1, మార్చి 2010, సోమవారం
భార్యాదానం
వాస్తవగాథలు వెండితెరకెక్కి.. సినిమాలుగా మారితే.. కొన్ని సినిమా కథలే.. అప్పుడప్పుడు వాస్తవాలుగా మారుతుంటాయి. ఇప్పుడు మీరు చదవబోయేది.. సినిమాలను మించి పోయే స్టోరీ. వాస్తవంలో జరగదనుకునే స్టోరీ. ఓ రాధాకళ్యాణం, ఓ హమ్ దిల్‌చుకే సనమ్.. మరో కన్యాదానం... ఈ సినిమాలన్నింటినీ తలపించేలా జరిగిన భార్యాదానం. అనంతపురంలో.. మంచి మనసుతో ఓ భర్త చేసిన గొప్పకార్యం. (ఘనకార్యం అందామనుకున్నా కానీ.. ఘనకార్యానికి ఇప్పుడు అర్థం మారిపోయింది. పూర్తిగా నెగిటివ్ సెన్స్‌లో వాడుతున్నారు)
పెళ్లంటే నూరేళ్లపంట. అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన ఉపేంద్ర కూడా అంతే అనుకున్నాడు. అక్కకూతురు పార్వతిపై మనసుపడి.. మనువాడాడు. తన కుటుంబంతో హాయిగా ఆనందగా జీవిద్దామనుకున్నాడు. కానీ.. అక్కడే అసలు ట్విస్ట్ మొదలయ్యింది. అతని జీవితాన్ని సమూలంగా మార్చేసింది. ఉపేంద్ర పెళ్లి చేసుకున్న పార్వతి మరో వ్యక్తిని ఇష్టపడింది. పెళ్లికి ముందే తన వీధిలో ఉండే శివకేశవ్‌ను ప్రేమించింది. వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకుందామనుకున్నారు. కానీ.. పెద్దలకు చెప్పే ధైర్యం లేకపోయింది. కుటుంబసభ్యుల నిర్ణయం మేరకు.. మేనమామ ఉపేంద్రను 2006లో పెళ్లి చేసుకుంది. మనసులో మరొకరు ఉండడంతో... అతనికి భార్యగా ఉండలేకపోయింది. అన్యమనస్కంగానే కాపురం చేసింది. అటు శివకేశవ్ పరిస్థితి కూడా అంతే. ప్రేయసిని మర్చిపోలేక ఆమెకు దగ్గరయ్యే ప్రయత్నం చేశాడు. ఇద్దరిమధ్య దూరాన్ని సెల్‌ఫోన్ దూరం చేసింది. ఉపేంద్రకు, శివకేశవ్‌కు స్నేహం కుదరడంతో.. వీరిద్దరి మధ్యా సాన్నిహిత్యం మరింత పెరిగింది. నీవు లేకపోతే నేను బతకలేనంటూ శివకేశవ్ చెప్పేసరికి అతనితో వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది. ఈలోగా.. దాంపత్యఫలంగా.. పార్వతి ఓ పాపకు జన్మనిచ్చింది. అయినా.. ఆమె నిర్ణయంలో మాత్రం మార్పురాలేదు. భార్య ప్రవర్తనను ఎప్పటినుంచో గమనిస్తున్న ఉపేంద్ర ఆమెను సున్నితంగా అడిగాడు. అప్పుడు తన అంతరంగాన్ని బయటపెట్టింది పార్వతి. శివకేశవ్‌ను పెళ్లి చేసుకుంటానని చెప్పింది. భార్య చెప్పిన సమాధానంతో ఉపేంద్రలో కలవరం. ఎంతో ఆలోచించి.. ఓ నిర్ణయం తీసుకున్నాడు. పెద్దలందరినీ ఒప్పించి.. తానే పెళ్లి పెద్దగా మారాడు.. పార్వతికి, శివకేశవ్‌కు పెళ్లి చేశాడు.
కొత్త సంస్కృతి
భార్య మరొకరిని ప్రేమించిందని తెలిస్తే.. ఏ భర్తైనా తట్టుకోగలడా.. భార్యను హింసించడమో.. లేదంటే.. ఆమె ప్రియుడిని చావబాదడమో చేస్తాడు. కానీ.. ఉపేంద్ర మాత్రం అలా చేయలేదు. పైగా తానే పెళ్లిపెద్దయ్యాడు. భార్య కోరికను తీర్చాడు.. ఓ సరికొత్త సంస్కృతికి బీజం వేశాడు. పార్వతి, శివకేశవ్‌ల ప్రేమ వ్యవహారం తెలియగానే.. ఉపేంద్ర కోపంతో ఊగిపోలేదు. ఎంతో ప్రశాంతంగా ఆలోచించాడు. భార్య పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. కోరుకున్నవాడికి చేరువకాలేక.. తనతో కాపురం చేయలేక ఆమె పడుతున్న మనోవేదనను తెలుసుకున్నాడు. కానీ.. తన భార్యను మరొకరికిచ్చి పెళ్లి చేస్తే.. సమాజం ఏమంటుందో అని ఆందోళనా చెందాడు. స్నేహితులకు చెబితే.. కొందరు శభాష్ అంటూ వెన్నుతట్టారు. మరికొందరు.. ఇది తగదంటూ హెచ్చరించారు. అయినా.. పార్వతి మనసు తెలిసిన ఉపేంద్ర.. ఆమెను శివకేశవ్‌కు ఇచ్చి పెళ్లిచేయాలనే నిర్ణయించుకున్నాడు. మనసు చంపుకుని తనతో కాపురం చేసే కన్నా.. మనసిచ్చిన వ్యక్తి దగ్గరకే భార్యను పంపాలనుకున్నాడు. ఇంట్లోనూ వ్యతిరేకత వ్యక్తమైనా.. ఉపేంద్ర నిర్ణయానికి అందరూ అంగీకరించారు. పార్వతి, శివకేశవ్‌లు ఒక్కటయ్యారు.
ఉపేంద్ర నిర్ణయం విన్న తర్వాత.. అంతా ఆశ్చర్యపోయారు. ఉపేంద్రకు తెలిస్తే.. ఏమవుతుందో అని అప్పటిదాకా కలవరపడ్డ శివకేశవ్ అయితే షాక్‌కు గురయ్యాడనే చెప్పాలి. అయితే.. ఇక్కడే మరోసమస్యా వచ్చింది. పార్వతి పాప పుట్టి నాలుగు నెలలు మాత్రమే అయ్యింది. ఆ పసికందును వదిలేది లేదని ఆమె స్పష్టంగా చెప్పింది. పార్వతితో పాటు.. ఆ బిడ్డనూ తానే సాకుతానని మాటిచ్చాడు శివకేశవ్. ఉపేంద్ర చేసిన త్యాగం ముందు తాను చేయబోయేది చిన్నదే అంటున్నాడు.
ఇక ఈ మొత్తం వ్యవహారంలో కీలకమైన పార్వతి కూడా ఆనందంగా ఉంది. ఉపేంద్రతో మనస్పూర్తిగా కలిసి ఉండలేక.. నిజం చెప్పానంటోంది. ఎంతగానో ప్రేమించిన శివకేశవ్‌తో పెళ్లిజరగడం.. ఆమెకు కలలా ఉంది. ఉపేంద్ర అర్థం చేసుకోవడంతో.. శివకేశవ్, పార్వతిలు దంపతులయ్యారు. కొత్త జీవితం మొదలుపెట్టారు. వాళ్లిద్దరూ సంతోషంగా ఉంటే.. తనకూ ఆనందమేనంటున్నాడు ఉపేంద్ర.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
paapam sivakesav
ఆదే పని అడది చేయగలదా...
@ పవన్
ఆమెను అతడు వదిలిన్చుకున్నట్టున్నాడు. మగవాల్లెప్పుడు ఆడవాళ్ళని కష్ట పెట్టరు గనుక ఆ పని ఆడవాళ్ళు చెయ్యలేరు.
pavan and kamal, you both are very funny :P
మంచి కథనం అందించారు. సంతోషం.
కధ ముగింపు:
ఉపేంద్ర: "నో నాగమణి, ఎంజాయ్!"
valla iddari laga andaru okarini okaru artam chesukuni nadusukunte mana india lo ladies atmaatyalu undavu............great sivakeshav