3, మార్చి 2011, గురువారం
దమ్ముంటే సమాంతర ప్రభుత్వం ఏర్పాటు చేయండి..
Categories :
తెలంగాణ కాంగ్రెస్ నేతలకు కావూరి ఝలక్ ఇచ్చారు. ఒక్కక్షణం కూడా పదవులు వదిలి ఉండలేరంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ విషయంలో కేంద్ర ప్రభుత్వం నాన్చుతున్నా, తెలంగాణ కాంగ్రెస్ నేతలు సైలెంట్‌గా ఉండడానికి కారణం పదవులేనని తేల్చి చెప్పేశారు. కావూరి దెబ్బకు.. తెలంగాణ కాంగ్రెస్ నేతల నుంచి రియాక్షన్ మొదలయ్యింది. అసలు కాంగ్రెస్ నేతలు ఇప్పుడేం చేయాలి..?
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను టిఆర్‌ఎస్, తెలుగుదేశం తెలంగాణ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ తెలంగాణ ఎమ్మెల్యేలు బహిష్కరించారు. సమావేశాలకు హాజరుకాబోమని తేల్చి చెప్పేశారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలంటే, ఇప్పుడు వీరంతా కలిసికట్టుగా సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే మార్గం. ఎలాగూ శాసనసభను బహిష్కరించారు కాబట్టి.. అంతా కలిసికట్టుగా మరోచోట అసెంబ్లీ కార్యకలాపాలను నిర్వహించాలి. పార్టీ విభేదాలను వదిలిపెట్టి తెలంగాణ ఎమ్మెల్యేల నుంచి ఒకరిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలి. రాజ్యాంగపరమైన అధికారం వీరికి లేకపోయినా, సమాంతరంగా అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలి. ఇప్పటికే ఉద్యోగులు విధుల బహిష్కరించి తీవ్ర స్థాయిలో ఉద్యమం చేస్తున్నారు. విద్యార్థుల అండ ఎలాగూ ఉంది. సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. కేంద్రంలో కదలిక రావడం ఖాయం. మరి తెలంగాణ ప్రజాప్రతినిధులు అందుకు సిద్ధంగా ఉన్నారా..?
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి