ఖరీదైన వాహనాల కొనుగోలు ఇటీవల కాలంలో భారీగా పెరుగుతోంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న కార్లు, టూవీలర్స్ ను ఉన్నతస్థాయి వర్గాలు విపరీతంగా కొంటున్నాయి. వీటిపై కొత్త బడ్జెట్ లో భారీగా వాత వేశారు చిదంబరం. విదేశీ కార్లపై వందశాతం ఇంపోర్ట్ డ్యూటీ విధించారు. 800 సీసీ ద్విచక్ర వాహనాలపై 15 శాతం ట్యాక్స్ పెంచారు. గతంలో ఇది 60 శాతం ఉండగా, ఇప్పుడు 75 శాతం పెరగనుంది. SUV లపై ఎక్సైజ్ ట్యాక్స్ ను 27 శాతం నుంచి 30 శాతానికి పెంచారు. ఇది ఉన్నతవర్గాలకు మింగుడు పడని విషయమే. విదేశీ కార్లు కొని తమ స్పెషాలిటీని చాటుకోవాలనుకునే వాళ్లు ఇకపై మరింతగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.
సెల్లుకూ బిల్లే..!
ప్రతీ ఒక్కరికీ కనీస అవసరంగా మారిన సెల్ ఫోన్ నూ వదిలిపెట్టలేదు చిదంబరం. రెండు వేల రూపాయల ఖరీదు దాటిన ప్రతీ ఫోన్ పైనా 6 శాతం పన్ను విధించారు ఆర్థికమంత్రి. ఇకపై ఫోన్లు కూడా ఖరీదు కానున్నాయి.
పొగరాయుళ్లకు మొహాన పొగకొట్టారు చిదంబరం. సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపై 18 శాతం ఎక్సైజ్ ట్యాక్స్ వేశారు. ట్యాక్స్ స్లాబ్ లను మాత్రం మార్చలేదు చిదంబరం. రెండు లక్షల నుంచి 5 లక్షల రూపాయలు సంపాదించేవారికి మాత్రం రెండు వేల రూపాయల ట్యాక్స్ క్రెడిట్ చేస్తామని హామీ ఇచ్చారు.
కోటిరూపాయలు పైన సంపాదిస్తున్న వారు కేవలం 42600 మంది మాత్రమే ఉన్నారని చెప్పిన చిదంబరం, కోటి రూపాయల ఆదాయం దాటిన వ్యక్తిగత, హిందూ అవిభాజ్య కుటంబాలకు మాత్రం వచ్చే ఆర్థిక సంవత్సరానికి పది శాతం సర్ ఛార్జ్ విధించారు.
CHIDAMBARAM లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

28, ఫిబ్రవరి 2013, గురువారం
లగ్జరీ అంటే లేచిపోతుంది!
ఖరీదైన వాహనాల కొనుగోలు ఇటీవల కాలంలో భారీగా పెరుగుతోంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న కార్లు, టూవీలర్స్ ను ఉన్నతస్థాయి వర్గాలు విపరీతంగా కొంటున్నాయి. వీటిపై కొత్త బడ్జెట్ లో భారీగా వాత వేశారు చిదంబరం. విదేశీ కార్లపై వందశాతం ఇంపోర్ట్ డ్యూటీ విధించారు. 800 సీసీ ద్విచక్ర వాహనాలపై 15 శాతం ట్యాక్స్ పెంచారు. గతంలో ఇది 60 శాతం ఉండగా, ఇప్పుడు 75 శాతం పెరగనుంది. SUV లపై ఎక్సైజ్ ట్యాక్స్ ను 27 శాతం నుంచి 30 శాతానికి పెంచారు. ఇది ఉన్నతవర్గాలకు మింగుడు పడని విషయమే. విదేశీ కార్లు కొని తమ స్పెషాలిటీని చాటుకోవాలనుకునే వాళ్లు ఇకపై మరింతగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.
సెల్లుకూ బిల్లే..!
ప్రతీ ఒక్కరికీ కనీస అవసరంగా మారిన సెల్ ఫోన్ నూ వదిలిపెట్టలేదు చిదంబరం. రెండు వేల రూపాయల ఖరీదు దాటిన ప్రతీ ఫోన్ పైనా 6 శాతం పన్ను విధించారు ఆర్థికమంత్రి. ఇకపై ఫోన్లు కూడా ఖరీదు కానున్నాయి.
పొగరాయుళ్లకు మొహాన పొగకొట్టారు చిదంబరం. సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపై 18 శాతం ఎక్సైజ్ ట్యాక్స్ వేశారు. ట్యాక్స్ స్లాబ్ లను మాత్రం మార్చలేదు చిదంబరం. రెండు లక్షల నుంచి 5 లక్షల రూపాయలు సంపాదించేవారికి మాత్రం రెండు వేల రూపాయల ట్యాక్స్ క్రెడిట్ చేస్తామని హామీ ఇచ్చారు.
కోటిరూపాయలు పైన సంపాదిస్తున్న వారు కేవలం 42600 మంది మాత్రమే ఉన్నారని చెప్పిన చిదంబరం, కోటి రూపాయల ఆదాయం దాటిన వ్యక్తిగత, హిందూ అవిభాజ్య కుటంబాలకు మాత్రం వచ్చే ఆర్థిక సంవత్సరానికి పది శాతం సర్ ఛార్జ్ విధించారు. 26, మే 2009, మంగళవారం
2011 నాటికి 'బహుళ ప్రయోజన కార్డు'లు
Categories :
CHIDAMBARAM . HOME MINISTRY . MIN CARDS . MNIC . news
దేశంలోని ప్రతి పౌరునికి వచ్చే 2011 నాటికి బహుళ ప్రయోజన గుర్తింపు కార్డులను అందజేస్తామని కేంద్ర హోం శాఖామంత్రి పళనియప్పన్ చిదంబరం తెలిపారు. ఆయన కేంద్ర హోం మంత్రిగా తాజాగా బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే 2011 నాటికి 'జాతీయ జనాభా పట్టిక' (నేషనల్ పాపులేషన్ రిజిస్టర్) సిద్ధమవుతుందన్నారు. దీనితో పాటు 'మల్టీపర్పస్ నేషనల్ ఐడెంటిటీ కార్డు' (ఎంఎన్ఐసీ-బహుళ ప్రయోజన గుర్తింపు కార్డు)ను కూడా 2011 నాటికి ప్రతి పౌరునికి అందజేస్తామని మంత్రి చిదంబరం తెలిపారు.
జాతీయ జనభా పట్టికలోని ప్రతి పౌరునికి ఈ కార్డును అందజేయడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ధ్యేయమన్నారు. అయితే, ఈ ప్రాజెక్టు అమలు ప్రక్రియలో సాంకేతికంగా పలు సమస్యలు తలెత్త వచ్చని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
దీనిపై మంత్రి చిదంబరం స్పందిస్తూ.. ఇప్పటికే ప్రభుత్వం ఎంపిక చేసిన 12 రాష్ట్రాలతో పాటు ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 30.95 లక్షల మందికి ప్రయోగాత్మక ప్రాతిపదికన అందజేసేందుకు శ్రీకారం చుట్టినట్టు చెప్పారు.
కోస్తా జిల్లాలతో పాటు అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో ఈ పనుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైనట్టు మంత్రి చిదంబరం చెప్పారు. ఈ గుర్తింపు కార్డు అనేది ఒక స్మార్ట్ కార్డులా ఉంటుందని మైక్రో ప్రాసెసర్ చిప్‌ను కలిగి వుంటుందన్నారు.
ఈ సురక్షిత కార్డును కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టెక్నికల్ కమిటీ సిఫార్సు చేసిందన్నారు. ఈ కమిటీని నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్, ఐఐటీ కాన్పూర్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఇండియన్ టెలిఫోనిక్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఇంటెలిజెన్స్ బ్యూరో తదితర సంస్థలకు చెందిన ప్రతినిధులతో ఏర్పాటు చేసినట్టు మంత్రి చిదంబరం వివరించారు
Read more...

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)