29, నవంబర్ 2010, సోమవారం
జగన్ వ్యూహం ఏమిటి?
Categories :
వేటా.. లేటా.. సందేహాలకు సమాధానం దొరికింది. కాంగ్రెస్, జగన్ మధ్య చాలాకాలంగా సాగుతున్న యుద్ధంలో ఎట్టకేలకు ముందడగు పడింది. కాంగ్రెస్ అధిష్టానం వైపు నుంచే చర్యలుంటాయన్న అనుమానాలను పక్కన పెడుతూ, జగనే నిర్ణయం తీసుకున్నారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్ నిష్క్రమణ
ఎంపీ పదవికి జగన్ రాజీనామా
ఎమ్మెల్యే పదవికి జగన్ తల్లి విజయలక్ష్మి రాజీనామా
పార్టీ సభ్యత్వానికి రాజీనామా
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ కూర్పులో నేర్పుగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ అధిష్టానానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తనయుడు జగన్ మోహన్‌రెడ్డి ఊహించని షాక్ ఇచ్చారు. ముసుగులో గుద్దులాటలా సాగుతున్న వ్యవహారంలో ముందడుగు వేశారు. కాంగ్రెస్ హైకమాండ్‌పై పైచేయి సాధించే ప్రయత్నం చేశారు. అందులో భాగమే రాజీనామా అస్త్రం.
ష్ట్ర రాజకీయాలను నిశింతంగా పరిశీలిస్తున్నవారికి జగన్ రాజీనామా పెద్ద వింతకాకపోవచ్చు. కానీ, రాష్ట్ర మంత్రివర్గ కసరత్తు సమయంలో ఉన్నప్పుడే జగన్ రాజీనామా చేయడం మాత్రం విస్తుగొలిపేదే. జగన్‌ను ఎదుర్కోవడం కోసమే కిరణ్‌కుమార్‌రెడ్డిని ముఖ్యమంత్రి పదవికి సోనియాగాంధీ ఎంపిక చేశారన్న వార్తలు ఇప్పటికే కాంగ్రెస్‌లకు కలకలం పుట్టిస్తున్నాయి. వైఎస్ అనుచరులుగా జగన్‌కు మద్దతు ప్రకటిస్తున్న వారికి కిరణ్‌కుమార్ నియామకం పిడుగుపాటులాగే అనిపించింది. అయినా ఓర్పుతో ఉంటామని సంకేతాలిచ్చిన జగన్ శిబిరం, ఒక్కసారిగా వ్యూహాన్ని మార్చింది. జగన్, విజయలక్ష్మిల రాజీనామాలతో రాష్ట్ర రాజకీయాలను రసవత్తరంగా మార్చింది.
గన్ రాజీనామాతోనే గొడవ పూర్తవ్వలేదు. అసలు గొడవ ఇప్పుడే మొదలుకాబోతోంది. వైఎస్ తనయుడిగా రాజకీయప్రవేశం చేసిన జగన్, కాంగ్రెస్‌ను వదిలిపెట్టినా రాజకీయాలను వదులుకునే అవకాశం మాత్రం కనిపించడం లేదు. మరి, జగన్ కొత్త పార్టీని ప్రారంభిస్తారా..?ఒకవేళ ప్రారంభిస్తే పార్టీ పేరేమిటి? కిరణ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో ఏర్పడే కొత్త ప్రభుత్వానికి జగన్ సమస్యలు సృష్టిస్తారా..? లేక జగన్ రాజీనామాకు కాంగ్రెస్ హైకమాండ్ దిగివస్తుందా..? రాజీ ప్రయత్నాలు చేస్తుందా..? జగన్ రాజీనామా సృష్టించబోయే పరిణామాలు ఎలా ఉంటాయి?
రాజుకున్న చిచ్చు
గన్ రాజీనామా రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించింది. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు వెల్లువెత్తాయి. జగన్‌కు మద్దతుగా చాలామంది రాజీనామాలకు సిద్ధపడుతున్నారు. మరోవైపు జగన్ రాజీనామాకు లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ ఆమోదం తెలిపారు. రాష్ట్ర ఎంపీలు ఉండవల్లి, సబ్బం హరి, మేకపాటిలు రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారు. బుధవారం నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. జగన్ నిర్ణయానికి అనుగుణంగా ముందడుగు వేయాలని మరికొంతమంది ఎమ్మేల్యేలు భావిస్తున్నారు.
ష్ట్రవ్యాప్తంగానూ జగన్ రాజీనామా కలకలం పుట్టించింది. జగన్‌కు మద్దతుగా, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా చాలాచోట్ల ఆందోళనలు జరిగాయి. జగన్ నివాసం వద్దే సోనియా శవయాత్రను నిర్వహించి, దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతపురం, కడప, తిరుపతి, గుడివాడల్లోని కాంగ్రెస్ కార్యాలయాలపై దాడులు జరిగాయి. కడప,ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు డీసీసీ అధ్యక్షులు రాజీనామా చేశారు. చాలామంది ఎంపీపీలు, ఎంపీటీసీలు జగన్‌కు మద్దతుగా పదవులు వదులుకుంటున్నట్లు ప్రకటించారు.
గన్ రాజీనామాపై పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రాజీనామా వల్ల అటు పార్టీకి ఇటు జగన్‌కు నష్టం ఉంటుందని వ్యాఖ్యానించారు. జగన్ రాజీనామా అనంతరం జరుగుతున్న పరిణామాలను కాంగ్రెస్ హైకమాండ్ ఎప్పటికప్పుడు తెలుసుకొంటోంది. గన్ రాజీనామాపై కాంగ్రెస్ హైకమాండ్ పెద్దగా స్పందించలేదు. దురదృష్టకరమని మాత్రమే పేర్కొంది. జగన్ రాజీనామాను కొత్త సీఎం కిరణ్‌కుమార్ తేలిగ్గా తీసుకున్నారు. క్యాబినెట్ ఏర్పాటుపై ఈ పరిణామాలు ఏమాత్రం ప్రభావం చూపించవని ప్రకటించారు. గ్రెస్ కార్యాలయాలపై దాడులు, సోనియాపై విమర్శలు కాంగ్రెస్ నేతలకు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. జగన్ వర్గం ఈవిషయంలో వెనక్కితగ్గితే మంచిందంటూ సూచిస్తున్నారు.
సోనియమ్మే లక్ష్యం ..
కాంగ్రెస్ ఇంటిపోరు వీధిన పడింది. పార్టీలోనే ఉంటూ హైకమాండ్‌పై ఇంతకాలం పోరాటం సాగించిన జగన్, ఎట్టకేలకు వేరుపడ్డారు. పార్టీకి, పదవికి రాజీనామా చేస్తున్నానంటూ కాంగ్రెస్ అధ్యక్షురాలికి ఐదు పేజీల లేఖను రాశారు. అందరికీ తెలియడం కోసం ఆ లేఖనే మీడియాకు విడుదల చేశారు. ప్రతీ పదాన్ని ఆచూతూచి వాడిన జగన్.. కాంగ్రెస్ అధిష్టానం తీరును అడుగడుగునా విమర్శించారు. తన రాజీనామాకు కారణం కాంగ్రెస్ పార్టీ వైఖరే కారణమని తేల్చి చెప్పారు. పార్టీనే తనను బయటకు పంపించిందన్న సంకేతాలను తన అనుచరులకు, రాష్ట్ర ప్రజలకు పంపించారు.
బరువెక్కిన గుండెతో, తీవ్రమైన ఆవేదనతో మీకు ఈ లేఖ రాస్తున్నానంటూ మొదలుపెట్టిన జగన్.. వైఎస్ మరణానంతరం జరిగిన సంఘటనలను, తనను కట్టడి చేయడానికి గుట్టుగా సాగుతున్న ప్రయత్నాలను ఏకరవు పెట్టారు. తన చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డికి ఆశలు చూపి, తమ కుటుంబాన్నే చీల్చే నీచ రాజకీయాన్ని కాంగ్రెస్ పార్టీ చేస్తోందంటూ తీవ్రంగా విమర్శించారు. ఇదంతా తనను పార్టీనుంచి బయటకు పంపడానికి, వైఎస్ కీర్తి ప్రతిష్టలను తుడిచివేయడానికి జరుగుతోందనే అభిప్రాయపడ్డారు. నా మీద ఎందుకు ఇలా కత్తిగట్టారు? అని సూటిగా ప్రశ్నించారు. వైఎస్ మరణించిన అనంతరం 150 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చినా, అధిష్టానం సూచన మేరకే రోశయ్య పేరును ప్రతిపాదించానని తన విధేయతను చాటుకున్నారు. ఓదార్పు యాత్రపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నా, వాటికి ఢిల్లీ పెద్దలు సహకరించారంటూ ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని రెండుసార్లు అధికారంలోకి తెచ్చిన వైఎస్ విగ్రహాలను ఊరూరా పెట్టడం వల్ల నష్టమేమిటంటూ నిలదీశారు.
తన లేఖలో సోనియా తీరునూ టార్గెట్ చేసుకున్నారు జగన్. చిరంజీవికి, తన చిన్నాన్న వివేకానందకు ఒక్కరోజులోనే దొరికే సోనియా అపాయింట్మెంట్, తనకు,తన తల్లికి మాత్రం నెలరోజులకు గానీ ఎందుకు దక్కలేదంటూ ప్రశ్నించారు. ఓదార్పుయాత్రలో పాల్గొనకుండా ఎమ్మెల్యేలు, మంత్రులకు ఆంక్షలు విధించడాన్నీ తప్పుబట్టారు.
తన తండ్రి మరణంపై దర్యాప్తునూ జగన్ లేఖలో ప్రస్తావించారు. కంటితుడుపుగా జరిగిన ఈ దర్యాప్తు ఎన్నో ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వలేదని, హెలికాప్టర్ ప్రమాదంపై ఇంకా ఎన్నో అనుమానాలు ఉన్నాయంటూ పేర్కొన్నారు. 125 వసంతాలు పూర్తి చేసుకున్న కాంగ్రెస్‌పై విశ్లేషణాత్మక కథనాలను ప్రసారం చేసిన తన ఛానల్‌పై దాడి చేయడాన్ని, యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నాలు చేయడాన్ని ఆక్షేపించారు. ఇలా ఎన్నో రకాలుగా తనకు ఇబ్బందులను కలిగిస్తుంటే, ఇంకెంత కాలం సహనంతో ఉండాలంటూ సూటిగా ప్రశ్నించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో రోడ్డు మీద వెళ్లే చిన్నపిల్లాడిని అడిగినా "నేడో రేపో జగన్మోహన్రెడ్డిని కాంగ్రెస్ నుంచి బహిష్కరిస్తారు" అని చెప్పే స్థాయికి వెళ్లాయంటూ తన లేఖలో ఆగ్రహం వెళ్లగక్కారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలో ఉండలేనని స్పష్టం చేసేశారు. అంతేకాదు.. "తనను ఒంటరిని చేసి పంపించాలనుకున్నారు. ఒంటరిగా నేనే వెళుతున్నాను".. అని సోనియాకు రాసిన లేఖలో ప్రత్యేకంగా జగన్ ప్రస్తావించారు. ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్రలు చేస్తున్నానంటూ తనపై దుష్పచారం జరుగుతోందని, తనది అలాంటి వ్యక్తిత్వం కాదనీ పేర్కొన్నారు. తనకోసం ఎమ్మెల్యేలెవరూ రాజీనామాలు చేయవద్దనీ కోరారు. ఇలా అధిష్టానానిదే తప్పంతా అని చాటిచెప్పే ప్రయత్నాన్ని ఈ లేఖ ద్వారా చేశారు జగన్మోహన్ రెడ్డి.
అసెంబ్లీకి జగన్..
కొత్త సీఎం పూర్తిగా పదవిని చేపట్టనే లేదు. మంత్రిమండలిని ఏర్పాటు చేసుకోనేలేదు. తనదైన పాలనను మొదలుపెట్టనే లేదు. అప్పుడే సమస్యలు. జగన్ రూపంలో అసమ్మతి మొదలయ్యింది. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటే తన ప్రణాళిక అమలు కాదని నిర్ధారించుకున్నందునే, జగన్ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. తల్లితో కూడా రాజీనామా చేయించడం ద్వారా సెంటిమెంట్‌ను రగిలించే ప్రయత్నం చేశారు. విజయమ్మ రాజీనామాను ఆమోదం పొందితే పులివెందుల సీటు ఖాళీ అవుతుంది. ఎంపీ స్థానానికి బదులు ఎమ్మెల్యేగానే జగన్ పోటీ చేయవచ్చు. పార్టీలో తనను అణిచివేయడానికే కిరణ్‌కుమార్‌రెడ్డిని సీఎంగా నియమించారని భావిస్తున్న జగన్.. పులివెందుల నుంచి అసెంబ్లీకి వచ్చి, నేరుగా ఆయన్నే ఢీకొట్టాలని భావిస్తున్నారు.
తనకోసం ఎమ్మెల్యేలు ఎవరూ రాజీనామా చేయవద్దని జగన్ కోరుతున్నా, ఆయన అనుచరులు మాత్రం రాజీనామాలకే సిద్ధపడుతున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఎంతమంది జగన్ వైపు ఉన్నారన్నది కచ్చితంగా తేలకపోయినా 20 మందికి పైగానే జగన్ వెంట ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు తాము జగన్ వెంటే ఉంటామంటూ స్పష్టమైన సంకేతాలను పంపిస్తున్నారు. ఓ వైపు మంత్రివర్గ విస్తరణ ఉండడం, పదవులు దక్కవచ్చన్న ఆశలు చాలామందిని ఇరకాటంలో పెడుతున్నాయి. తొందరపడి రాజీనామా ప్రకటనలు చేస్తే మొదటికే మోసం రావచ్చన్న అనుమానాలు ఎమ్మెల్యేలను పీడిస్తున్నాయి. అందుకే, బుధవారం వరకూ ఎమ్మెల్యేల వైఖరి స్పష్టం కాకపోవచ్చు. మంత్రి పదవులు దక్కకపోతే మాత్రం చాలా మంది ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు జగన్‌వైపు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్‌ను ఎదిరించి తన బలాన్ని చాటుకోవాలంటే జగన్‌కు ఇంతకన్నా మంచి అవకాశం రాకపోవచ్చు. అందుకే, పదవుల అసమ్మతిని తనకు అనుకూలంగా మార్చేపనిలో పడ్డారు. సోనియాకు రాసిన లేఖలో కాదన్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీలో చీలిక తేవాలన్నదే జగన్ ఉద్దేశం.
రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటికే జగన్ రాజీనామా లేఖ ప్రకంపనలు సృష్టిస్తోంది. కొత్త పార్టీ పెడతారంటూ కొంతమంది చెబుతున్నా, జగన్ మాత్రం ఈ విషయంలో ఇంతవరకూ ప్రకటన చేయలేదు. అయితే.. ఇడుపులపాయలో తండ్రి సమాధిని సందర్శించిన అనంతరం భవిష్యత్ కార్యాచరణను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ముందుగా, మరో విడుత ఓదార్పుయాత్రను చేపట్టి, ఆ తర్వాతే రాజకీయ నిర్ణయాన్నితీసుకోవచ్చు. జగన్ దూకుడు చూస్తుంటే.. కాంగ్రెస్‌పై తిరుగుబాటు చేసినట్లే. కాంగ్రెస్‌ను ఎదిరించి, ఆ పార్టీకి పూర్తి ప్రత్యామ్నయంగా ఎదగాలని భావిస్తున్నారు. అందుకే, వీలైనంత తొందరలోనే కొత్తపార్టీని అనౌన్స్ చేసే అవకాశాలూ ఉన్నాయి.
ప్రభుత్వం పడగొడతారా...?
2009 సాధారణ ఎన్నికల్లో వైఎస్ నేతృత్వంలో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ 156 స్థానాలను గెలుచుకుంది. రెండోస్థానంలో నిలిచిన తెలుగుదేశం పార్టీ 92 స్థానాలను గెలుచుకుంది. పీఆర్పీ 18, టీఆర్ఎస్ 10, ఎంఐఎం 7, సీపీఐ 4, బీజేపీ 2, సీపీఎం1, లోక్‌సత్తా ఒకస్థానంలోనూ గెలుపొందాయి. మరో ముగ్గురు ఇండిపెండెంట్లు ఎన్నికల్లో గెలుపొందారు. ఎన్నికల అనంతరం టీడీపీ ఎమ్మెల్యేలు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్, బాలనాగిరెడ్డిలు నిత్యం అసమ్మతి స్వరం వినిపిస్తూ కాంగ్రెస్‌కు దగ్గరయ్యారు. దీంతో టీడీపీ బలం 90కి చేరింది. ఉపఎన్నికల్లో మరో స్థానాన్ని టీఆర్ఎస్కు కోల్పోవడంతో టీడీపీకి 89 మంది సభ్యుల బలం మాత్రమే ఉంది. అసెంబ్లీలో కాంగ్రెస్‌కు మెజార్టీమార్కు 148కు మించి ఎనిమిది స్థానాలు అధికంగానే ఉన్నాయి. ఒకవేళ జగన్ వెనుక మరో పదిమంది ఎమ్మెల్యేలు వెళితే ప్రభుత్వానికి కష్టకాలం మొదలవుతుంది. ఇప్పటికే విజయమ్మ రాజీనామా చేసింది కాబట్టి, ఈ ఆధిక్యంలో ఒకటి తగ్గినట్లే. అయితే.. ఇలాంటి పరిస్థితి ఎప్పటికైనా రావచ్చని ఊహించిన కాంగ్రెస్ అధిష్టానం ముందునుంచీ రక్షణాత్మక చర్యలను చేపట్టింది. అందులో భాగంగానే ప్రజారాజ్యం అధినేత చిరంజీవిని ఆకర్షించింది. జగన్ రాజీనామా చేయకముందే మంత్రిపదవుల ఆశ కూడా చూపింది. అంటే, జగన్ తిరగబడడం ఖాయమేనని కాంగ్రెస్ హైకమాండ్ భావించిందన్నమాట. పీఆర్పీకి 18 మంది ఎమ్మెల్యేల బలం ఉంది కాబట్టి, కాంగ్రెస్‌తో కలిస్తే 173 మంది బలం ఉంటుంది. దీంతో ప్రభుత్వం పడిపోదన్న అంచనా కాంగ్రెస్‌ది.
ఎంఐఎంకున్న 7గురు ఎమ్మెల్యేల మద్దతు కూడా కాంగ్రెస్‌కు ఉంటుంది కాబట్టి బలం 180 ఉన్నట్లే, ఇక ఇండిపెండెంట్లు ముగ్గురూ మద్దతిస్తే బలం 183కు పెరుగుతుంది. ఒకవేళ టీఆర్ఎస్ కూడా ఆదుకోవడానికి ముందుకు వస్తే ఈ బలం 194కు పెరుగుతుంది. లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ ప్రభుత్వ పక్షం నిలబడితే 195 మంది బలం అధికారపక్షానికి లభిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం పడిపోవాలంటే, ఎంతలేదన్నా 48 మందిని జగన్ చీల్చగలగాలి. అప్పుడే ప్రభుత్వం పడిపోయే అవకాశాలుంటాయి. ఇప్పటికే 20 మందికి పైగా జగన్ పక్షాన ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ రెబల్స్ ఇద్దరూ జగన్ పక్షమే. పీఆర్పీ నుంచి కూడా ముగ్గురు ఎమ్మెల్యేలు జగన్‌వైపు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తం 48 మందిని జగన్ సమీకరించగలుగుతారా అన్నదే ఇప్పుడు సమస్య. ఇంతపెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు జగన్‌కు మద్దతు పలకకపోవచ్చన్న ఆశ కాంగ్రెస్‌ది. అందుకే, హైకమాండ్ ధైర్యంగా ముందడుగు వేస్తోంది.
టార్గెట్ 2014
ఇదే సమయంలో జగన్ ఆలోచిస్తోంది మాత్రం పూర్తిగా వేరు. ఇప్పటికిప్పుడు సీఎం పదవి అందే అవకాశాలు ఎలాగూ లేవు కాబట్టి, దానికోసం ప్రయత్నాలు చేయకూడదనే అనుకుంటున్నారు. తనను ఎన్నో రకాలుగా ఇబ్బందిపెట్టిన కాంగ్రెస్ పార్టీని పూర్తిగా దెబ్బతీయాలనే ప్రణాళికలు రచిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోపు రాష్ట్ర విభజన జరిగినా, జరగకపోయినా, కాంగ్రెస్ గెలిచే అవకాశాలు లేవన్నది జగన్ అంచనా. పైగా, పార్టీ తరపున ప్రచారం చేయడానికి జనాకర్షనేతలెవరూ లేరు. ఇక సోనియా, రాహుల్ ప్రభ బీహార్ ఎన్నికల్లోనే తేలిపోయింది కాబట్టి, రాష్ట్రంలో కాంగ్రెస్ పని అయిపోయిందన్న అంచనా జగన్‌ది. అందుకే, కాంగ్రెస్‌ను పతనం చేసి, ఆ స్థానంలో తాను ఎదగాలనుకుంటున్నారు. వీలైతే 2014, లేదంటే 2019 ఈ రెండు సంవత్సరాలే ఇప్పుడు జగన్ టార్గెట్. అప్పటిలోగా ఎలాగైనా ముఖ్యమంత్రి పదవిని దక్కించుకోవాలన్నది జగన్ వ్యూహం. అందుకు ఇప్పటినుంచే పావులు కదపడం మొదలుపెట్టారు. కిరణ్‌కుమార్‌రెడ్డిని సీఎం చేయడం ద్వారా, జగన్ ఆశలకు కాంగ్రెస్ హైకమాండ్ పూర్తిగా గండి కొట్టింది కాబట్టి, ఒంటరిగా పోవడమే మేలని, రాజీనామా సంధించారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Very good analysis.
good...very good analysis.
మొత్తం మీద, సోనియమ్మ మొదలుపెట్టిన ఆట ఆయమ్మ ఫిక్ష్ చేసిన రిజల్ట్ వైపే నడుస్తున్నట్లనిపించినా, ఆ రిజల్ట్ కోసం మాటిమాటికీ ఆమె ఇష్టం వచ్చినట్లు గేమ్ రూల్స్ మారుస్తూ పోయినా చివరికి జగన్ తూచ్ నువ్వాడే దొంగాట బాలేదు అంటూ కొత్త ఆట మొదలుపెట్టాడు. "ముసలి కాకులకేం తెలుసు ఉండేళ్ళలో రకాలు" అన్నట్లు వారూహించని సూపర్ ఉండేలుతో దెబ్బకొట్టాడు! ఫలితం ఎలా ఉంటుందో గానీ ఆరంభం మాత్రం అదుర్స్.
రెడ్డి గారు వచ్చే ఎన్నికల్లో విబజన జరిగిన జరగక పోయెన జగన్ సీయమ్ కాలేదు మన స్టేట్ ని పాలించడానికి మా సోనియమ రావాలి అలా అనడం ముసిలి వాళ్ళు మన దేశాని పాలిస్తునారు ఎవరో అనమకులికి ఇస్తే స్టేట్ గబ్బుపడుతుంది స్టేట్ లో ఎన్ని జిలాల్లు వునాయో తెలీని వాడు కూడా సియం అవ్వాలి కేవలం పిపి మెరుగులు కాదూ స్టేట్ లో అన్ని తెలిసిన వారికీ ఎవ్వాలి మీరు స్టిల్ నౌ హ్యాపీ గా ముద్ద తిన్తునారు అంటే అది సోనియమ చలవే పోస్ట్ చెత్త పార్టికి ఇచిన నువ్వు ఎప్పుడు ఫ్రీ గా యే సర్వీసులు ఉస్ చేస్తునవో ఈవెన్ బ్లాగ్ ఆల్సో ఉ పి తే మనీ కే dont lose ur words first u respect siniyar
సుమలతగారూ!
మీరేదో వ్రాయడానికి తీవ్రంగానే ప్రయత్నించారు కానీ బహుశా తెలుగు టైపింగ్‌లో ఇబ్బందేమో:) ఒక్కసారి సరి చేసి మళ్ళీ వ్రాయగలరు.
జగన్ వ్యూహం ఏంటాఇంటా??
అక్కడ 10 మంది మత్రులు రాజీనామా చేసి రెబెల్ కాంప్ మొదలెట్టారు. అది.
ఏమి లేదండి నాకు పార్టి మిద వున్న అబిమానం తో అల రాసాను మిమల్ని బాద పెటడానికి కాదు
@ ఎనానిమస్సు అన్నారు...
"అక్కడ 10 మంది మత్రులు రాజీనామా చేసి రెబెల్ కాంప్ మొదలెట్టారు."
తొందరపడి ఓ కోయిలా.... ముందే కూసింది. అన్నట్లు మీరు ఏదో జరగబోతూందనుకుని ఎక్కువగా ఊహించుకున్నట్లున్నారు. జగన్‌పై అంత ఇదే ఉంటే అసలు మంత్రిపదవులే తీసుకునేవారు కాదుగా? ఇప్పటికే వాళ్ళ అలకలు సగం తీరిపోయాయి. రేపటికల్లా ఏం జరగనుందో?