9, ఫిబ్రవరి 2012, గురువారం
రూ.5 వేలలోపు దొరికే అద్భుతమైన మొబైల్స్
Categories :
mobile . technology . TOP
ఇది మొబైల్ యుగం. లేటెస్ట్ మొబైల్ చేతిలో లేకపోతే వెనకపడినట్లే లెక్క. ఇన్ స్టంట్ మెసేజ్, ఫేస్ బుక్, ఇంటర్నెట్, మల్టీ పిక్సెల్ కెమెరా.. ఇలా అన్నీ సెల్ ఫోన్లో ఉండాల్సిందే. కానీ అన్ని ఫీచర్లూ కావాలంటే పదివేలకు పైనే చెల్లించాల్సిఉంటుంది. ఇది అందరికీ సాధ్యం కాదు. కానీ, రూ.5 వేలలోపే అద్భుతమైన ఫీచర్లున్న ఫోన్లు అందుబాటులో ఉంటే.. ఆశ్యర్యమే కదూ.. అలాంటి ఐదు ఫోన్లు మీ కోసం..
ఈ లిస్టులో అన్నింటికన్నా ముందున్నది Nokia C2-03 Touch and Type ఫోన్. దీని కాస్ట్ కేవలం 4,425 రూపాయలు మాత్రమే. ఈ టచ్ అండ్ టైప్ స్లైడర్ డివైజ్‌తో వావ్ అనిపిస్తోంది. 2.6 ఇంచస్ డిస్‌ప్లేతో ఇందులో డ్యూయల్ సిమ్, 2 మెగా పిక్సల్ కెమెరా, 32 జిబి మైక్రో ఎస్‌డి కార్డ్ ఫెసిలిటీ ఉంది. బ్యాటరీ బ్యాకప్ మినిమమ్ 2 డేస్ వరకు ఉంటుంది. దీనికున్న మరో విశిష్టత.. రెండో సిమ్ కార్డును పెట్టడానికి, తీయడానికి మొబైల్ ను స్విచ్ఛాఫ్ చేయాల్సిన అవసరం లేదు. సైడ్ న ఉన్న స్లాట్లో నేరుగా పెట్టుకోవచ్చు.
రెండో ఫోన్ మోటరోలా క్వార్ట్జ్ EX212. దీని కాస్ట్ కేవలం 4,599 రూపాయలు మాత్రమే. ఇందులో కూడా డ్యూయల్ సిమ్ ఫెసిలిటీ ఉంది. 2మెగా పిక్సల్ కెమెరాతో పాటు విత్ వీడియో రికార్డింగ్ ఫెసిలిటీ ఉంది. ఎఫ్‌ఎమ్, మ్యూజిక్ ప్లేయర్‌తో పాటు బెస్ట్ లుక్కింగ్ హ్యాండ్ సెట్ అవడంతో కస్టమర్స్ దీనిపై మనసుపారేసుకుంటున్నారు. గతంలో మోటరోలా రిలీజ్ చేసిన రేజర్ మోడల్లోనే కనిపించే ఈ ఫోన్ ధర విషయంలో మాత్రం అందరికీ అందుబాటులో ఉంది.
లో కాస్ట్ మొబైల్స్ తయారీపై దృష్టి పెట్టిన నోకియా.. ఆశ పేరుతో ఓ కొత్త సిరీస్ ను తీసుకొస్తోంది. అందులో మొదటిది Nokia Asha 200. దీని ధర కేవలం 4వేల 370. 2.4 అంగుళాల డిస్‌ప్లే స్క్రీన్, వెల్ స్పేస్డ్ కీపాడ్, 2మెగా పిక్సల్ కెమెరా, 1430 mAh battery కెపాసిటీ ఉండటంతో ఒక్కసారి రీచార్జ్ చేస్తే మినిమమ్ 3 డేస్ వరకు ఉంటుంది. 32 GB micro SD cardతో చూడగానే అందరినీ ఆకర్షిస్తోంది.
ఇక మా ఎంపికలో నాలుగో ఫోన్.. Samsung Chat C3222, క్వర్టీ కీ ప్యాడ్, 2.2 అంగుళాల స్క్రీన్, 1.3 మెగాపిక్సెల్ కెమెరా దీని ప్రత్యేకత. ఒక్కసారి రీఛార్జ్ చేస్తే, 12 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. ఇందులో ఉన్న మ్యూజిక్ ప్లేయర్ త్రీడీ సౌండ్ సిస్టంను అందిస్తుంది. దీని ధర రూ.3850.
టాప్ -5 లిస్టులో చివరిది Karbonn K1616 Magic. దీని ధర రూ.4829. అతిపెద్ద డిస్ ప్లే స్క్రీన్ దీని ప్రత్యేకత. మెటాలిక్ బ్యాటరీ కవర్, హై సెన్సిటివీ టచ్ స్క్రీన్తో ఇది తయారయ్యింది. అంతేకాదు.. SMS, నోట్స్ ను కట్, కాపీ, పేస్ట్ చేసుకునే సౌలభ్యాన్ని అందించే ఫోన్ కూడా ఇదే.
మరి వీటిలో మీ ఛాయిస్ ఏదో సెలెక్ట్ చేసుకోండి. తక్కువ ధరలోనే అన్ని ఫీచర్లనూ పొందండి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి