విజయనగర సామ్రాజ్యాధీశుడు,సాహితీ సమరాంగణ చక్రవర్తిగా పేరుపొందిన శ్రీకృష్ణ దేవరాయుల రూపం ఎలా ఉంటుంది.. ఆయన కురూపి అని కొందరు.. కాదు సుందర స్వరూపుడని మరికొందరు అంటారు. ఇక తిరుమలలో తన భార్యలతో ఉన్న రాయల విగ్రహ రూపం కూడా కాస్త భిన్నంగానే ఉంటుంది. తెలుగుభాషకు, తెలుగునేలకు ఎంతోసేవ చేసిన ఆ మహనీయుడి చిత్రపటం ఎలా ఉంటుందన్న సందేహానికి కొన్నాళ్ల క్రితం వెలుగులోకి వచ్చిన ఓ చిత్ర పటం పరిష్కారంగా కనిపిస్తోంది.
ఈ చిత్రాన్ని పోర్చుగీసు యాత్రీకుడు,చిత్రకారుడు డామింగో పేస్ 1520 సంవత్సరంలో గీసినట్లు తెలుస్తోంది. రాయలను చిత్రించడానికి పేస్ కు 15 వారాల సమయం పట్టిందట! పూనే నగరం లోని భారతీయ ఇతిహాస్ సంశోదన్ మండల్ లో ఉన్న ఈ చిత్రాన్ని హైదరాబాదుకు చెందిన ప్రముఖ చారిత్రక పరిశోధకుడు డాక్టర్ క్రిష్ణారావు కేశవ్ ఫోటో తీసి వెలుగులోకి తెచ్చారు. విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన 26 మంది రాజుల్లో 1509 నుండి 1529 వరకు ఓటమి ఎరుగని చక్రవర్తిగా పాలన సాగించిన రాయలు తన 49 వ ఏట కడుపుశూల వ్యాధికి గురై మరణించారని చరిత్ర చెబుతోంది.
(తెలుగు సొసైటీ వారి సౌజన్యంతో)
Read more...