7, సెప్టెంబర్ 2011, బుధవారం
ఇది మనవాళ్లకే చెల్లు..!
ఎవరు మారినా మారకపోయినా, కేంద్రంలో అధికారంలో పార్టీలు మారినా ప్రభుత్వాధినేతలు మాత్రం మారరు అనడానికి మనవాళ్లే నిదర్శనం. అందుకే, టెర్రరిస్ట్ దాడి జరిగిన తర్వాత ఒకే తరహా మాటలను చెబుతుంటారు. అందులో ఓ తొమ్మిది ప్రకటనలు మీ కోసం..
1. ఈ దాడిని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం..
2. ఇది కుట్రపూరితమైన చర్య
3. ఉగ్రవాదానికి మేం మోకరిల్లం... ఎదుర్కొంటాం
4. ఇది ప్రణాళికాబద్ధంగా జరిగిన దాడి
5.రాష్ట్ర ప్రభుత్వాలను దాడులపై ముందే హెచ్చరించాం
6. ప్రాణాలు పోగొట్టుకొన్నవారికి ఇన్ని లక్షల పరిహారం ఇస్తున్నాం
7. పేలుళ్లకు సంబంధించి ఇంకా ఆధారాలు దొరకలేదు
8. ఉగ్రవాదాన్ని మనం ఒంటరిగా ఎదుర్కోలేం
9. దాడి చేసిన వాళ్లు ఎంతటివాళ్లైనా శిక్షిస్తాం..
ఇవీ మనవాళ్ల రొటీన్ ప్రకటనలు.. తేదీలు మారుతున్నాయి.. మళ్లీ మళ్లీ దాడులు జరుగుతూనే ఉన్నాయి. వందలాది మంది ప్రాణాలు పోగొట్టుకుంటూనే ఉన్నారు. కానీ.. మన నేతలు మాత్రం మారరు. ఎవడో దాడి చేసే వాడిని వెతుకూనే ఉంటామంటారు. ఒకవేళ ఎవడైనా పొరపాటున దొరికితే, వాడికే జీవితం మీద విసుగొచ్చే వరకూ విచారణ జరుగుతూనే ఉంటుంది. ఆఫ్జల్ గురు, కసబ్ లాంటి వాళ్ల కోసం ప్రత్యేక జైలు, వసతులు.. కోట్లల్లో ఖర్చు.. చివరకు ఏ విమానమో హైజాక్ చేసి వాళ్లను విడిపించి వెళ్లే వరకూ మన ప్రజాధనంలో ఆ నరహంతకులను కాపాడుతూనే ఉంటాం.. అదీ మన గొప్పదనం.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి