cm kiran లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
cm kiran లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
19, ఫిబ్రవరి 2014, బుధవారం
సీఎం కిరణ్ రాజీనామా
Categories :
bifurcation . cm kiran . kiran kumar reddy . POLITICS . resign . seemandhra . TOP
రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును లోక్ సభ ఆమోదించడానికి నిరసనగా, ముఖ్యమంత్రి పదవికి, కాంగ్రెస్ పార్టీకి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. తెలుగు ప్రజలను వంచించిస్తూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజిస్తోందని ఆయన ఆరోపించారు. తన రాజకీయ భవిష్యత్తు తనకు ముఖ్యం కాదని, తెలుగు ప్రజల భవిష్యత్తే అని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన కారణంగా రెండు ప్రాంతాలకు అన్యాయం జరుగుతుందన్నారు కిరణ్ కుమార్ రెడ్డి. మరికాసేపట్లో ఆయన గవర్నర్ ను కలిసి తన రాజీనామాను సమర్పించనున్నారు. నవంబర్ 25, 2010న ఆంధ్రప్రదేశ్ 16వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కిరణ్, మూడేళ్ల రెండు నెలల 19 రోజుల పాటు పదవిలో కొనసాగారు.
18, నవంబర్ 2013, సోమవారం
21నే తేలిపోతుందట
తెలంగాణపై కేంద్రమంత్రుల అభిప్రాయ సేకరణ నేటితో ముగిసింది. ముఖ్యమంత్రి, తెలంగాణ, సీమాంధ్ర కేంద్ర మంత్రులతో విడివిడిగా సమావేశమై వారి వాదనలను వింది జీవోఎం. ఇప్పటికే ఈమెయిళ్ల ద్వారా సేకరించిన సమాచారంతో పాటు, రాజకీయ పార్టీలు వెలుబుచ్చిన అభిప్రాయాలు, అధికార వర్గాల ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా విభజన ఎలా చేయాలన్నదానిపై ముసాయిదాను తయారు చేయనుంది జీవోఎం. ఈ నెల 21న చివరిసారిగా సమావేశం కానున్న మంత్రుల బృందం అదేరోజు ముసాయిదాను రూపొందిస్తుంది. ఆ రోజే జరిగే, కేంద్ర కేబినెట్ ముందు దీన్ని ప్రవేశపెట్టనుంది. దాన్ని కేబినెట్ ఆమోదించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ ప్రక్రియ పూర్తైతే త్వరలోనే జరగనున్న శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టనుంది కేంద్రం. ఈ సమావేశాల్లోనే బిల్లును పెడతామని కేంద్ర హోంశాఖ కూడా స్పష్టం చేసింది.
Read more...
12, నవంబర్ 2013, మంగళవారం
కిరణ్ వెనకడుగుకు కారణమేమిటో..?
Categories :
cm kiran . congress . jaggareddy . POLITICS . rachabanda . sangareddy . telangana . TOP . trs
కాంగ్రెస్ నేతల బహిష్కరణ, టీఆర్‌ఎస్, టీజేఏసీ బంద్‌కు పిలుపునిచ్చినా, మెదక్ జిల్లా సంగారెడ్డిలో బుధవారం రచ్చబండ నిర్వహించాలని డిసైడ్ అయ్యి, అన్ని ఏర్పాట్లు చేసుకున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, అనూహ్యంగా తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. రచ్చబండ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. ఢిల్లీలో విభజన ప్రక్రియ ఊపందుకున్న తరుణంలో, తెలంగాణ నుంచే రచ్చబండకు శ్రీకారం చుట్టడం ద్వారా, సమైక్యవాదాన్ని బలంగా వినిపించాలని భావించారు సీఎం కిరణ్. ఈ విషయంలో తన వెన్నంటి నడిచే సంగారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ జగ్గారెడ్డి సహకరించడంతో సంగారెడ్డి రచ్చబండకు ఏర్పాట్లు శరవేగంగా సాగాయి. అసలే కిరణ్ పేరెత్తితే, కస్సుమంటున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు, ఈ సభను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఎవరూ సభకు హాజరుకాకూడదంటూ, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడే ఏకంగా ప్రెస్‌మీట్ పెట్టి మరీ ప్రకటించారు. ఇలాంటి పరిస్థితి అంతకుముందెప్పుడూ లేదు. పైగా, టీఆర్‌ఎస్, టీజేఏసీలు కూడా బంద్‌కు పిలుపునివ్వడంతో సంగారెడ్డిలో ఉత్కంఠభరిత వాతావరణం ఏర్పడింది. అయినా సరే, సభను నిర్వహిస్తానంటూ జగ్గారెడ్డి చెప్పడం కాకపుట్టించింది. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే ముఖ్యమంత్రితో సమావేశమైన సునీతా లక్ష్మారెడ్డి, గీతారెడ్డిలు సీఎంతో రచ్చబండపై చర్చ జరిపారు. సీఎం పర్యటిస్తే, మరింత వ్యతిరేకత వస్తుందని, తాము కూడా హాజరుకాలేని పరిస్థితి ఉందంటూ వివరించారు. దీంతో, ప్రస్తుతానికి సంగారెడ్డి సభను వాయిదా వేసుకోవాలని కిరణ్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Read more...
8, నవంబర్ 2013, శుక్రవారం
ప్రధాని కార్యాలయం ఎందుకు పిలిచినట్లు?
ఢిల్లీలో కాంగ్రెస్ సమన్వయ కమిటీ భేటీకి హాజరవడానికి హస్తినకు వెళ్లిన ముఖ్యమంత్రి కిరణ్, ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు ప్రధాని కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది. శనివారం ఉదయం 10.30కు జరిగే సమావేశానికి హాజరుకావాలంటూ వర్తమానం అందించారు పీఎంఓ అధికారులు. రాష్ట్ర విభజనపై అన్ని పార్టీలతోనూ త్వరలోనే మంత్రుల బృందం సమావేశమవుతున్న నేపథ్యంలో, అందరూ కాంగ్రెస్‌లో ఏకాభిప్రాయం లేదనే ఒత్తిడి తెస్తారు కాబట్టే, ముగ్గురు నేతలతో ప్రధాని సమావేశమవుతున్నట్లు సమాచారం. విభజనకు అంగీకరించాలని కిరణ్‌ను, బొత్సను ప్రధాని కోరే అవకాశాలున్నాయి.
Read more...
3, నవంబర్ 2013, ఆదివారం
క్లిక్ కొడితే ఇక కిక్కే
ఇది ఆన్‌లైన్ యుగం. ఏది కావాలన్నా ఆన్‌లైన్‌లో దొరికేస్తోంది. పప్పులు, ఉప్పులు అమ్మడానికి కూడా బిగ్ బాస్కెట్ లాంటి సైట్లు పుట్టుకొచ్చాయి. అయితే, ఒకే ఒక్కటి మాత్రం ఇప్పటికీ నెట్‌లో అమ్మకానికి దొరకడం లేదు. అదే మద్యం. అన్నీ దొరికినప్పుడు ఇది మాత్రం ఎందుకు దొరకకూడదన్న ఆలోచన మన అధికారులకు వచ్చేసింది. అందుకే, మద్యాన్ని ఆన్‌లైన్‌లో అమ్మడానికి సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేసి ముఖ్యమంత్రికి పంపించారు. ఆ ఫైల్‌పై ఆయన సంతకం పెట్టేస్తే, ఇక రాష్ట్రవ్యాప్తంగా మద్యం ఆన్‌లైన్‌లోనే కొనుక్కునే అవకాశం లభిస్తుంది.
పెద్దగా రాబడి లేకపోవడం, భారీగా లంచాలను ఇవ్వాల్సిన రావడంతో, ఈ సారి 1200కు పైగా మద్యం దుకాణాలను లైసెన్సులను రెన్యువల్ చేయించుకోవడానికి ముందుకు రాలేదు. వీటి ద్వారా వచ్చే ఆదాయాన్ని కోల్పోయామని భావిస్తున్న అబ్కారీ శాఖ, ఇలా ఆన్‌లైన్ ఎత్తుగడ వేసింది. సైట్‌లోకి లాగిన్ అయ్యి, కావల్సిన మద్యాన్ని ఎంచుకుని, నెట్‌బ్యాంకింగ్ లేదా డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపు చేయాల్సి ఉంటుంది. పేమెంట్ పూర్తైన తర్వాత, ఎక్సైజ్ శాఖకు చెందినవాళ్లే ఇంటికి తీసుకువచ్చి మద్యం బాటిళ్లను అప్పగించి వెళ్తారు. ఓ రకంగా ఇది ఇంటింటికీ మద్యం పథకం లాంటిదన్నమాట. దీనివల్ల భారీగా ఆదాయం వస్తుందన్న అంచనాలో ఉన్నారు అధికారులు. సీఎం కిరణ్ కుమార్ దీనికి అంగీకరిస్తే, ఒకటి రెండు నెలల్లోనే ఇది ఇంటర్నెట్లో అందుబాటులోకి వచ్చేసే అవకాశం ఉంది.

26, అక్టోబర్ 2013, శనివారం
రాష్ట్రపతికి,ప్రధానికి సీఎం రాసిన పూర్తి లేఖ
రాష్ట్ర విభజన ప్రక్రియను వ్యతిరేకిస్తూ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి లేఖ రాశారు. రాష్ట్ర విభజన వల్ల తలెత్తుతున్న సమస్యలను ప్రస్తావించడంతో పాటు, విభజన ప్రక్రియలో కేంద్రం లోపభూయిస్ట విధానాలను అనుసరిస్తోందంటూ లేఖలో దుయ్యబట్టారు. ప్రధానికి, రాష్ట్రపతికి సీఎం రాసిన లేఖను కింద ఉన్న లింక్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకుని చదువుకోవచ్చు.
డౌన్‌లోడ్
లేదా.
https://drive.google.com/file/d/0B0Zk086Jxr6dTk9SZHJfWVNLZkk/edit?usp=sharing
Read more...
డౌన్‌లోడ్
లేదా.
https://drive.google.com/file/d/0B0Zk086Jxr6dTk9SZHJfWVNLZkk/edit?usp=sharing
25, అక్టోబర్ 2013, శుక్రవారం
విభజనపై కిరణ్ లేఖాస్త్రం
రాష్ట్రవిభజనను ముందునుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మరోసారి ఈ వ్యవహారంలో స్పందించారు. విభజన అంశంపై రాష్ట్రపతి, ప్రధానమంత్రికి లేఖ రాశారాయన. రాష్ట్ర విభజన రాజ్యాంగబద్ధంగా మాత్రమే జరగాలని సీఎం లేఖలో కోరారు. గతంలో ఛత్తీస్‌ఘడ్, ఉత్తరాంచల్, జార్ఖండ్ రాష్ట్రాలను రాజ్యాంగ బద్ధంగానే ఏర్పాటు చేశారని, తెలంగాణ విషయంలోనూ అదే ప్రక్రియను అనుసరించాలని కోరారు సీఎం. విభజనపై తమకు అనేక అనుమానాలున్నాయని, మంత్రుల బృందంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిని సభ్యుడిగా చేర్చకపోవడంతో అవి మరింత ఎక్కువయ్యాయని లేఖలో పేర్కొన్నారు కిరణ్ కుమార్ రెడ్డి. .
Read more...
1, అక్టోబర్ 2013, మంగళవారం
సమైక్య సింహం..కొత్తపార్టీ
కాంగ్రెస్ హైకమాండ్ ఆశీస్సులతో అనూహ్యంగా సీఎం పదవిని అందుకుని పరిపాలననంతా తన చేతుల్లోకి తీసుకున్న కిరణ్ కుమార్ రెడ్డి, ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను పూర్తిగా తన చేతుల్లోకి తీసుకోవాలనుకుంటున్నారు. సమైక్య ఉద్యమం మొదలైన పదిరోజుల దాకా పెద్దగా స్పందించని సీఎం, ఉద్యమ తీవ్రతను చూసి రూట్ మార్చారు. ఈ ఉద్యమాన్నే తన రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పే మెట్టుగా మార్చుకోవాలనుకుంటున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో తనకు మరో రాజకీయ పార్టీ పెట్టే ఉద్దేశ్యం లేదని చెప్పినప్పటికీ, సీఎం వర్గం ఆమేరకు కసరత్తు చేసినట్లే తెలుస్తోంది. విశాఖ పర్యటనకు సోమవారం వెళ్లాల్సిన సీఎం, అక్కడే కాంగ్రెస్ అధిష్టానానికి తనకు సంబంధం లేదనే విషయాన్ని ప్రకటించడానికి ఏర్పాట్లు జరిగాయి. కానీ, చివరి నిమిషంలో ఆ పర్యటన వాయిదా పడింది.
ప్రస్తుతం సీఎం కిరణ్ తీరు చూస్తుంటే, తన వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకోవడానికన్నట్లే ఉందని కాంగ్రెస్ లోని సీనియర్లు, మంత్రులే బాహటంగా వాపోతున్నారు. పార్టీని, మంత్రిమండలిని ఆత్మరక్షణలో పడేసేలా సీఎం కామెంట్లు చేస్తుండడంపై వారు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అధిష్టానంతో తలపడే స్టార్ బ్యాట్సమెన్ గా, సమైక్య సింహంగా సీఎం కిరణ్ ను ఇప్పటికే సీమాంధ్ర నేతలు, ఉద్యమకారులు పైకెత్తేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో మరెవరూ అధిష్టానంతో ఢీ అంటే ఢీ అనే పరిస్థితి లేకపోవడంతో సమైక్యవాదులకు ఏకైక లీడర్ గా సీఎం కనిపిస్తున్నారు. అందుకే, ఉద్యోగుల్లో, ఉద్యమకారుల్లో ఆయనకు పూర్తి మద్దతు లభిస్తోంది. పైగా జగన్ సమైక్య స్టాండ్ తీసుకున్నప్పటికీ, కాంగ్రెస్ తో ఒప్పందంలో భాగంగానే బెయిల్ దక్కించుకున్నారన్న ప్రచారం ఆయనకు మైనస్ గా మారింది. సీమాంధ్రలోనూ ఇప్పుడు జగన్ పూర్తిస్థాయిలో ఆదరణ లేదు. ఇక అటు తెలంగాణ, ఇటు సమైక్య మాటలతో టీడీపీ ఎటూ కాకుండా ఉంది. కాంగ్రెస్ అధిష్టానంపై సీమాంధ్ర ప్రజలంతా మంటతో ఉన్నారు. ఈ నేపథ్యంలో సీఎం కిరణ్ కొత్త పార్టీ పెడితే, అది అందరికీ ప్రత్యామ్నాయంగా ఎదిగి, వచ్చే ఎన్నికలను క్లీన్ స్వీప్ చేయవచ్చన్న చర్చ సమైక్యవాదుల్లో జరుగుతోంది. దీన్నంతా గమనించే, విశాఖ వేదికగా తాను కాంగ్రెస్ నుంచి బయటకు వస్తున్నానని సీఎం చెప్పాలనుకున్నట్లు సమాచారం. మంత్రి గంటా ఏర్పాటు చేసిన ఈ టూర్ లో వంద కోట్లతో నిర్మించిన ఫ్లైఓవర్ ను సీఎం ప్రారంభించాల్సి ఉంది. ఎక్కడా కాంగ్రెస్ జెండా అన్నది కనిపించకుండా, కేవలం సీఎం పోస్టర్లతోనూ, సమైక్యసింహం అంటూ కటౌట్లతోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు జరిగాయి. అయితే, సీఎం ప్రెస్ మీట్ పై అధిష్టానం తీవ్ర ఆగ్రహంగా ఉండడం, ఆయన ఫోన్ కాల్స్ కు కూడా స్పందించకుండా పక్కన పెట్టడం, చివరకు ఎవరు వెళ్లినా సమయం ఇచ్చి మాట్లాడే దిగ్విజయ్ కూడా సీఎం ఫోన్లకు స్పందించకపోవడంతో, ప్రస్తుతానికి ఈ కొత్త పార్టీ కాన్సెప్ట్ ను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఏమైనా సమైక్య ఉద్యమం ఇదే స్థాయిలో కొనసాగి, కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణ వైపే అడుగులు వేస్తే మాత్రం సీఎం కొత్త పార్టీ పెట్టడం ఖాయంగానే కనిపిస్తోంది.

30, సెప్టెంబర్ 2013, సోమవారం
సీఎం చెప్పిన ఆ మాటలను ఎలా అర్థం చేసుకోవాలి..?
అధిష్టానంపై తిరుగుబాటు బావుటా ఎగరవేస్తూ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఈ నెల 27న మీడియా సమావేశం పెట్టారు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ అధినాయకత్వం పచ్చజెండా ఊపిన తర్వాత సీఎం నిర్వహించిన రెండో తిరుగుబాటు మీడియా సమావేశం ఇది. రాష్ట్రం విడిపోవడం వల్ల వచ్చే సమస్యలను ఈ సమావేశంలో ఏకరువు పెట్టారాయన. ఢిల్లీలో కూర్చుని నిర్ణయాలు తీసుకుంటే కుదరదని, ప్రజా నిర్ణయానికే తలొగ్గాలని ఆయన ప్రకటించారు. ఆయన చెప్పిన వాటిలో వాస్తవాలున్నాయని సీమాంధ్ర ఉద్యమకారులు, అన్నీ అవాస్తవాలేనంటూ తెలంగాణ వాదులు వాదోపవాదాలు చేసుకున్నారు. ఇందులో ఎవరు నెగ్గుతారన్న విషయాన్ని ఇప్పటికిప్పుడు తేల్చలేం. అయితే, సీఎం మీడియా సమావేశం ఆధారంగా మరుసటి రోజు ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఓ చిన్న న్యూస్ కటింగ్ మాత్రం నన్ను విశేషంగా ఆకట్టుకొంది. ఆ న్యూస్ కటింగ్ ను ఈ పోస్ట్ లో అతికిస్తున్నాను.
![]() | |
| సెప్టెంబర్ 28,2013న ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త |
9, ఆగస్టు 2013, శుక్రవారం
అంతా వైఎస్సే చేశారు
రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ ప్రకటన వచ్చినప్పటి
నుంచి
క్యాంప్ ఆఫీస్ లోనే ఉండిపోయిన సీఎం కిరణ్, తొమ్మిది రోజుల తర్వాత మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకు కనిపించారు. రాష్ట్రంలో ఉద్యమాలు, ఆందోళనలు రగులుతున్న సమయంలో సీఎం లాంటి వ్యక్తి ఇంతకాలం
బయటకు రాకపోవడం చాలా అరుదైన విషయం. అయితే, ఏ ప్రాంతంలోనైనా ఆందోళనలను అరికట్టడంలో కఠినంగానే వ్యవహరిస్తామన్నారు
కిరణ్. రాష్ట్ర విభజన విషయంలో ఆంటోనీ కమిటీకి అందరూ అభిప్రాయాలు
చెప్పొచ్చన్న సీఎం,
కమిటీనే రాష్ట్రానికి రప్పిస్తామన్నారు. అసలు రాష్ట్ర విభజనకు మూలమైన వ్యక్తి వైఎస్సే అన్నారు. 2001-02లో తెలంగాణ ఇవ్వాలంటూ కాంగ్రెస్ హైకమాండ్ ముందుకు ఎమ్మెల్యేలను
వైఎస్సే పంపించారన్నారు సీఎం కిరణ్. అప్పటినుంచి
తెలంగాణ అంశాన్ని పరిశీలిస్తున్న అధిష్టానం ఇప్పుడు నిర్ణయాన్ని వెలువరిచిందన్నారు.
రాష్ట్ర విభజన తనకు ఏ మాత్రం ఇష్టం లేదన్న సీఎం కిరణ్, విభజనకు
ముందే చాలా సమస్యలను పరిష్కరించాల్సి ఉంటుందన్నారు. నీటి పంపిణీ, విద్యుత్
పంపిణీ, వనరుల పంపిణీ విషయంలో చాలా ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. రాష్ట్ర
విభజన జరిగితే తెలంగాణ ప్రాంత రైతులు తీవ్రంగా నష్టపోతారని, విద్యుత్
అందదని హెచ్చరించారు కిరణ్. చత్తీస్ గఢ్ నుంచి పదివేల మెగావాట్లను తీసుకువస్తానని ఇటీవల కేసీఆర్
చేసిన ప్రకటన హాస్యాస్పదం అన్నారు ముఖ్యమంత్రి. చత్తీస్ గఢ్ లో విద్యుత్ ఉత్పత్తే 6300 మెగా
వాట్లని, పైగా, వచ్చే మూడేళ్ల దాకా ఛత్తీస్ గఢ్ తో మనకు గ్రిడ్ కనెక్టివిటీ
ఉండదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రెండు ప్రాంతాలకు అన్యాయం జరగకుండా విభజన ఎలా
చేస్తారో చెప్పాల్సి ఉందన్నారాయన.
పార్టీ గానీ, ప్రభుత్వం గానీ, ఈ
విభజనపై ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉందన్నారు కిరణ్ కుమార్ రెడ్డి. ఓ రకంగా
మీడియా ద్వారా, అధిష్టానాన్ని నిలదీశారు సీఎం.
4, ఆగస్టు 2013, ఆదివారం
ఇప్పుడు సీఎం పదవిలో కిరణ్ ఉండొచ్చా..?
సీఎం క్యాంప్ ఆఫీస్ లో ఐదుగంటలకుపైగా చర్చలు జరిపిన సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మూడు తీర్మానాలను కాంగ్రెస్ హైకమాండ్ కు పంపించారు. మొదటిది రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం
రెండోది సీడబ్ల్యూసీ తీర్మానాన్ని వెనక్కి తీసుకోవడం
మూడోది కాంగ్రెస్ జెండాపైనే సమైక్య ఉద్యమాన్ని చేయడం
సీమాంధ్ర ప్రాంత నేతలకు, అక్కడి ఉద్యమ ఒత్తిడికి లోనై ఈ తరహా నిర్ణయాన్ని సీమాంధ్ర నేతలు తీసుకోవడం ఏమాత్రం తప్పుకాదు. అయితే, ఈ తీర్మానంపై సీఎం కిరణ్, పీసీసీ చీఫ్ బొత్స సంతకాలు చేయడమే ఆలోచించాల్సిన విషయం. సీఎం రాష్ట్రం మొత్తానికి ప్రభుత్వం తరపున ప్రాతినిధ్యం వహించాల్సిన వ్యక్తి, పార్టీ పరంగా రాష్ట్రం మొత్తానికి ప్రాతినిధ్యం వహించాల్సిన వ్యక్తి పీసీసీ చీఫ్. ముందు వీరిద్దరూ ఎలాంటి వాదన వినిపించినా, అంతిమంగా మాత్రం హైకమాండ్ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని వీరిద్దరూ ప్రకటించారు. రాష్ట్రాన్ని విభజించాలంటూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నాక, పీసీసీ చీఫ్ తాను రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికే ప్రయత్నిస్తానంటూ గాంధీభవన్ సాక్షిగా మీడియా మీట్ లో ప్రకటించారు. ఇప్పుడు, ఏకంగా సీఎం తీర్మానాలపై సంతకం చేశారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఓ వాదాన్ని మాత్రమే బలపరిచడానికి సిద్ధపడినప్పుడు, ఆ వాదానికి అటోమెటిక్ గానే బలం చేకూరుతుంది. తన వాదనా బలం పెంచుకోవడానికి, ఆయన ఉద్యమకారులకూ సహకరించవచ్చు. సీమాంధ్రలో ఉద్యమాల నియంత్రణపై దృష్టి పెద్దగా పెట్టకపోవచ్చు, పైగా సహకరించే అవకాశాలూ ఉన్నాయి. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు.
అందుకే, రాష్ట్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ వాదం వైపు మొగ్గు చూపని వ్యక్తే ముఖ్యమంత్రిగా ఉండాల్సిన అవసరం ఉంది. అప్పుడే, రాష్ట్రంలో శాంతి నెలకొంటుంది. విభజన ప్రక్రియ సజావుగా సాగుతుంది. లేదంటే, నిరంతరం అగ్నిగోళంలా మండుతూనే ఉంటుంది.

12, జులై 2013, శుక్రవారం
ఊరించి ఉస్సూరు మనిపించారు..
ఇదిగో తేలిపోతుంది.. అదిగో తేలిపోతోందంటూ పదిరోజులుగా ఊదరగొట్టిన కాంగ్రెస్ అధిష్టానం, తెలంగాణ విషయంలో మళ్లీ పాతపాటే పాడింది. సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్ లను రోడ్ మ్యాప్ తెమ్మని తేల్చేస్తామన్న కాంగ్రెస్ హైకమాండ్, దాదాపు రెండు గంటల పాటు ప్రధాని నివాసంలో సుదీర్ఘంగా కసరత్తు చేసింది. డిప్యూటీ సీఎం మొదటగా, ఆ తర్వాత పీసీసీ చీఫ్, చివరగా సీఎం తమ వాదనను సోనియా కు వివరించారు. ప్రధాని మన్మోహన్, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ రాహుల్ గాంధీ, ఆంటోనీ, దిగ్విజయ్, ఆజాద్ లు హాజరైన ఈ భేటీలో, రాష్ట్ర నాయకత్రయం ఇచ్చిన వివరణను పూర్తిగా విన్నారు. అయితే, రాష్ట్ర విభజన విషయాన్ని కేవలం కోర్ కమిటీ భేటీతో తేల్చేయలేమని భావించిన నేతలు, దీన్ని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ విస్తృత స్థాయి సమావేశంలో చర్చించాలని నిర్ణయించారు. మరో వారం పదిరోజుల్లో సీడబ్లూసీలో దీనిపై చర్చిస్తామని, భేటీ అనంతరం ప్రకటించారు దిగ్విజయ్ సింగ్. వర్కింగ్ కమిటీలో నిర్ణయించిన తర్వాత, దాన్ని కేంద్ర ప్రభుత్వానికి నివేదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, వర్కింగ్ కమిటీలోని కీలక నేతలైన సోనియా, రాహుల్, ప్రధాని మన్మోహన్ లు ఉన్న కోర్ కమిటీలోనే నిర్ణయం తీసుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు, సీడబ్ల్యూసీలో అయినా స్పష్టత ఇస్తారన్న నమ్మకం కలగడం లేదు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే, విభజన అంశాన్ని వీలైనంతగా నాన్చేధోరణినే కాంగ్రెస్ కొనసాగించేటట్లు కనిపిస్తోంది.
Read more...
29, ఏప్రిల్ 2013, సోమవారం
వాట్ యాన్ ఐడియా సీఎం జీ..!
Categories :
bangaru talli . cm kiran . congress . new scheme . POLITICS . TOP
ఖర్చు తక్కువవ్వాలి.... ప్రచారం మాత్రం ఫుల్ గా రావాలి. ఇదే ఇప్పుడు సీఎం కిరణ్ స్ట్రాటజీలా కనిపిస్తోంది. ఇప్పటికిప్పుడు తన ప్రభుత్వంపై పెద్దగా భారం పడకుండానే, అమోఘమైన క్రెడిట్ ను కిరణ్ సొంతం చేసుకోబోతున్నారు. తాజా ప్రకటించిన బంగారుతల్లి పథకం కింద ఆడపిల్ల పుడితే వెంటనే రూ.2500 ఇస్తామని ప్రకటించారు సీఎం. ఒకటో తరగతిలో చేరినప్పటి నుంచి ప్రతీ కొంతమొత్తం ఇచ్చేలా ఈ పథకాన్ని రూపొందించారు. ఈ లెక్కన డిగ్రీ అయ్యేనాటికి ఒక్కో అమ్మాయికి 22 వేల రూపాయలు అందిస్తామని ఘనంగా ప్రకటించారు సీఎం. అయితే, ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న ఆడపిల్లలకు ఈ పథకం వల్ల ఏమాత్రం ఉపయోగం లేదు. మే 1 తర్వాత పుట్టే పిల్లలకు మాత్రమే ఈ పథకం వర్తించనుంది. సగటున తీసుకుంటే, ఏటా దాదాపు ఏడు లక్షల మంది అమ్మాయిలు జన్మించే అవకాశం ఉంది. ప్రస్తుత ప్రభుత్వం మరో ఏడాది కాలమే అధికారంలో ఉంటుంది కాబట్టి, కిరణ్ సర్కార్ పై పడే బడ్జెట్ భారం 175 కోట్లు మాత్రమే. ఆ తర్వాత వచ్చే ప్రభుత్వాలే ఈ భారాన్ని మోయాల్సి ఉంటుంది.
2011 లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఆరేళ్ల లోపున్న అమ్మాయిల సంఖ్య 41, 94,356..
2001 లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఆరేళ్లలోపు ఉన్న అమ్మాయిల సంఖ్య 4984536. అంటే పదేళ్లలో ఆరేళ్ల లోపు ఉన్న బాలికల సంఖ్య 790180 తగ్గిపోయింది. దాదాపు ఇది 16 శాతానికి సమానం. వచ్చే దశాబ్దిలో ఇది మరింత తగ్గనుంది. ఈ లెక్కన చూస్తే, ప్రభుత్వంపై పడే మరింత తగ్గొచ్చు. తర్వాత వచ్చే ప్రభుత్వాలు కానీ, ముఖ్యమంత్రులు గానీ ఈ పథకాన్ని ఎంతవరకూ కొనసాగిస్తారన్నది అనుమానమే. కేవలం 175 కోట్ల ఖర్చుతో, అమ్మాయిలకు ఆపద్భాందవుడిగా లైఫ్ లాంగ్ పేరు ప్రఖ్యాతులు సొంతం చేసుకోనున్నారు సీఎం కిరణ్.

5, ఏప్రిల్ 2013, శుక్రవారం
చిరంజీవి లెటర్ ను విసిరి కొట్టిన సీఎం
Categories :
chiranjeevi . cm kiran . congress . differences . POLITICS . TOP
మెగాస్టార్ చిరంజీవికి, సీఎం కిరణ్ కు మధ్య విబేధాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. విద్యుత్ ఛార్జీల పెంపుపై తనను పదే పదే బహిరంగంగా విమర్శించడాన్ని సీఎం సీరియస్ గా తీసుకున్నారు. ఈ వారాంతంలో ఢిల్లీ వెళ్లనున్న సీఎం, అధిష్టానానికి చిరంజీవిపై ఫిర్యాదు చేయబోతున్నారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, సమన్వయ కమిటీలో చర్చించకుండా నిర్ణయం ఎలా తీసుకుంటారంటూ బహిరంగంగానే అడిగిన చిరంజీవి ఈ మేరకు సీఎంకు ఓ లేఖ రాశారు. దీన్ని మౌలికసదుపాయాల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుతో సీఎంకు పంపించారు. అయితే, ఈ లెటర్ ఇవ్వగానే తీవ్రంగా మండిపడ్డ సీఎం, దాన్ని విసిరి పడేశారట. దీంతో, వీరిద్దరిమధ్యా అగాధం మరింత పెరిగినట్లు కనిపిస్తోంది. దీని ప్రభావం రాబోయే రోజుల్లో పార్టీపై పడొచ్చన్న అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతోంది. 22, జనవరి 2013, మంగళవారం
ప్రభుత్వోద్యోగులకు వారానికి ఐదు రోజులే పని
హైదరాబాద్ లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఇకపై వారానికి ఐదురోజులే పనిదినాలను ప్రభుత్వ కార్యాలయాల్లో అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. విద్యుత్ సంక్షోభానికి పరిష్కారాలను వెదుకుతున్న ప్రభుత్వం.. ఈ ఐదు రోజుల పనిదినాలను కూడా అందులో భాగంగానే అమలు చేయాలనుకొంటోంది. వారానికి ఐదు రోజులే ప్రభుత్వ కార్యాలయాలను తెరవడం ద్వారా, 5 నుంచి 6 మిలియన్ విద్యుత్ యూనిట్లను ఆదా చేయవచ్చని అధికారులు భావిస్తున్నారు. దీనిపై సీఎం కిరణ్ తో చర్చలు జరిపారు. త్వరలోనే ప్రభుత్వం అధికారికంగా ఈ ప్రకటన చేసే అవకాశం ఉంది. అయితే.. వారంలో ఆరు రోజులు పనిచేస్తేనే పెండింగ్ లో ఎన్నో ఫైళ్లు పడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో.. ఐదురోజుల పనిదినాల పద్ధతిపై మాత్రం సామాన్యుల్లో అసంతృప్తే వ్యక్తమవుతోంది.
Read more...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)