ప్రత్యేక తెలంగాణ ఉద్యమం.. దాని వెంటే సమైక్యాంధ్ర ఉద్యమం.. మొత్తం మీద రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని ఒకరు.. వద్దని మరొకరు.. రాజకీయాలను రసవత్తరంగా మార్చేశారు. ప్రశాంతంగా ఉండే రాష్ట్రాన్ని రావణకాష్టంలా చేశారు. ఇక్కడ ఎవరినీ తప్పుపట్టడం లేదు. ఎవరి ప్రయత్నాలు వారివి. అయితే.. సందర్భం వచ్చింది కాబట్టి.. తెలుగు భాషమీద కూడా మంచి చర్చ జరుగుతోంది. అందులోనూ.. శనివారం, ఆదివారం ఆన్‌లైన్లో బ్లాగర్ల సమావేశం జరుగుతోంది కాబట్టి... ఆంధ్రజ్యోతిలో ఇదివరకే ప్రచురితమైన ఆర్టికల్‌ను ఇక్కడ పొందు పరుస్తున్నాను.. పూర్తిగా చదవండి..
తెలుగువేరు, ఆంధ్రం వేరు!
-కనకదుర్గ దంటు
...శంకరంబాడి సుందరాచారి అని బాపట్లకి చెందిన ఒక కవి ఈ తెలుగు తల్లిని సృష్టించాడు. అప్పటిదాకా ఎవరు రాసినా, ఎవరు మాట్లాడినా 'ఆంధ్ర' అన్న పదమే వాడేవారు. అయితే ఆంధ్ర అన్నది సంస్కృతానికి దగ్గరగా ఉండడంతో, లాలిత్యాన్ని తన పాటలో జొప్పించడానికి మొట్టమొదటి దోపిడీదారుగా ఆయన తెలంగాణకి సంబంధించిన 'తెలుగు' అన్న పదాన్ని దొంగిలించి తన పాటలో పెట్టుకున్నాడు.
ఈమధ్య తెలుగుతల్లి గురించిన వాదోపవాదాలు వాడిగా, వేడిగా సాగుతున్నాయి. తెలుగు అనేది వారి సొత్తయినట్టు, తెలుగుతల్లి అంటే వారొక్కరి తల్లి అయినట్టు ఆంధ్ర సోదరులు ఆవేశపడిపోతున్నారు. ఏదైనా ఒక విషయాన్ని అందరూ ఆమోదించినపుడు ఏ బాధలేదు. కానీ దాని గురించి భిన్నాభిప్రాయాలు వెలువడేటప్పుడు, కొద్దిగా చారిత్రక, సాంస్కృతిక నిజాలు తరచి చూడటం ఎంతైనా అవసరం. అందుకే ఈ 'తెలుగు' అన్నపదం ఎప్పటిది, ఎందుకు, ఎక్కడ, ఎలా ఉపయోగించబడింది అన్న విషయాన్ని కొంచెం విశ్లేషిద్దాం.
తెలుగు అన్న పదం భాషాపరంగా చూస్తే త్రిలింగ అన్న పదానికి దగ్గరగా ఉంది. చారిత్రకంగా త్రిలింగదేశంలో ఉన్నవాళ్లని అప్పటి ముస్లిం పాలకులు 'తెలుగు' ప్రాంతమనీ వారు మాట్లాడే భాషని 'తెలుగు', 'తెలంగి' అన్నట్టు మనకు తెలుస్తోంది. ఉర్దూలో త్రిలింగను తెలంగి అంటారు. ఇది క్రమంగా తెలుగు అయింది అనుకోవచ్చు. అంటే త్రిలింగదేశంలో ఉన్నవారు తెలుగువారు. త్రిలింగదేశం అంటే- ఒకవైపు కరీంనగర్‌లోని కాళేశ్వరం, ఇంకోవైపు ద్రాక్షారామం, దక్షిణంవైపు శ్రీశైలం- ఈమూడు లింగేశ్వర క్షేత్రాల మధ్యనున్న ప్రదేశం. ఇది 95 శాతం తెలంగాణలోకి వస్తుంది. అంటే ఇప్పటి తెలంగాణ వారు మాత్రమే తెలుగువారు అనుకోవలసి వస్తుంది. తెలుగు తెలంగాణ వారి స్వంతభాష. మాతృభాష. మహాకవి పోతన భాగవతాన్ని కూడా ప్రథమంగా ప్రచురించినప్పుడు తెలుగు భాగవతమనే ప్రచారంలో ఉండేది. తరువాత ఆంధ్ర ప్రచురణకర్తలు దానిని శ్రీమదాంధ్ర భాగవతంగా మార్చి, పోతననికూడా ఆంధ్రీకరించేశారు. ఈ 'ఆంధ్ర' అన్న పదానికి ఉన్న విశిష్టతని, దాని పూర్వాపరాలని పరిశీలిస్తే, ఆంధ్రం, తెలుగు అన్నవి వేరు జాతులనీ, వేరు భాషలనీ అర్థమవుతుంది.
తెలుగు భాషని, తెలుగుతల్లిని ఉద్ధరిస్తున్నామంటున్న ఇప్పటి సోదరుల జాతి ' ఆంధ్రజాతి'. వారు తెలుగు వారు కాదు. 9 వేల ఏళ్లకిందట రాసిన వాల్మీకి రామాయణంలో (ఈకాలంలో కూడా సరికాకపోవచ్చు, ఎందుకంటే రామాయణకాలానికి ఇప్పటికీ సరైన ఆధారాలు ఎవరూ చూపించలేదు), 5 వేల ఏళ్ల క్రింద జరిగిన శ్రీకృష్ణుడి కాలంలో బిసి 3127లో రాసిన మహాభారతంలో 'ఆంధ్ర' జాతి అన్నమాట వాడబడింది. దండకారణ్యం క్రిందభాగంలో నివశించే వారిని (అంటే ఇప్పటి ఆంధ్రప్రాంతం) ఆంధ్రజాతిగా వ్యవహరించడమైంది. మౌర్యుల కాలంలో భారతదేశానికి వచ్చిన మెగస్తనీస్ ఆంధ్రుల గురించి రాయడం చరిత్రలో చూస్తాం. సుమారు 1100 ఏళ్ల కిందట అంటే నన్నయ కాలంలో కూడా ఆంధ్రప్రాంతం వారిని ఆంధ్రులనే అన్నారుగానీ, తెలుగువారని అనలేదు. కవిత్రయం వేదవ్యాసుని సంస్కృత భారతాన్ని 'ఆంధ్రీకరించారే'కానీ 'తెలుగీ'కరించలేదు. ఈ రోజుదాకా ఎన్ని రకాల భారతాలు ప్రచురించినా అవి 'ఆంధ్ర భారతాలు' అయ్యాయే కానీ పుస్తకం మీద ఎక్కడా తెలుగు భారతం అని ఉండదు. ఆఖరికి ఆంధ్రప్రదేశ్ అవతరణ ముందు వచ్చిన మాయాబజార్ సినిమాలో కూడా గోంగూరని 'ఆంధ్రమాత' అని కీర్తించారేగానీ, 'తెలుగుమాత' అని అనలేదు. అంటే ఆంధ్రజాతి, ఆంధ్రభాష కచ్చితంగా వేరు అనేగా!
ఇక ఆంధ్రవాళ్ళకి ఊతపదంగా తెలుగు ఎలా వచ్చిందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. సాంస్కృతికపరంగా- స్వతంత్రం రాకముందు- శంకరంబాడి సుందరాచారి అని బాపట్లకి చెందిన ఒక కవి ఈ తెలుగు తల్లిని సృష్టించాడు. అప్పటిదాకా ఎవరు రాసినా, ఎవరు మాట్లాడినా 'ఆంధ్ర' అన్న పదమే వాడేవారు. అయితే ఆంధ్ర అన్నది సంస్కృతానికి దగ్గరగా ఉండడంతో, లాలిత్యాన్ని తన పాటలో జొప్పించడానికి మొట్టమొదటి దోపిడీదారుగా ఆయ న తెలంగాణకి సంబంధించిన 'తెలుగు' అన్న పదాన్ని దొంగిలించి తన పాటలో పెట్టుకున్నాడు. అయితే అప్పుడు తెలంగాణ నిజాం పాలనలో ఉండి, ఆంధ్రతో ఎక్కువ సంబంధాలు లేక ఈ విషయం కూడా ఎవరికీ తెలియలేదు. ఇలా భాషాచోరత్వంతో మొదలైన దోపిడీ నీళ్ళు, నిధులు, నియామకాలు మొదలైన అన్ని విషయాలలోకి పాకింది.
రాజకీయపదంగా ఈ పదాన్ని దొంగిలించిన ఘనత తెలుగు దేశం స్థాపకుడు ఎన్.టి. రామారావుకి చెందుతుంది. తెలంగాణ మీద ఏమాత్రం అభిమానం, బాధ్యతలేని తెలుగుదేశం పార్టీ తెలం గాణ మాతృభాష పేరుని మాత్రం స్వంతం చేసేసుకుంది. పాటలలోని లాలిత్యానికి తేనెలొలికే తెలుగు పదాన్ని కవిగారు తీసుకుం టే, సామాన్య జనాన్ని బుట్టలో వేసుకోవడానికి రాజకీయ నాయకులు చక్కగా ఈ పదాన్ని వాడుకుని, ఆ జాతికి మాత్రం అన్యా యం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీని ఆంధ్రప్రజలు తిప్పికొట్టాలి, కొట్టారు కూడా. తెలుగుదేశం అని ఉన్నా అది నిజమైన తెలుగు ప్రజలకు ఏమాత్రం న్యాయం చేయలేదుకాబట్టి తెలంగాణ ప్రజలు తెలుగుదేశాన్ని పాతరేయాలి. అసలు ఆంధ్రప్రాంతానికి చెందిన ఈ ఆంధ్రజాతి వారి ప్రత్యేకతను కాపాడుకోవాలంటే 'ఆంధ్రుల'మ నే వ్యవహరించుకోవాలి. తెలుగువాళ్ళమని వెన్ను చరుచుకోనవస రం లేదు. ఈ విషయం నన్నయ వగైరా రాసిన భారతాన్ని, తేనెలొలుకే తెలుగులో పోతన రాసిన భాగవతంతో పోలిస్తే తేటతెల్లమవుతుంది. నిజానికి మతాలు వేరైనా ఏకమవడం సాధ్యమేకానీ, భాషా, సంస్కృతి వేరైతే వారు కలవడం సాధ్యంకాదు.
పై విషయాలు సరిగ్గా అర్థం చేసుకుంటే ఆంధ్ర సోదరులు వారి పాటని ' ఆంధ్ర తల్లి'కి మొగలిపూదండ అనో, మా ' ఆంధ్రమాత'కి మోదుగపూదండ అనో మార్చుకోవాలి. తెలుగు తల్లి అన్న భావమే తప్పు, అయితే తెలుంగుతల్లి అనండి లేకపోతే తెలంగాణ తల్లి అనండి. ఏరకంగా అన్నా అది తెలంగాణ మాత్రమే అవుతుంది. అంతేకాదు గలగలా పారే గోదావరి, బిరబిర పరుగులెత్తే కృష్ణమ్మ చాలాభాగం తెలంగాణలోనే ఉన్నాయన్న మాట మనం మర్చిపోకూడదు.
ఇకమీదట ఆంధ్ర సోదరులని 'తెలుగు' వారని అనవద్దు. ఆంధ్రవారనే వ్యవహరిద్దాం. వారి జాతి, ఎన్నో తరాలనించీ, ఆంధ్రజాతి. కాబట్టి వారిని ఆంధ్రవారనీ, వారి భాషని 'ఆంధ్ర'మనీ అనడం సబబు. తెలుగువారందరూ ఒకే రాష్ట్రంలో ఉండాలన్న వారి వాద న తప్పని తిప్పికొడదాం. తెలుగువారందరూ తెలంగాణలోనూ ఆంధ్రవారు ఆంధ్రరాష్ట్రంలోనూ ఉండాలన్న మనవాదననీ బలోపే తం చేద్దాం. తెలంగాణలో ఉండాలంటే మన జిల్లాలలో మాట్లాడే అసలు తెలుగు మాట్లాడాలి. పోతన భాగవతం మనకి ప్రాచీన గ్రంథం కావాలి. కాళోజీ కవిత మన ఊపిరి కావాలి. ఆయన 'గొడవ' మన 'లొల్లి' కావాలి. సగం ఇంగ్లీషు కలిపి ఆంధ్రులు మాట్లాడే భాషని కవి పదాల్లోనే తిరస్కరించాలి.
నీవేష భాషలను నిర్లక్ష్యముగజూచు భావదాస్యంబెపుడు బాసిపోవునురా?..
అన్యభాషలు నేర్చి ఆంధ్రంబురాదంచు
సకలించు ఆంధ్రుడా! చావవెందుకురా!
ఇంకా కాళోజీ స్పష్టంగా అంటాడు ఎకసక్కెంగా:
నిజాం నవాబు క్రింద చెడిన తెలుగుతనం
గడిచిన పదిహేనేండ్లలో దిద్దబడెను చాలవరకు
ఇపుడు తెలంగాణ అంతటి ఆంధ్రత్వం ఎటుచూచిన
'చా', 'టీ' అయిమసలుతాంది, 'సడకు' రోడ్డై సాగుతున్నది
'అదాలతు' 'కోర్టా'యెను 'ముల్జీం' ముద్దాయాయెను.
'షక్కర్' 'సుగర'యి పోయెను ఉప్పు 'సాల్టు'గా మారెను.
తెలంగాణ సంస్కృతిమీద ఆంధ్రులదాడి ఈ విధంగా వర్ణించాడు:
ఆంధ్రుల సంస్కృతి సభ్యత తెలంగాణ కబ్బుతాంది.
లాగూ షేర్వానీలు మాని తెలంగాణ వారు
తీరపోని దారిబట్టి వేషాలు వేస్తున్నారు;
అందరికీ 'ఆంధ్రత్వం' సోకి ఆడిస్తున్నది.
తెలుగువారి మీద 'తీరపోని' అంటే కోస్తా జిల్లాల సవారీ ఇలా సాగుతోంది.
ఆంధ్రుల సభ్యత సంస్కృతి రెండున్నర జిల్లాలది
ఆటలు, పాటలు అన్నీ రెండున్నర జిల్లాలవి
తక్కినోళ్లు తెలుగుతనం కోల్పోయిన దౌర్భాగ్యాలు.
ఈ రకంగా కవి హృదయం తల్లడిల్లింది. మనభాష, మన సంస్కృతి కాపాడుకుందాం. తెలుగుతల్లిని కాకుండా తెలంగాణ తల్లిని కొలుద్దాం. తెలుగు అన్నది భాష మాత్రమే; ప్రాంతం తెలం గాణ కాబట్టి తెలుగుతల్లి అనడంలో అర్థం లేదు. తెలంగాణ తల్లి అందాం. మన తల్లి కోసం, మన భాషలో పోరాడుదాం.
జై తెలుగు! జై తెలంగాణ!
11, డిసెంబర్ 2009, శుక్రవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
telangana nu dochukunnadi andhra valla? politicians na?
andhra vallu dochukunte, andhra vallu kuda great britan type lo develop ayyi vundali. telangana kante konchem ekkuva develop ayyi vundachhu kani mari ekkuva kadu. endukante, ee polticians emi cheyyaru, cheyyanivvaru kabatti..
ippudu separate telangana vachhina, malli ade politicians. malli ade history repeat avuthundi. war andhra meda kadu, politicians meda start cheddamu.
jabbardasth....
త్రిలింగాలు అంటే శ్రీకాళహస్తి, శ్రీశైలం మరియు ద్రాక్షారామం అండీ.
పై ఆర్టికల్ లోని వాదనాపటిమ చాలా బాగుంది.
"తెలుగు అనేది వారి సొత్తయినట్టు, తెలుగుతల్లి అంటే వారొక్కరి తల్లి అయినట్టు ఆంధ్ర సోదరులు ఆవేశపడిపోతున్నారు."
"తెలుగు తెలంగాణ వారి స్వంతభాష. మాతృభాష."
అయ్యో...అచ్చంగా వారి మాతృభాష ని కీర్తిస్తూ తెలుగు తల్లి అని వ్రాస్తే తెలుగుతల్లి విగ్రహాలను వారే పగలకొట్టుకుంటున్నారా? అదేం గౌరవమండీ వారికి మాతృభాష మీద?
"త్రిలింగదేశం అంటే- ఒకవైపు కరీంనగర్‌లోని కాళేశ్వరం, ఇంకోవైపు ద్రాక్షారామం, దక్షిణంవైపు శ్రీశైలం- ఈమూడు లింగేశ్వర క్షేత్రాల మధ్యనున్న ప్రదేశం. ఇది 95 శాతం తెలంగాణలోకి వస్తుంది. అంటే ఇప్పటి తెలంగాణ వారు మాత్రమే తెలుగువారు అనుకోవలసి వస్తుంది."
ద్రాక్షారామం తూర్పు గోదావరి జిల్లాలో వుంది.త్రిలింగ క్షేత్రాల గురించి, త్రిలింగదేశం గురించీ ఇప్పటికీ అక్కడ శాసనాలలో వివరంగా రాసి ఉంది.
" 'ఆంధ్రీకరించారే'కానీ 'తెలుగీ'కరించలేదు."
తెలుగీకరించడం అనేదే తప్పు. తెనిగీకరించడం అనాలి. "తెనుగు" అనేది "తెలుగు" కి పర్యాయపదం. "తెలుగు" అనే పదం కంటే ముందునుండీ "తెనుగు" అన్న పదం ఉంది. అలాగే దానికంటే ప్రాచీనమైన పదం "ఆంధ్రము". ఒకే భాష కి మారుతున్న కాలాన్ని బట్టి వచ్చిన వ్యావహారికాలు "ఆంధ్రము, తెలుగు, తెనుగు".
"తెలుగు భాషని, తెలుగుతల్లిని ఉద్ధరిస్తున్నామంటున్న ఇప్పటి సోదరుల జాతి ' ఆంధ్రజాతి'.వారు తెలుగు వారు కాదు."
"తెలుగు తల్లి అన్న భావమే తప్పు, అయితే తెలుంగుతల్లి అనండి లేకపోతే తెలంగాణ తల్లి అనండి."
తమది కాని "తెలుగు" అన్న పదాన్ని దొంగిలించేసిన ఆంధ్ర వాళ్ళు ఆ పదంతో ఉన్న పాట పాడుకుని తెలుగును గౌరవిస్తున్నారు.
అచ్చంగా అన్ని హక్కులున్న "తెలుంగు" జాతివాళ్ళు, తెలుగు పందములో "ం" లేదని కోపమొచ్చి ఆ పాటను పాడకూడదని నిరశనలు చేసి తెలుగుతల్లి విగ్రహాలను పగలకొడుతున్నారు.
"గలగలా పారే గోదావరి, బిరబిర పరుగులెత్తే కృష్ణమ్మ చాలాభాగం తెలంగాణలోనే ఉన్నాయన్న మాట మనం మర్చిపోకూడదు."
"గలగలా పారే గోదావరి, బిరబిర పరుగులెత్తే కృష్ణమ్మ చాలాభాగం తెలంగాణలోనే ఉన్నా ఆంధ్రులు ఆ విషయాన్ని మర్చిపోయి "గలగలా గోదారి, బిరబిర కృష్ణమ్మ" అని పాడేసుకుని గొప్పలు పోతున్నారు. కాని ఆ విషయాన్ని బాగా గుర్తుంచుకున్న తెలుంగు జాతివారు ఆ పాట పాడి ఆ విషయమే గుర్తు చేయద్దంటున్నారు.
"పై విషయాలు సరిగ్గా అర్థం చేసుకుంటే ఆంధ్ర సోదరులు వారి పాటని ' ఆంధ్ర తల్లి'కి మొగలిపూదండ అనో, మా ' ఆంధ్రమాత'కి మోదుగపూదండ అనో మార్చుకోవాలి."
మల్లెపూలు కూడా తెలుంగు జాతి వారివేనా? ఆంధ్ర జాతి వారు ఆ పూలను వాడకూడదా ఏమిటి?
ఎందుకొచ్చిన రాతలండీ ఇవి? అక్కరలేని విద్వేషాలను రెచ్చగొట్టడానికి కాకపోతే.
చాలా కరెక్ట్ గా వ్రాసారండి .......తెలంగాణా తల్లి వేరు ఆంధ్ర తల్లి వేరు......
"పై విషయాలు సరిగ్గా అర్థం చేసుకుంటే ఆంధ్ర సోదరులు వారి పాటని ' ఆంధ్ర తల్లి'కి మొగలిపూదండ అనో, మా ' ఆంధ్రమాత'కి మోదుగపూదండ అనో మార్చుకోవాలి."
నీ అసాధ్యం కూలా.. ఇలాంటి పనికి రాని మాటలతోనే ప్రజలను మోసం చేసే పనిలో ఉన్నావన్న మాట. పనికొచ్చే విషయాలు చెప్పు నాయనా.. ఇలా అర్థంపర్థం లేని విషయాలతో ప్రజలను గందరగోళంలో పెట్టి .. అవునేమో అన్నట్టు చేసి కాలం గడపకు. మళ్లీ ఇదే పనినే ఆంధ్ర వాళ్లు చేశారు.. రాయలసీమోళ్లు చేశారు అని పనికి రాని మాటలు అని తప్పించుకోకు. వాడు పేడ తింటే నువ్వే తింటావా.. ముందు ఇలాంటి పైత్యాన్ని జనం మీదకు పంపడం అపు. సమస్యేంటి. వాటిని పరిష్కరించుకోవటానికి మార్గాలేంటి. అది చెప్పు. తెలుగు తల్లి. కాదు. తెలంగాణ తల్లి అని పెట్టుకున్నావ్ బాగుంది. వందే మాతరం మేం పాడం అని ముస్లింలు కూడా అంటున్నరు. అది కూడా బాగుంది. జనగణ మన పాడం అని కాశ్మీర్ ప్రజలు కూడా అంటున్నరు. అలాగే ఈ ప్రజాస్వామ్యం నీ ఇష్టం ఎవడు కాదన్నడు.
గోదావరి, కృష్ణానదులు రాష్ట్రంలో ముందుగా ప్రవేశించేది తెలంగాణ మీదుగానే. కానీ.. అందులో పారుతున్న నీరు ముందునుంచీ దక్కించుకొంటోంది ఎవరు? తెలంగాణా వారా.. ఆంధ్రావారా.. కృష్ణా,గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు పచ్చగా పైర్లతో కనపడుతుంటే.. నల్గొండ, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో భూములు బీడుభూములుగా ఎందుకు మారుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఏర్పడి 50 ఏళ్లయ్యింది. తెలంగాణ జిల్లాల్లోకి నదీ జలాలను తరలించడానికి ఈ మాత్రం సమయం మన పాలకులకు సరిపోదా... విభేదాలు ఊరికే రావడం.. ఓ జాతి తమకు పూర్తిగా అన్యాయం జరుగుతుందని భావించనప్పుడే.. ఈ తరహా పరిస్థితులు ఏర్పడతాయి.
ఎంత చోద్యం ! తెలుగు .. ఆంధ్రము రెండూ పర్యాయ పదాలు.. కాకతీయుల పాలనలో మాట్లాడుకున్నది ఆంధ్రమే, అది తెలుగే.. తిక్కన ని ఎవరు సత్కరించారో మీకు ఎరుకా ? రాయలసీమ మేటి శ్రీ కృష్ణదేవరాయలు దేశభాషలందు ఆంధ్రము లెస్స అని అనలేదు , తెలుగు లెస్స అని పలికాడు.
తెలుగు మీసొత్తు కాదు, మా సొత్తు కాదు.. మనందరి సొత్తు.. తెలుగు వాళ్ళం మనం కలిసుంటామో లేదో తెలియదు కాని, తెలుగు తల్లిని మాత్రం గౌరవిద్దాం.. లేదంటే అందరిముందు అలుసవుతాం.
ఆంధ్రప్రదేశ్ లో జిల్లాలు
ఏర్పడిన సంవత్సరం ↓ జిల్లా ↓ జిల్లాకేంద్రం ↓ జనాభా (2001) ↓ వైశాల్యం (km²) ↓ జనసాంధ్రత (/km²) ↓ జిల్లావెబ్ సైట్ ↓
1905 అదిలాబాద్ జిల్లా అదిలాబాద్ 2,479,347 16,105 154 http://adilabad. nic.in/
1881 అనంతపూర్ జిల్లా అనంతపూర్ 3,639,304 19,130 190 http://anantapur. nic.in/
1911 చిత్తూరు జిల్లా చిత్తూరు 3,735,202 15,152 247 http://chittoor. nic.in/
1802 తూర్పు గోదావరి జిల్లా కాకినాడ 4,872,622 10,807 451 http://eastgodavari .nic.in/
1794 గుంటూరు జిల్లా గుంటూరు 4,405,521 11,391 387 http://guntur. nic.in/
1978 హైదరాబాద్ జిల్లా హైదరాబాద్ 3,686,460 217 16,988 http://hyderabad. nic.in/
1910 కడప జిల్లా కడప 2,573,481 15,359 168 http://kadapa. nic.in/
1905 కరీంనగర్ జిల్లా కరీంనగర్ 3,477,079 11,823 294 http://karimnagar. nic.in/
1953 ఖమ్మం జిల్లా ఖమ్మం 2,565,412 16,029 160 http://khammam. nic.in/
1925 కృష్ణా జిల్లా మచిలీపట్నం 4,218,416 8,727 483 http://krishna. nic.in/
1949 కర్నూలు జిల్లా కర్నూలు 3,512,266 17,658 199 http://kurnool. nic.in/
1870 మహబూబ్ నగర్ జిల్లా మహబూబ్ నగర్ 3,506,876 18,432 190 http://mahabubnagar .nic.in/
1956 మెదక్ జిల్లా సంగారెడ్డి 2,662,296 9,699 274 http://medak. nic.in/
1953 నల్గొండ జిల్లా నల్గొండ 3,238,449 14,240 227 http://nalgonda. nic.in/
1906 నెల్లూరు జిల్లా నెల్లూరు 2,659,661 13,076 203 http://nellore. nic.in/
1876 నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ 2,342,803 7,956 294 http://nizamabad. nic.in/
1970 ప్రకాశం జిల్లా ఒంగోలు 3,054,941 17,626 173 http://prakasam. nic.in/
1978 రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ 3,506,670 7,493 468 http://rangareddy. nic.in/
1950 శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం 2,528,491 5,837 433 http://srikakulam. nic.in/
1950 విశాఖపట్నం జిల్లా విశాఖపట్నం 3,789,823 11,161 340 http://visakhapatna m.nic.in/
1979 విజయనగరం జిల్లా విజయనగరం 2,245,103 6,539 343 http://vizianagaram .nic.in/
1905 వరంగల్ జిల్లా వరంగల్ 3,231,174 12,846 252 http://warangal. nic.in/
1926 పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు 3,796,144 7,742 490 http://wgodavari. nic.in/
విశేషాలు
* అనంతపురం జిల్లా కంటే వైశాల్యంలో చిన్న దేశాలు : మాల్టా,గ్రెనెడా,ఆండొర్రా,బహ్రైన్,బ్రూనే,కేప్వర్ద్,సైప్రస్,డొమినికా,ఫిజీ,గాంబియా,జమైకా,కువైట్,లెబనాన్,లక్సెంబర్గ్,మారిషస్,పోర్టోరికో,కతార్,సీషెల్స్,సింగపూర్,స్వాజీలాండ్,టాంగో.ట్రినిడాడ్,టుబాగో,వనౌటూ.
ఆనాడు తొందరపడి ఇతర రాష్ట్రాల్లో కలిపేసిన తెలుగు ప్రాంతాలు ఇవిః
ఒడిసా – గంజాం,బరంపురం,కోరాపుట్,పర్లాకిమిడి.
కర్నాటక – చిత్రదుర్గ,కోలార్,బళ్ళారి.
మహారాష్ట్ర – చంద్రపూర్,గచ్చిబోల్
చత్తీస్గడ్ – బీజాపూర్,బస్తర్,దంతెవాడ.
తమిళనాడు – హోసూరు,దేవనపల్లి,కృష్ణగిరి,డెంకణికోట.
పాండిచేరి -యానాం
సమైక్య ఆంధ్ర(ఆంధ్రప్రదేశ్)కే బీటలు పడుతుంటే,ఇక పై తెలుగు ప్రాంతాలతో కలిసిన మహా తెలుగునాడు(విశాలాంధ్ర)ఆవిర్భవిస్తుందా?
Please see this link:
http://en.wikipedia.org/wiki/Epic_India
You can CLEARLY find the regions separately marked as "ANDHRAKA" and "TELINGA".
We have prepared a padakosham with 35000 telangana words and none of the andhrites can understand the meaning!!
తెలుగు భాష మూలపురుషులు యానాదులు.తరువాత తెలుగు అనేక మాండలికాలుగా విస్తరించిందిః
ఆంధ్ర , బుడబుక్కల , డొక్కల , చెంచు , ఎకిడి , గొడారి, బేరాది, దాసరి , దొమ్మర , గోలారి, కమ్మర , కామాటి, కాశికాపిడి , కొడువ, మేదరి , మాలబాస, మాతంగి , నగిలి, పద్మసాలి , జోగుల , పిచ్చుకుంట్ల , పాముల , కొండ రెడ్డి, తెలంగాణా, తెలుగు, సగర, వడగ, వడరి, వాల్మీకి , యానాది , బగట, శ్రీకాకుళం, తూర్పు గోదావరి, రాయలసీమ, నెల్లూరు, గుంటూరు, మద్రాసు(వడుగ ), ఒరిస్సా(బడగ ),బంజారా[లంబాడి],--1961 సెన్సస్, తెలుగుభాష పై పరిశోధన ఆంధ్రలో కంటే అమెరికాలోనే ఎక్కువగా జరుగుతుంది.దాదాపు రెండుతరాల విద్యార్థులు తెలుగు రాకుండానే, తెలుగుభాషను తూతూమంత్రంగా చదువుకునే కళాశాలల నుంచి బైటికొచ్చారు. వాళ్లంతా ఇంజినీర్లు, డాక్టర్లు, ప్రభుత్వశాఖల్లో పెద్దపెద్ద ఉద్యోగులైపోయారు. తెలుగంటే వెగటు. ఇంట్లో తెలుగక్షరాలు కనపడనీయరు. వినబడనీయరు. ఇక వీరి పిల్లలకు మాత్రం తెలుగంటే ఏం తెలుస్తుంది?మొత్తం తెలుగు రాష్ట్రంలోని మూడుప్రాంతాలలోనూ ఇదే దుస్థితి తెలుగుకుంది.బ్రిటిష్ పాలకుల్ని తరిమికొట్టినా వారి భాషను మాత్రం విడవలేని పరిస్థితి భారతీయ భాషలన్నిటికీ ఉంది.గ్రాంథిక వ్యావహారిక భాషా వాదాలతోనే చాలాకాలం వ్యర్ధమైపోయింది.పరిపాలనా సౌలభ్యంకోసం ఒకే భాష మాట్లాడే వారికి రెండు మూడు రాష్ట్రాలుండవచ్చు కాబట్టి రాష్ట్ర విభజనకోసం ఆంధ్రభాష తెలుగు భాష వేరు అననక్కరలేదు.అవన్నీ చుట్టుపక్కల ప్రాంతాల భాషలతో సంకరం చెంది ఏర్పడిన యాసలే.