తెలంగాణపై కేంద్ర కేబినెట్ నోట్ తయారైన నేపథ్యంలో రాష్ట్రంలో హైఅలర్ట్ ప్రకటించారు. కేబినెట్ నోట్ కు ముందే అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పోలీసులకు అందించింది హోంశాఖ. దీంతో అన్ని జిల్లాల ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు కొత్త డీజీపీ ప్రసాదరావు. ముఖ్యంగా సీమాంధ్ర ప్రాంతాల్లో భారీగా ఆందోళనలు, నిరసనలు జరిగే అవకాశం ఉండడంతో జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ లాఠీఛార్జీలకు దిగవద్దని, పూర్తి సంయమనం పాటిస్తూ, ఆందోళనలు నియంత్రించాలని సూచించారు. అరవై రోజులకు పైగా సీమాంధ్రలో ఆందోళనలు నిర్వహిస్తున్న ఏపీఎన్జీవోలు, ఆర్టీసీ,ప్రభుత్వ ఉద్యోగులంతా రేపటినుంచి తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారు.
Read more...
dgp లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
dgp లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
3, అక్టోబర్ 2013, గురువారం
రాష్ట్రంలో హై అలర్ట్
Categories :
cabinet note . dgp . high alert . news . police security . t note . telangana . TOP
14, సెప్టెంబర్ 2013, శనివారం
డీజీపీపై స్టోరీకి మీడియాపై కేసులు
Categories :
cases . dgp . journalist protest . news . TOP . zee 24 gantalu
డీజీపీ కొందరు మత పెద్దలను కలవడంపై స్టోరీ ప్రసారం చేసినందుకు, జీ24 గంటలు సిబ్బందిని ముప్పుతిప్పలు పెడుతున్నారు పోలీసులు. విచారణ పేరుతో స్టేషన్ల చుట్టూ తిప్పిస్తున్నారు. కథనం ప్రసారం అయిన వెంటనే జీ 24 కార్యాలయంలోకి నోటీసుల్లేకుండా వెళ్లి, భారీగా తనిఖీలు చేసిన పోలీసులు, ఇప్పుడు ఛానల్ సిబ్బందిని సీసీఎస్ పోలీస్ స్టేషన్ కు పిలుపించుకున్నారు. దీనిపై జీ 24గంటలు సిబ్బంది, క్రైమ్ రిపోర్టర్స్ ప్రతినిధులు పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మను కలిసి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సీపీ ఛాంబర్ లో నేలపై బైఠాయించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారాయన. అటు, స్టేట్ మెంట్ రికార్డ్ చేయాలంటూ జీ 24గంటలు కీలక సిబ్బందిని సీసీఎస్ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు పోలీసులు.
Read more...
15, నవంబర్ 2011, మంగళవారం
డీజీపీ ఆస్తులపై హైకోర్ట్ విచారణ
రాష్ట్రంలోని సీనియర్ ఐపీఎస్ అధికారుల మధ్య కొనసాగుతున్న వివాదం మరో మలుపు తిరగనుంది. రాష్ట్ర డీజీపీ దినేశ్ కుమార్, భారీగా అక్రమాస్తులు కూడా బెట్టారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్ట్ విచారణ జరపనుంది. విజిలెన్స్, ఎన్‌ఫోర్స్ మెంట్ విభాగంలో పనిచేసినప్పుడు దినేశ్‌కుమార్ అనేక అక్రమాలకు పాల్పడ్డారంటూ, సీనియర్ ఐపీఎస్ అధికారి ఉమేశ్‌కుమార్ ఈ పిటిషన్‌ను హైకోర్ట్‌లో దాఖలు చేశారు. ఆయన భార్య కమలారెడ్డి పేరిట భారీగా ఆస్తులున్నాయంటూ ఉమేశ్‌కుమార్ ఆరోపిస్తున్నారు. దీనిపై సమగ్రమైన విచారణ జరపాలని కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై స్పందించిన హైకోర్ట్.. కేసును విచారణకు స్వీకరించింది. డీజీపీ ఆస్తులకు సంబంధించిన వివరాలను అందివాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
కోర్టు ఆదేశాల ప్రకారం, ఇవాళ డీజీపీ.. తన పేరిట, తన కుటుంబ సభ్యుల పేరిట ఉన్న ఆస్తులను వెల్లడించాల్సి ఉంది. విజిలెన్స్, ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టర్ జనరల్‌గా ఉన్న సమయంలో.. తనపేరిట, తన భార్య పేరిట ఎలాంటి ఆస్తులు లేవని ప్రభుత్వానికి అధికారికంగా తెలియజేసినట్లు సమాచారం. అయితే, డీజీపీ భార్య కమలారెడ్డి భార్య పేరిట జరిగినట్లుగా భావిస్తున్న కొన్ని వివరాలను ఉమేశ్‌కుమార్ కోర్టుకు సమర్పించారు. ఈ నేపథ్యంలో డీజీపీ ఏ వివరాలను కోర్టుముందు ఉంచుతారన్నది ఆసక్తికరంగా మారింది.
Read more...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)

