అగ్రశ్రేణి నిర్మాణ సంస్థ డిస్నీ - యూటీవీ మోషన్ పిక్చర్స్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబును నమ్ముకుని తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతోంది. బాలీవుడ్, హాలీవుడ్లో అద్భుతమైన సినిమాలను నిర్మించిన యూటీవీ, ఇప్పటికే తమిళ, మలయాళ చిత్రాలను నిర్మిస్తున్నాయి. అయితే తెలుగులో మాత్రం తొలి సినిమాను మహేశ్ బాబుతోనే మొదలుపెట్టనుంది. దీనికోసం మహేశ్‌కు, యూటీవీకి మధ్య ఒప్పందం కుదిరింది. ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్ 1లో నటిస్తున్నాడు. 'ఆగడు' కూడా మరికొన్ని రోజుల్లోనే సెట్స్‌పైకి వెళుతోంది. ఇది పూర్తికాగానే వచ్చే ఏడాది జులైలో యూటీవీ సినిమా మొదలవుతుంది. యూటీవీతో పాటు మహేశ్ కుటుంబ బ్యానర్ ఇందిరా ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తాయి. అత్యంత భారీ బడ్జెట్‌ను దీనికోసం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. మిర్చితో ఆకట్టుకున్న కొరటాల శివ ఈ సినిమాకు డైరెక్టర్. ఇతర నటీనటులు, సాంకేతిక వర్గాన్ని ఫైనల్ చేయాల్సి ఉంది. ఫ్యామిలీ,యాక్షన్ డ్రామాను అద్భుతంగా తెరకెక్కించగలిగే కొరటాల శివ, మహేశ్‌కు సూపర్ హిట్ ఇస్తాడని ఎదురుచూస్తున్నారు అభిమానులు.
mahesh babu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
mahesh babu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
21, అక్టోబర్ 2013, సోమవారం
మహేశ్‌నే నమ్ముకున్న యూటీవీ
Categories :
cinema . entertainment . koratala shiva . mahesh babu . tollywood . TOP . utv movie
అగ్రశ్రేణి నిర్మాణ సంస్థ డిస్నీ - యూటీవీ మోషన్ పిక్చర్స్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబును నమ్ముకుని తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతోంది. బాలీవుడ్, హాలీవుడ్లో అద్భుతమైన సినిమాలను నిర్మించిన యూటీవీ, ఇప్పటికే తమిళ, మలయాళ చిత్రాలను నిర్మిస్తున్నాయి. అయితే తెలుగులో మాత్రం తొలి సినిమాను మహేశ్ బాబుతోనే మొదలుపెట్టనుంది. దీనికోసం మహేశ్‌కు, యూటీవీకి మధ్య ఒప్పందం కుదిరింది. ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్ 1లో నటిస్తున్నాడు. 'ఆగడు' కూడా మరికొన్ని రోజుల్లోనే సెట్స్‌పైకి వెళుతోంది. ఇది పూర్తికాగానే వచ్చే ఏడాది జులైలో యూటీవీ సినిమా మొదలవుతుంది. యూటీవీతో పాటు మహేశ్ కుటుంబ బ్యానర్ ఇందిరా ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తాయి. అత్యంత భారీ బడ్జెట్‌ను దీనికోసం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. మిర్చితో ఆకట్టుకున్న కొరటాల శివ ఈ సినిమాకు డైరెక్టర్. ఇతర నటీనటులు, సాంకేతిక వర్గాన్ని ఫైనల్ చేయాల్సి ఉంది. ఫ్యామిలీ,యాక్షన్ డ్రామాను అద్భుతంగా తెరకెక్కించగలిగే కొరటాల శివ, మహేశ్‌కు సూపర్ హిట్ ఇస్తాడని ఎదురుచూస్తున్నారు అభిమానులు.
11, అక్టోబర్ 2012, గురువారం
రిబ్బన్ కట్ చేయడానికి రూ.11 కోట్లట!
Categories :
entertainment . mahesh babu . south india shopping mall . tollywood . TOP
షోరూమ్ ఓపెన్ చేయడానికి వచ్చినందుకు 11 కోట్ల రూపాయలు వసూలు చేశాడట టాలీవుడ్ టాప్ స్టార్ మహేశ్ బాబు. ఇటీవలే కూకట్ పల్లిలోని సౌతిండియా షాపింగ్ మాల్ ను ఆయన ప్రారంభించాడు. షోరూమ్ ఓపెనింగ్ కే 11 కోట్లు వసూలు చేయడం ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టాక్ గా మారింది. ఒక్క గంటలో అయిపోయే దానికి.. ఒక సినిమాకు తీసుకున్నంత తీసుకోవడంపై అంతా ఆశ్చర్యపోతున్నారు. సినిమాలతో పోల్చితే.. యాడ్స్ ద్వారానే ఎక్కువ సంపాదిస్తున్న మహేశ్.. మరో కొత్త రికార్డు సృష్టించాడని చెప్పుకుంటున్నారు. ఇప్పటి వరకూ షోరూమ్ లు ఓపెన్ చేయడం ద్వారా హీరోయిన్లే ఎక్కువ సంపాదించారు. అయితే, వాళ్లు కూడా కోటి రూపాయల మార్క్ ను దాటలేదు. ఇప్పుడు మహేశ్ ఏకంగా పదకొండు కోట్లు వసూలు చేయడం సంచలనం సృష్టిస్తోంది.
Read more...
5, అక్టోబర్ 2012, శుక్రవారం
ప్రిన్స్ మహేశ్ ప్రారంభించిన బిల్డింగ్ సీజ్
Categories :
mahesh babu . news . seize . south india shopping mall . TOP
టాలీవుడ్ అందగాడు, సూపర్ స్టార్ మహేశ్ బాబు అట్టహాసంగా ప్రారంభించిన హౌసింగ్ బోర్డ్ లోని సౌతిండియా షాపింగ్ మాల్ ఒక్కరోజు కూడా నడవలేకపోయింది. బిల్డింగ్ కు అనుమతులు లేవని తేల్చిన జీహెచ్ఎంసీ అధికారులు ఆ భవనాన్ని సీజ్ చేశారు. లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఘనంగా ప్రారంభోత్సవం చేసిన సౌతిండియా షాపింగ్ మాల్ యజమానులు.. అధికారుల తీరుతో షాక్ తిన్నారు. వాస్తవానికి ముహూర్తం ప్రకారం గురువారం మధ్యాహ్నం12.35కు మహేశ్ బాబు షాపింగ్ మాల్ ను ప్రారంభించాల్సి ఉంది. కానీ, మహేశ్ వస్తున్నాడని విపరీతంగా ప్రచారం అవడంతో.. షాపింగ్ మాల్ ముందు జనం బారులు తీరారు. దీంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. జామ్ కారణంగా, మహేశ్ రాక ఆలస్యం అయ్యింది. ముహూర్తం దాటాక వచ్చిన ప్రిన్స్.. ఒకటింపావు సమయంలో రిబ్బన్ కట్ చేశారు. బహుశా దీని ఎఫెక్ట్ ఏమైనా పడిందో.. ఏమో.. సౌతిండియా షాపింగ్ మాల్ మూతపడింది.
Read more...
23, జనవరి 2012, సోమవారం
పనీ పాటా లేనివాళ్లకే మనోభావాలా...?
Categories :
businessman . entertainment . mahesh babu . puri jagan . TOP
ఉయ్ లైక్ బ్యాడ్ బాయ్స్... అంటూ బిజినెస్ మేన్ లో పెట్టిన పాట ఇప్పటికే వివాదాస్పదమైన సంగతి అందరికీ తెలిసింది. రాముడిని కించపరిచారని, పాటను సినిమా నుంచి తొలగించాలంటూ విశ్వహిందూ పరిషత్ కొన్ని రోజులుగా ఆందోళన చేస్తూనే ఉంది. కొంతమంది సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్లో దీనిపైనే ఇవాళ ఫిర్యాదు కూడా చేశారు. దీనిపై స్పందన కోరినప్పుడు బిజినెస్ మేన్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి మరింత ఆజ్యం పోశాయి. పనీపాటా లేనివాళ్లకే మనోభావాలుంటాయంటూ, కేసులు పెట్టడంపై ఘాటుగా స్పందించారు పూరీ. పాటపెట్టడమే పెద్ద తప్పైతే, అవమానించి, మరో తప్పు చేశారంటూ మండిపడుతున్నారు హిందుత్వ సంస్థల నేతలు.
Read more...
9, జనవరి 2012, సోమవారం
మహేశ్ ముద్దును ఎంజాయ్ చేసిన నమ్రత
Categories :
businessman . entertainment . kajal . kiss scene . mahesh babu . TOP
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు.. ఈ సారి రెచ్చిపోతున్నాడు. బిజినెస్ మేన్ గా ప్రేక్షకుల ముందుకు రానున్న మహేశ్, హీరోయిన్ కాజల్ ను లిప్ లాక్ చేశాడు. ఇప్పటివరకూ హీరోయిన్లతో ఇలాంటి సీన్లకు దూరంగా ఉన్న మహేశ్ ఈ సారి మాత్రం కట్టుదాటేశాడు. ఆర్య - 2లో అల్లు అర్జున్ తో పెదాలపై ముద్దు పెట్టించుకున్న కాజల్, మహేశ్ విషయంలో మరింత చొరవచూపించింది. ఈ లిప్ లాక్ సీన్ దాదాపు నిమిషం పాటు తెరపై కనిపించనుంది. ఈ విషయాన్ని స్వయంగా సినిమా డైరెక్టర్ పూరీ జగన్నాథే ప్రకటించాడు. కాజల్ కు ముద్దివ్వడానికి మహేశ్ భార్య నమ్రత కూడా సిగ్నల్ ఇచ్చిందట. ప్రివ్యూ చూపించినప్పుడు ఈ సీన్ ను ఆమె బాగా ఎంజాయ్ చేసిందట. ఈ సంగతీ పూరీగారే సెలవిచ్చారు.
Read more...
11, నవంబర్ 2011, శుక్రవారం
11.11.11. మహేశ్ బాబు బిజినెస్ మ్యాన్ ఫస్ట్ పోస్టర్
Categories :
businessman . cinema . entertainment . mahesh babu . puri jagan . tollywood . TOP
11.11.11 ను ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకున్నాడు డైరెక్టర్ పూరీ జగన్నాథ్. మళ్లీ తెలుగులో భారీ హిట్ కొట్టాలని ఎంతో కసిగా మహేశ్ బాబుతో తీస్తున్న బిజినెస్ మ్యాన్ పోస్టర్ ను ఈ సందర్భంగా రిలీజ్ చేశాడు. వచ్చే నెల 11కు ఆడియోను లాంచ్ చేసే ఆలోచనలో కూడా ఉన్నాడు. అంతేకాదు, జనవరి 11 న రిలీజ్ కు సన్నాహాలు చేసుకుంటున్నాడు. అన్నీ పదకొండ్లే కుదిరేలా కదులుతున్నాడు. పోకిరి రికార్డులను మహేశ్ తాజా చిత్రం దూకుడు బద్దలు కొట్టడంతో, వాటిని బిజినెస్ మ్యాన్ తిరగరాస్తుందన్న నమ్మకంతో ఉన్నాడు పూరీ. అంతేకాదు, వరసగా ప్లాప్ లతో ఇబ్బందుల్లో పడ్డ తన కెరీర్ ను, ఆర్థిక స్థితిని ఈ సినిమాతో మార్చుకోవాలనుకుంటున్నాడు. బెస్టాఫ్ లక్ జగన్.
Read more...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)