2, జనవరి 2012, సోమవారం
సబ్బులో టెర్రరిస్టుల ఎస్కేప్ స్కెచ్
Categories :
escape plan . jail . news . terrorist . TOP . vikaruudin
అత్యంత ప్రమాదకర ఐఎస్‌ఐ ఉగ్రవాది వికారుద్దీన్ వరంగల్ జైలు నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఉన్నట్లు జైలు అధికారులకు ఆధారాలు దొరికాయి. వరంగల్ సెంట్రల్ జైలు లో ఉంటున్న ఐఎస్‌ఐ ఉగ్రవాది వికారుద్దీన్, సులేమాన్, ఖాజాలు.. చాలా రోజులుగా అధికారులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. కోర్టు విచారణల కోసం.. నాంపల్లికి తరచూ రావాల్సి ఉండడంతో.. మార్గమధ్యలోనే తప్పించుకోవడానికి వారు వ్యూహరచన చేశారు.
డిసెంబరు నెలలో నాంపల్లి కోర్టులో హాజరుపరిచి.. తిరిగి తీసుకువెళుతుండగా.. వికారుద్దీన్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు.. బిర్యానీ ఇప్పించాల్సిందేనంటూ.. గొడవకు దిగాడు. ఈ టెర్రరిస్టును కంట్రోల్ చేయడానికి జనగాంలో అదనపు పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. కావాలనే, వికార్.. ఈ గొడవ సృష్టించినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీన్ని రుజువు చేస్తూ.. వరంగల్ జైలులో దొరికిన ఓ పేపర్ ముక్క.. ఉగ్రవాదుల ప్లాన్‌ను బయటపెట్టింది. రెండు రోజుల కిందట బ్యారెక్‌లో ఉన్న ఖైదీ సులేమాన్ ఓ సబ్బు ముక్కను మరో ఐఎస్‌ఐ నిందితుడు ఖాజాకు ఇవ్వాలని జైలు సిబ్బందిని కోరారు. అనుమానంతో, ఆ సబ్బును ముక్కలు చేసి చూడగా.. అందులో ఉర్దూలో రాసి ఉన్న ఓ పేపర్ కనిపించింది. దీంతో ఆ పేపర్‌ను జైలు అధికారులకు వార్డర్ అందించాడు. అందులో, ఏ ఏ కేసులు ఎప్పుడెప్పుడు కోర్టులో విచారణకు వస్తాయో తెలపాలని ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.
అయితే.. ఈ లెటర్‌లో జైలు నుంచి తప్పించుకోవడానికి కోడ్ వర్డ్స్‌తో వేసిన ఓ స్కెచ్ ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని బయటపెట్టిన సిబ్బందిని చంపేస్తానని సులేమాన్ బెదిరిస్తుండడంతో జైలు సిబ్బంది భయాందోళనలో ఉన్నారు. ఐఎస్‌ఐ ఖైదీల ప్లాన్ బయటపడడంతో, వారిని హైసెక్యూరిటీ జోన్‌లో పెట్టారు. తదుపరి కోర్టు విచారణలకు వీరిని తరలించడంపై ఉన్నతాధికారులతో సమీక్షిస్తున్నారు. జైలు భద్రతను కూడా కట్టుదిట్టం చేశారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి