్మావతి ఆలయంలో ఇద్దరు పదవీ విరమణ చేయాల్సి వచ్చింది. వీరిస్థానాల్లో సర్వీస్ రూల్స్ కు అనుగుణంగా కొత్తవారిని నియమిస్తారు. దీంతో ఆ నాలుగు కుటుంబాల వారు పదవీ విరమణ చేస్తే వారి స్థానంలో వేరొకరు ప్రధానార్చక పదవిని చేపడతారే తప్ప.. ఆ కుటుంబాల్లోనే వారసత్వంగా ఆ పదవి దక్కదు. దీంతో తీవ్రంగా కలత చెందిన ఆ నాలుగు కుటుంబాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. అర్చకులకు పదవీ విరమణను అమలు చేయకూడదంటూ ఇవాళ టీటీడీ ఛైర్మన్ బాపిరాజును కలిసి మొరపెట్టుకున్నాయి. దీంతో, ఇవాళ జరిగే పాలకమండలి సమావేశంలో దీనిపై చర్చిస్తామని, అర్చకులకు న్యాయం చేస్తామని ఛైర్మన్ హామీ ఇచ్చారు.
tirumala లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
tirumala లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
2, మార్చి 2013, శనివారం
ఆ నాలుగు కుటుంబాలకు చేజారనున్న శ్రీవారి అర్చకత్వం
Categories :
archakulu . divotional . news . priests . ramana deeskhitulu . tirumala . tirupati . TOP
తిరుమల శ్రీవారి సన్నిధిలో తరతరాలుగా వారసత్వ అర్చకత్వాన్ని అనుభవిస్తున్న ఆ నాలుగు కుటుంబాలకు చెక్ చెప్పారు ఈవో ఎల్వీ సుబ్రమణ్యం. ప్రస్తుతం ప్రధానార్చకులుగా ఉన్న రమణదీక్షితుల కుటుంబంతో పాటు మరో మూడు కుటుంబాలకు రొటేషన్ పద్దతిలో ప్రధాన అర్చకత్వ పదవి ఇంతకాలం దక్కుతూ వస్తోంది. ఈ నాలుగు కుటుంబాలకు చెందిన వారు తప్ప మరోవ్యక్తి ప్రధాన అర్చకత్వాన్ని పొందే అవకాశం ఇంతవరకూ రాలేదు. అయితే, సర్వీస్ నిబంధనలను అర్చకులకూ వర్తింప చేసిన టీటీడీ ఈవో, 65 ఏళ్లు దాటిన ప్రతీ ఒక్కరూ పదవీ విరమణ చేయాల్సిందేనని ఆదేశించారు. దీంతో, తిరుమలలో ఒకరు, తిరుచానూరు పద్మావతి ఆలయంలో ఇద్దరు పదవీ విరమణ చేయాల్సి వచ్చింది. వీరిస్థానాల్లో సర్వీస్ రూల్స్ కు అనుగుణంగా కొత్తవారిని నియమిస్తారు. దీంతో ఆ నాలుగు కుటుంబాల వారు పదవీ విరమణ చేస్తే వారి స్థానంలో వేరొకరు ప్రధానార్చక పదవిని చేపడతారే తప్ప.. ఆ కుటుంబాల్లోనే వారసత్వంగా ఆ పదవి దక్కదు. దీంతో తీవ్రంగా కలత చెందిన ఆ నాలుగు కుటుంబాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. అర్చకులకు పదవీ విరమణను అమలు చేయకూడదంటూ ఇవాళ టీటీడీ ఛైర్మన్ బాపిరాజును కలిసి మొరపెట్టుకున్నాయి. దీంతో, ఇవాళ జరిగే పాలకమండలి సమావేశంలో దీనిపై చర్చిస్తామని, అర్చకులకు న్యాయం చేస్తామని ఛైర్మన్ హామీ ఇచ్చారు. 27, ఫిబ్రవరి 2013, బుధవారం
పదేళ్లలో పదింతలు పెరిగిన వెంకన్న సంపద
Categories :
divotional . lord balaji . news . tirumala . tirupati . TOP . ttd . venkanna
సిరిగలవాడికి సంపద సమకూరునన్నట్లు.. లక్ష్మీ దేవిని హృదయాంతరాళాల్లో బంధించిన, వడ్డీకాసుల వాడి ఆదాయం వడివడిగా పెరుగుతోంది. భక్తులు ఇచ్చే కానుకలతో పాటు బ్యాంకుల్లో డిపాజిట్ల రూపంలో ఉన్న సంపద పదేళ్లతో పోల్చితే గణనీయంగా పెరిగింది. అంతేకాదు.. డిపాజిట్ల రూపంలో ఉన్న శ్రీవారి సంపద ఏకంగా ఐదువేల కోట్లను దాటేసింది. 2002 నాటికి ఇది కేవలం 629 కోట్లు మాత్రమే కావడం విశేషం.
శ్రీవారి ఆదాయాభివృద్ధి పద్దులను తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలకమండలి తాజాగా వెల్లడించింది. ప్రధానంగా సామాన్యభక్తులు సమర్పించే ముడుపులు, కానుకలు నగదు రూపంలో ఉన్నవి ఎప్పటికప్పుడు జాతీయ బ్యాంకుల్లో జమ అవుతుంటాయి. ఇలా స్వామి ఆదాయం రూ.లక్షల్లో ఉన్న 1950వ దశకం నుంచే దేవస్థానం నిధులు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తున్నారు.
2002-03లో రూ.629 కోట్ల పెట్టుబడులు ఉండగా, ఇది ఆ ఏడాది వచ్చిన వడ్డీ, తాజా పెట్టుబడులు కలుపుకుని రూ.740.81 కోట్లకు చేరింది. 2005-06 నాటికి ఇవి వెయ్యికోట్లను దాటాయి. ప్రస్తుతం ఈ పెట్టుబడులు, డిపాజిట్లు 2012-13 బడ్జెట్‌లో రూ.4,674 కోట్లయ్యాయి. వడ్డీ, తాజా పెట్టుబడి రూ.533 కోట్లు కలుపుకుని రూ.5,207 కోట్లకు శ్రీవారి పెట్టుబడులు చేరాయి. రానున్న ఆర్ధిక సంవత్సరంలో మరో వంద కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చే అవకాశముందని టీటీడీవర్గాలు అంచనావేస్తున్నాయి. శ్రీవారి దూకుడు చూస్తుంటే, వచ్చే రెండుమూడేళ్లలోనే ఈ సంపద పదివేల కోట్లు దాటిపోయేలా కనిపిస్తోంది. 21, ఫిబ్రవరి 2013, గురువారం
తిరుమల వెంకన్నతో వ్యాపారమా..?
సామాన్య భక్తుల సౌకర్యాలను ఏమాత్రం పట్టించుకోకుండా, వీఐపీల సేవలో తరించే తిరుమల తిరుపతి దేవస్థానం కోరిన కోర్కెలు తీర్చే కోనేటి రాయుడితోనే ఇప్పుడు వ్యాపారం మొదలుపెట్టింది. వెంకన్న రూపం, ఆనందనిలయ గోపురాన్ని వాచ్చీల్లో వాడుకొని అమ్ముకోవచ్చంటూ.. స్విట్జర్లాండ్ కు చెందిన సెంచురీ వాచెస్ తో ఒప్పందం కుదుర్చుకుంది. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వ్యాపారల అవసరాల కోసం స్వామిని వాడుకోవాలనుకోవడంపై హిందూ సంస్థలు మండిపడుతున్నాయి.దీన్ని తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)