కేంద్రమంత్రి పల్లంరాజు తన రాజీనామాపై వెనక్కి తగ్గారు. తెలంగాణ నోట్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత రాజీనామా చేయాలని భావించిన ఆయన వెంటనే ప్రధానిని కలిసి రాజీనామా చేస్తానని చెప్పారు. అయితే ఆవేశంలో నిర్ణయం తీసుకోవద్దని మన్మోహన్ సూచించడంతో ఒక్కరోజు ఆగి, మళ్లీ రాజీనామా చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని అపాయింట్ మెంట్ దొర్కకపోవడంతో రాజీనామా లేఖ సమర్పించని పల్లంరాజు, సోనియాను కలిసి పరిస్థితిని వివరించారు. అయితే, రాష్ట్ర విభజనపై ఏర్పాటైన మంత్రుల బృందంలో కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి కూడా ఉండాలి కాబట్టి, పదవికి రాజీనామా చేయకుండా బృందంలో చేరాలని సోనియా చెప్పారని మీడియాకు తెలిపారు పల్లంరాజు. రాజీనామా చేయకుండా, మంత్రుల బృందంలో పనిచేయడం ద్వారా సీమాంధ్ర ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తానన్నారు పల్లంరాజు. అయితే, రాష్ట్రాన్ని ఎలా విభజించాలన్నదానిపైనే ఈ బృందం పనిచేస్తుంది కాబట్టి, విభజనకు పల్లంరాజు అంగీకరించినట్లే.
Read more...
t note లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
t note లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
5, అక్టోబర్ 2013, శనివారం
రాజీనామాపై రాజీ పడ్డ పల్లంరాజు
Categories :
cabinet note . congress . GOM . pallam raju . POLITICS . RESIGN WITHDRAW . sonia . t note . telangana . TOP
4, అక్టోబర్ 2013, శుక్రవారం
ఇన్నాళ్లూ ఎందుకు ఆపారు.. ఇప్పుడు దొడ్డిదారిన ఎందుకు తెచ్చారు
ఎంతో శాంతియుతంగా, సామరస్యంగా జరగాల్సిన రాష్ట్ర విభజన ప్రక్రియ యూపీఏ సర్కార్, కాంగ్రెస్ హైకమాండ్ రాజకీయాల కారణంగా అత్యంత ఉద్రిక్త పరిస్థితుల మధ్య సాగుతోంది. ముఖ్యంగా ఆంటోనీ కమిటీ నివేదిక వచ్చే వరకూ తెలంగాణ నోట్ ఆగిపోతుందన్న ధీమాతో ఉన్న సీమాంధ్రులు.. కేబినెట్ నోట్ ఆమోదం పొందడంతో ఒక్కసారిగా ఉద్వేగానికి లోనయ్యారు. 63 రోజులుగా ఉద్యమం చేస్తున్నా తమ మనోభావాలను గుర్తించేలేదని, తమను కేంద్రం మోసం చేస్తుందన్న భయాందోళనకు గురయ్యారు.
సీడబ్ల్యూసీ తీర్మానం చేసిన తర్వాత వెంటనే కార్యాచరణ మొదలుపెట్టామన్న కేంద్రప్రభుత్వం ఈ విషయాన్ని తేల్చకుండా ఇంతకాలం నాన్చుతూ వచ్చింది. కేబినెట్ నోట్ తయారువుతోందని కొంతకాలం క్రితం చెప్పిన షిండే, ఆ తర్వాత మాట మార్చారు. అంతెందుకు, గురువారం సాయంత్రం కేబినెట్ భేటీలో నోట్ ప్రస్తావన ఉంటుందని మీడియా కోడైకూస్తుంటే, మధ్యాహ్నం వేళ తీరిగ్గా అవన్నీ వదంతులేనని కొట్టి పారేశారు. చివరకు కేబినెట్ మీటింగ్ కు హాజరయ్యే మంత్రులకు కూడా నోట్ వ్యవహారాన్ని ముఖ్యమైన విషయంగా చెప్పలేదు. కేవలం టేబుల్ అజెండాగా పెట్టి అందరినీ మభ్య పెట్టే ప్రయత్నం చేశారు. చివరకు, కేబినెట్ సమావేశం మొత్తాన్ని కేవలం తెలంగాణ నోట్ కే పరిమితం చేశారు. ఇలా దొంగచాటుగా వ్యవహరించాల్సిన అవసరం కేంద్రానికి ఎందుకు వచ్చింది. టీ నోట్ తయారయ్యిందని, కేబినెట్ భేటీలో చర్చిస్తామని నేరుగా ప్రకటించవచ్చు కదా.. ఇలాంటి చర్యల వల్ల జనంలో మరిన్ని అపోహలు ఏర్పడుతున్నాయి. అసలు ఆంటోనీ కమిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరమే లేదు.. కేబినెట్ నోట్ పై ఏర్పాటు చేసే మంత్రుల బృందమే అన్ని ప్రాంతాల అభిప్రాయం తీసుకుంటుంది, విభజన ఎలా జరగాలే నిర్ణయిస్తుంది. కానీ, కాంగ్రెస్ పార్టీ ఆంటోనీ కమిటీని వేసి కాలహరణకు పాల్పడింది. జనాన్ని మభ్యపెట్టడానికి ప్రయత్నించింది. పోనీ, అదన్నా సక్రమంగా చేసిందా అంటే అదీ లేదు. ఆంటోనీ కమిటీ రాష్ట్రంలో పర్యటించడానికి వస్తోందని పీసీసీ చీఫ్ బొత్స ప్రకటించిన మరుసటి రోజే టీనోట్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇలా వరసగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే తెలంగాణ విషయంలో కాంగ్రెస్ ఏం చేయబోతోందన్నది అనుమానాస్పదంగా మారింది. ఓ వైపు సీమాంధ్రలో ఉద్యమం తీవ్రంగా సాగుతుంటే, టీనోట్ కు కేబినెట్ ఆమోదం తెలపడం ధైర్యంగా తీసుకున్న నిర్ణయం అనుకోవాలా లేక, ఈ ఆందోళనలకు మరింత ఆజ్యం పోసి, తర్వాత వాటిని సాకుగా చూపి వెనక్కి తగ్గే వ్యూహాన్ని ఏమైనా అమలు చేస్తోందా అన్న అనుమానాలు కలగకమానవు.

3, అక్టోబర్ 2013, గురువారం
సీమాంధ్ర కేంద్ర మంత్రుల రాజీనామా
Categories :
cabinet note . congress . kavuri . pallam raju . POLITICS . resign . seemandhra . t note . telangana . TOP
తెలంగాణ నోట్ ను కేంద్ర కేబినెట్ ఆమోదించడంతో, కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేశారు కావూరు సాంబశివరావు, పళ్లంరాజు. కేబినెట్ నోట్ ఆమోదం పొందనివ్వకుండా చూస్తామని ఇంతకాలం చెప్పిన నేతలు, ఆ పని చేయలేకపోవడంతో, పదవులను వదులుకున్నారు. టీనోట్ను ఆమోదించవద్దంటూ కేబినెట్ సమావేశంలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన వీరిద్దరూ, సానుకూల స్పందన రాకపోవడంతో, మధ్యలోనే బయటకు వచ్చేశారు.చిరంజీవి కూడా మంత్రి పదవికి రాజీనామా చేశారు. మిగిలిన సీమాంధ్ర మంత్రులు కూడా రాజీనామాల బాటలో ఉన్నట్లు తెలుస్తోంది. అటు ఏపీఎన్జీవోలు కూడా ప్రజాప్రతినిధులంతా రాజీనామాలు చేయాలని డిమాండ్ చేస్తుండడంతో, నేతలు పదవులను వదులుకోక తప్పేట్లు లేదు.ఇప్పటికే ఎంపీ పదవికి రాజీనామా చేసి స్పీకర్ ఆమోదం కోసం ఎదురుచూస్తున్న ఉండవల్లి, అనంత వెంకటరామిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు
సీడబ్ల్యూసీ ప్రకటన వచ్చినప్పటినుంచి రెండు నెలలుగా తీవ్రస్థాయిలో సీమాంధ్రలో ఉద్యమం జరుగుతున్నా, ఏమాత్రం పట్టించుకోకుండా టీనోట్ కేంద్రం ఆమోదించడంపై సమైక్యవాదులు మండిపడుతున్నారు. ఇప్పటివరకూ జరిగిన పోరాటం ఓ ఎత్తైతే ఇకపై జరిగే పోరాటం మరోలా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర విభజనపై కేంద్రం వెనక్కి తగ్గేవరకూ ఉద్యమాన్ని మహోగ్రంగా కొనసాగిస్తామంటున్నారు.

తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
Categories :
cabinet note . division . seemandhra . shinde . t note . telangana . TOP . upa
తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదాన్ని తెలిపింది. ప్రధాని నివాసంలో రెండు గంటల పాటు జరిగిన చర్చ అనంతరం తెలంగాణ ఏర్పాటుకు అంగీకరించింది కేబినెట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించిన తెలంగాణ ఏర్పాటు చేయాలని, హైదరాబాద్ ను పదేళ్ల పాటు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంచాలని తీర్మానించింది. ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లడానికి మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసింది. కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం కేంద్ర హోంమంత్రి షిండే మీడియా ముందుకు వచ్చి ఈ వివరాలను ప్రకటించారు. రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల ప్రయోజనాలను రక్షించడంపై మంత్రుల బృందం ప్రత్యేక దృష్టి పెడుతుందన్నారాయన. జలవనరులు సహా, ఇతర పంపకాలపై మంత్రుల బృందం నిర్ణయం తీసుకుంటుందన్నారు షిండే. తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం లభించడంతో, పెద్ద ముందడుగు పడినట్లయ్యింది. కేంద్రకేబినెట్ తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకుందని తెలియగానే, సీమాంధ్రలో ఆందోళనలు వెల్లువెత్తాయి. సీమాంధ్రలో 72 గంటల బంద్ కు పిలుపునిచ్చారు సమైక్యవాదులు.
Read more...
రాష్ట్రంలో హై అలర్ట్
Categories :
cabinet note . dgp . high alert . news . police security . t note . telangana . TOP
తెలంగాణపై కేంద్ర కేబినెట్ నోట్ తయారైన నేపథ్యంలో రాష్ట్రంలో హైఅలర్ట్ ప్రకటించారు. కేబినెట్ నోట్ కు ముందే అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పోలీసులకు అందించింది హోంశాఖ. దీంతో అన్ని జిల్లాల ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు కొత్త డీజీపీ ప్రసాదరావు. ముఖ్యంగా సీమాంధ్ర ప్రాంతాల్లో భారీగా ఆందోళనలు, నిరసనలు జరిగే అవకాశం ఉండడంతో జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ లాఠీఛార్జీలకు దిగవద్దని, పూర్తి సంయమనం పాటిస్తూ, ఆందోళనలు నియంత్రించాలని సూచించారు. అరవై రోజులకు పైగా సీమాంధ్రలో ఆందోళనలు నిర్వహిస్తున్న ఏపీఎన్జీవోలు, ఆర్టీసీ,ప్రభుత్వ ఉద్యోగులంతా రేపటినుంచి తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారు.
Read more...
టీ నోట్ వచ్చేసింది
రెండు నెలల క్రితం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్నప్పటినుంచి వాయిదా పడుతూ వచ్చిన తెలంగాణ నోట్ ఎట్టకేలకు కేంద్ర కేబినెట్ ముందుకు వచ్చింది. ప్రధాని నివాసంలో సాయంత్రం ఐదున్నరకు సమావేశమైన కేబినెట్ ముందు ఈ నోట్ ను ప్రవేశ పెట్టారు హోంమంత్రి షిండే. సీడబ్ల్యూసీ ప్రకటనకు తగ్గట్లుగానే హైదరాబాద్ తో కూడిన పది జిల్లాల తెలంగాణ ఏర్పాటుకే కేంద్రం ప్రక్రియ మొదలుపెట్టిందని పేర్కొన్నారు. కేబినెట్ ముందుకు టీ నోట్ రావడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సమైక్యవాదులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. విద్యార్థి జేఏసీ నేతలు ఢిల్లీలో ప్రధాని నివాసాన్ని ముట్టడించడానికి ప్రయత్నించారు. వీరిని అడ్డుకున్న పోలీసులు అరెస్ట్ చేశారు.
Read more...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)