12, జనవరి 2010, మంగళవారం
యార్లగడ్డ వస్త్రాపహరణం
Categories :
ద్రౌపది . యార్లగడ్డ . droupadi . yarlagadda
మహాభారతం లోని ద్రౌపదికి కొత్త మరకలు అంటుకున్నాయి. కౌరవులు నిండు సభలో ఆమెకు వస్త్రాపహరణం చేస్తే.. ప్రముఖ రచయత, సాహితీవేత్త యార్లగడ్డ లక్ష్మీప్రసాద్.. ఆమె వ్యక్తిత్వాపహరణం చేశారు. భారతీయ పతివ్రతల్లో ఒకరిగా కీర్తిని సంపాదించుకున్న ద్రౌపదిని ఓ కాముకి చిత్రకీరించిన ఆయనకు.. సాహిత్య అకాడమీ అవార్డు దక్కడం.. వివాదాన్ని సృష్టిస్తోంది. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తెలుగు రచయతలు, కవులు.. సాహితీవేత్తలు.. ఈ అవార్డు ఇవ్వడంపై విరుచుకుపడుతున్నారు..
ద్రౌపది.. భారత పురాణ ఇతిహాసం మహాభారతంలో కీలక పాత్ర. భారతంలో కీలక ఘట్టాలన్నీ ఆమె చుట్టూనే తిరుగుతాయి. కౌరవ,పాండవుల మధ్య కురుక్షేత్ర మహాసంగ్రామం జరగడానికి ఈ రకంగా ద్రౌపదే కారణం. వ్యక్తిత్వం విషయంలోనూ ద్రౌపది పాత్రను ఎంతో జాగ్రత్తగా మలిచారు.. వ్యాస మహర్షి. ఐదుగురిని భర్తలుగా పొందినా.. ఎక్కడా అసభ్యతకు తావు లేకుండా... మహాభారత రచన సాగుతుంది. పాండవులతో సమానంగా ద్రౌపది పాత్రస్థాయి ఉంటుంది. మహా పతివ్రతల్లో ఒకరిగా ద్రౌపదిని కీర్తించడానికీ ఇదే కారణం. ఇలా భారత చరిత్రలో స్థానం సంపాదించుకున్న ద్రౌపదిని వంకరకోణంలో చూశారు.. ప్రముఖ రచయత యార్లగడ్ల లక్ష్మీ ప్రసాద్. అనేక సందర్భాల్లో ద్రౌపది అంతరంగం ఎలా ఉంటుందన్న ఆలోచించిన ఆయన దానికి వక్రభాష్యం చెప్పారు. ద్రౌపది మనస్సును.. ఆమె ఆలోచనలను తెలుసుకోవడానికి ప్రస్తుతం మార్గాలేవీ లేవు. అందుకు సాక్ష్యాలూ.. ఆధారాలూ లేవు. మహాభారత కాలంలోకి వెళితే తప్ప.. ద్రౌపది ఏ సమయంలో ఎలా ఆలోచించిందన్నది చెప్పటం అసాధ్యం. మరి యార్లగడ్డ ఆకాలంలోకి ఎప్పుడు వెళ్లారో.. ఎలా వెళ్లారో తెలియదు కానీ... ద్రౌపది వ్యవహారం మొత్తం తనకే తెలిసినట్లు ఓ పెద్ద నవల ఎడాపెడా రాసి పాడేశారు. యార్లగడ్డ రాసిన విషయాలు బహుశా.. వ్యాసమహర్షికి కూడా తెలియకపోవచ్చు. ద్రౌపదిని ఓ పతితగా.. కామవాంఛ ఎక్కువగా ఉన్న స్త్రీగా ఈ నవలలో చూపించారు యార్లగడ్డ. ఆయనలోని భావుకత పొంగిపొర్లి.. ఓ సెక్స్‌బుక్ తరహాలో ఈ పుస్తకాన్ని రచించారు. ఎక్కడికక్కడ బూతుపదాలు.. మాట్లాడుకోవడానికే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పదాలు.. చివరకు చదవాలంటే కూడా సిగ్గుపడే పదాలను ఈ నవలలో విరివిగా వాడేశారు యార్లగడ్డ. ఇంత అసభ్యంగా రాసిన ఈ పుస్తకానికి సాహిత్య అకాడమీ అవార్డు లభించడం కొసమెరుపు. మహాభారతాన్ని.. అందులోని ద్రౌపది పాత్రను పూర్తిగా వక్రీకరించిన ఈ పుస్తకం.. ఇప్పుడు భారతీయ భాషలన్నింటిలోకి అనువదించడానికి ఈ అవార్డుతో మార్గం సుగమమైనట్లే. అంటే.. మన బూతుసాహిత్యాన్ని దేశం మొత్తం చదివేలా చేయడంతో పాటు.. ద్రౌపది పాత్రపై వింత ఆలోచనలు కలిగేలా చేయనుంది.. యార్లగడ్డ రచించిన పుస్తకం.
ఉత్తమ పురుషులకూ
మహాభారతంలో అన్ని కీలక పాత్రలు యార్లగడ్డ చేతిలో నలిగిపోయాయి. భీష్మ,ద్రోణుల దగ్గర నుంచి మొదలుపెడితే.. శ్రీకృష్ణుడి వరకూ అంతా ద్రౌపది కామభావంతోనే చూశారన్న వాదనను ఈ నవలలో ఆయన వినిపించారు. శ్రీకృష్ణుడి గురించి ద్రౌపది పదేపదే ఆలోచించుకునేదన్నట్లు... తనను ప్రేమిస్తున్నాడా అని ప్రశ్నించుకున్నట్లు చాలాసార్లు ఈ పుస్తకంలో ప్రస్తావనకు వస్తుంది. చివరకు అర్జునుడికి సుభద్రను ఇచ్చి శ్రీకృష్ణుడు పెళ్లి చేయడానికి కారణాన్ని కూడా తనదైన పద్దతిలో విశ్లేషించారు. అన్నాచెల్లెళ్లుగా శ్రీకృష్ణుడు- ద్రౌపదిలను వ్యాసమహర్షి చూపిస్తే.... యార్లగడ్డ దాన్ని ప్రణయంగా మార్చేశారు.. మహిళల విషయంలో ఎంతో నిబద్దతతో.. తండ్రికిచ్చిన మాటకు కట్టుబడిన కురువృద్దుడు భీష్ముడు కూడా.. యార్లగడ్డ కలం బారిన పడ్డారు. వస్త్రాపహరణం సందర్భంలో.. ద్రౌపది సౌందర్యాన్నిచూడడానికి భీష్మద్రోణాదులందరూ ఉవ్విళ్లూరుతున్నారంటూ.. ఓ పాత్ర ద్వారా చెప్పించడం.. ఆయనకే చెల్లింది. ఈ వర్ణననే రచయతలు, కవులు తీవ్రంగా ఆక్షేపిస్తోంది.
రచయతకు స్వేచ్ఛ ఎంత?
ఓ నవలను ఎవరైనా.. ఎలాగైనా రాసుకోవచ్చు. కథలోని కీలక పాత్రను తనకు కావల్సినట్లుగా మలుచుకోవచ్చు. అయితే.. అది తాను సృష్టించిన పాత్రే అయితే ఎలాంటి సమస్యా ఉండదు. కానీ.. యార్లగడ్డ.. తన నవల కోసం ఎన్నుకున్న పాత్ర సామాన్యమైన పాత్ర కాదు.. భారతీయుల మనోభావాలతో ముడిపడి ఉన్న ద్రౌపదిది. ఈ పాత్రను అత్యంత జుగుప్సాకరంగా చిత్రీకరించడమే వివాదానికి కారణం. బూతు పదాలతో నింపేసి.. ఇతిహాస పాత్రను పరిహాసం చేయడంపైనే వివాదమంతా. కొన్నేళ్లక్రితం ఓ పత్రికలో ప్రచురితమైనప్పుడూ పెద్దఎత్తునే గందరగోళం చెలరేగింది. అయినా... ఆ తర్వాత పుస్తకరూపంలో ద్రౌపది వెలువడింది. తెలుగుసాహిత్యంలో మరే మంచి పుస్తకమూ లేదన్నట్లు.. ఏరికోరి ఈ బూతుపురాణానికే అత్యున్నత పురస్కారమైన సాహిత్య అకడామీఅవార్డు దక్కడం ఆగ్నికి ఆజ్యం పోసినట్లయ్యింది.యార్లగడ్డకు అవార్డు కేటాయించడం సరికాదంటూ.. కొంతమంది మానవహక్కుల కమిషన్ కూడా ఆశ్రయించారు. దీనిపై విచారించిన సంఘం.. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకూ అవార్డు ఇవ్వవద్దంటూ.. కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.
అవార్డుకు అర్థం ఏమిటి?
సాహిత్యరంగానికి చేసిన విశిష్టసేవకు సాహిత్య అకాడమీ అవార్డు ఇవ్వాలి. మరి యార్లగడ్డ రాసిన ద్రౌపది.. ఏరకంగా సాహిత్యానికి మేలు చేసింది. బూతుపదాలు రాయడమేనా సాహిత్య సేవ. ఎంతోమంది మనోభావాలను గాయపరిస్తేనే... సాహిత్యరంగంలో విశేషకృషి చేసినట్లా.. ఇదేదో ప్రైవేటు అవార్డు అయితే.. ఎవరూ ఇంతగా అడ్డుచెప్పేవారు కాదు. కానీ.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డు. అందుకే.. ఈ విషయంలో మరోసారి పునరాలోచించాల్సి ఉంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
తన ఇ౦ట్లో అక్కాచెల్లెళ్ళను అదేదృష్టితో చూస్తాడేమో!
వాడికి కావల్సింది పబ్లిసిటి.. వచ్చింది కదా.. ఎలా అయితే ఎమిటి.. అలాంటివాడిని నడిరొడ్డులొ కుక్కని కొట్టినట్టు కొడితేనే గానీ బుద్దిరాదు వెధవలకి..
నేను మొన్న న్యూస్ లో గొడవ జరుగుతోంది అని విన్నాను దీని గురించే. ఈతడు బుద్ధిలేక రాస్తే అసలా నవలని సాహిత్య అకాడెమి కి ఎంపిక చేసిన ప్రబుద్దులేవరో.
ఇప్పుడే చదివాను. ఆ అవార్డు ని హోల్డ్ లో పెట్టారని.
అది కూడా ఒక మహిళా అడ్వోకేట్ కోర్టులో కేసు వెయ్యడం వల్ల. తెలుగు సాహిత్య లోకంలో మేధావులంతా ఏం చేస్తునారో ఇప్పటి దాకా ??
Dirty idiot.