
కావూరి వ్యాఖ్యల దెబ్బకు తొలివికెట్ పడింది. తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను సోనియాగాంధీకి పంపించాలని నిర్ణయించారు. తెలంగాణ ఏర్పాటులో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ ఈ రాజీనామా చేస్తున్నట్లు జూపల్లి ప్రకటించారు. అయితే.. మంత్రులెవరైనా రాజీనామా చేస్తే, ముఖ్యమంత్రికి రాజీనామా లేఖను అందించాలి. కానీ, జూపల్లి మాత్రం సోనియాగాంధీకి పంపించాలని అనుకుంటున్నారు. అంటే, రాజీనామా చేసినా మంత్రిగానే ఉంటారనమాట. కావూరి వ్యాఖ్యలకు తగ్గట్లుగా ఇది ఉత్తుత్తి రాజీనామానేనా..? లేక నిజంగా పదవిని వదులుకోవడానికి జూపల్లి సిద్ధపడ్డారా..? ఇప్పుడు తేలాల్సింది ఇదే.
ఇట్లా ఉత్తుత్త రాజీనామాల డ్రామాలు వేస్తె
తెలంగాణా మంత్రులు ఇంకింత "పజీత" పాలవుతారు.
స్వయంగా డిల్లీ పోయి ఎంత ప్రాధేయ పడ్డా దర్శన భాగ్యమే
దొరకడం లేదు తెలంగాణా నేతలకు.
ఇక పోస్ట్ లో పంపిన లేఖలు అమ్మకు చేరతాయా..
బుట్ట దాఖలా అవుతాయి గానీ !