7, సెప్టెంబర్ 2011, బుధవారం
వాడింది ఆర్డీఎక్స్ కాదు.. పీఈటీఎన్
టెర్రరిస్టుల బాంబు పేలుడు అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఆర్డీఎక్స్. ఆ తర్వాత అమ్మోనియం నైట్రేట్. కానీ, ఈ సారి ఢిల్లీ పేలుడులో మరో ఎక్స్ ప్లోజివ్ ను తీవ్రవాదులు వాడారు. అదే పెంటాఎరిథ్రిటోల్ టెట్రానైట్రేట్.. PETN లేదా PENT గా పిలిచే ఇది అత్యంత తీవ్రత గల పేలడు పదార్థం. ప్లాస్టిక్ పౌడర్ తరహాలో ఉండే రసాయనం. షాక్ ఇవ్వడం ద్వారా దీన్ని పేల్చుతారు. ఢిల్లీ పేలుడులో టైమర్ ను వాడి బాంబును పేల్చారు. 2001 నుంచి అల్ ఖైదా పలు సందర్భాల్లో దీన్ని తీవ్రవాద దాడులకు ఉపయోగిస్తోంది. ఇప్పుడు దాడిలోనూ దీన్నే వాడడం చూస్తుంటే, అల్ ఖైదా శక్తుల ప్రమేయమే ఈ దాడి వెనుక ఎక్కువగా ఉండొచ్చు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి