25, నవంబర్ 2010, గురువారం
ఇదో రకం దోపిడీ!
చందాలు వసూలు చేసే దందాను తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ మొదలుపెట్టారు. పార్టీ పెట్టినప్పటి నుంచి అవసరమైనప్పుడల్లా తనకు అలవాటైన ఫార్ములాను ఉపయోగిస్తున్న కేసీఆర్, ఈ సారీ అదే పని చేశారు. కూలీ పనంటూ చిన్న చితకా పనులు కొన్ని నిమిషాల పాటు చేసి లక్షలు అందుకోవడం ఆయనకు మాత్రమే తెలిసిన విద్య. వరంగల్ సభ నిర్వహణ పేరిట ఈసారీ అదే పనిలో పడ్డారు. హైదారాబాద్‌లోని ఉప్పల్‌తో మొదలై వరంగల్ వరకూ ఒక్కరోజులో ఆయన కూలీయాత్ర సాగింది. అన్నిచోట్లా భారీగానే డబ్బులు వసూలయ్యాయి గానీ, ఒక్క చోట మాత్రం మొండిచెయ్యి ఎదురయ్యింది. యాదగిరిగుట్టలో అడిగినన్ని డబ్బులు ఇవ్వకపోవడంతో నిరాశ వెనుదిరిగారు కేసీఆర్. అయినా, తీసుకునేది పార్టీ విరాళం అయినప్పుడు ఇచ్చినంత తీసుకోవాలి గానీ, ముందుగానే ఇంత డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేయడం ఎక్కడైనా ఉంటుందా...? యాదగిరిగుట్టలోని ఓ ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని ఇలానే 5 లక్షలు కావాలని, కేసీఆర్ కూలీపని చేయగానే ఇవ్వాలని టీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారట. తీరా ఆయన చేసిన పనేమిటయ్యా అంటే, గౌడౌన్‌లోని తీగచుట్ట తెచ్చి ట్రాలీలో వేయడం. దీనికి 5 లక్షలు ఇచ్చుకోవాలా..? ఇదేమైనా న్యాయమా..! మనస్పూర్తిగా ఇచ్చింది తీసుకోవాలి గానీ, ఈ వసూళ్ల దందా ఏంది కేసీఆర్? దీనికి సంబంధించి ఈనాడు పత్రికలో వచ్చిన ఆర్టికల్ కింద ఉంది చదవండి.
కేసీఆర్ కూలీ వనికి దక్కని రూ.5 లక్షలు!
అసంతృవ్తితో పెనుదిరిగిన తెరాస అధినేత
యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే : కూలి వనిచేసి వచ్చిన డబ్బును బహిరంగ సభకు కేటాయిరచాలనుకున్న కేసీఆర్‌కు నిరాశే ఎదురైరది. బుధవారం కూలీ పనిచేసి కూడా వేతనం గిట్టుబాటు కాలేదంటూ అసంతృప్తితో వెనుదిరిగారు. నల్గొండ జిల్లా యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరలోని ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్ కంపెనీలో పనికి వచ్చిన కేసీఆర్ తొలుత జనరల్ మేనేజర్ కార్యాలయానికి వెళ్లారు. తర్వాత తెరాస రాష్ట్ర నాయకుడు కళ్లెం యాదగిరిరెడ్డి, పొలిట్‌బ్యూటరో సభ్యురాలు గొంగడి సునీతతో ఫ్యాక్టరీ గోదాంలోని తీగచుట్టను కేసీఆర్ స్వయంగా మోసుకొచ్చి ఆటోట్రాలీలో పేర్చారు. కూలిడబ్బు అడిగితే ఫ్యాక్టరీ యాజమాన్యం స్పందించకపోగా సరైన సమాధానం ఇవ్వకపోవడంతో కేసీఆర్ అసంతృప్తితో వెనుదిరిగారు. ఆయన కూలీపనికోసం వస్తున్నారన్న విషయాన్ని ఫ్యాక్టరీ యాజమాన్యానికి నాలుగు రోజుల ముందే తెలిపామని తెరాస పొలిట్ బ్యూరో సభ్యురాలు గొంగడి సునీత చెప్పారు. కేసీఆర్‌కు రూ.5లక్షలు ఇవ్వాలని కోరామని, ఫ్యాక్టరీయాజమాన్యం మాత్రం ఏమీ చెప్పకుండా తాత్సారం చేసిందని చెప్పారు. తెరాస నేత కూలిగా రూ.5 లక్షలు చెల్లించాలని కోరిన విషయాన్ని ఫ్యాక్టరీ యాజమాన్య దృష్టికి తీసుకువెళ్లామని ఆ సంస్థ జనరల్ మేనేజర్ మణివణ్ణన్ తెలిపారు. యాజమాన్యం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో పార్టీ నేతలు కోరిన మేరకు అందించలేకపోయామన్నారు. రూ.25వేలు మాత్రం ఇచ్చేందుకు సిద్ధం కాగా, పార్టీ శ్రేణులు తిరస్కరించాయన్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
good post
బ్లాగ్ మిత్రులకు నమస్కారం.
పనిఒత్తిడిలో పడి రెండు మూడు రోజులుగా బ్లాగును పట్టించుకోని నేను, కేసీఆర్ పై రాసిన ఓ పోస్టు ఇంత దుమారానికి కారణం అవుతుందని ఊహించలేదు. ఈ పోస్టు రాయాడానికి ప్రధాన కారణం మన రాజకీయనాయకుల దౌర్జన్యకాండను ఎండగట్టాలనే. అది ఎంతవరకూ నెరవేరిందన్నది పక్కన పెడితే, కామెంట్లు మాత్రం పూర్తిగా పక్కదారి పట్టాయన్నది వాస్తవం. ఇలా జరిగినందుకు నిజంగానే నేను బాధపడుతున్నాను. అసలు విషయం మరుగున పడి, కుల,వర్గ,ప్రాంతీయ భావలు చర్చలోకి రావడం నిజంగానే దురదృష్టకరం. తెలుగు బ్లాగర్లు, బ్లాగు పాఠకులు ఈ విషయాన్ని సానుకూలంగా అర్ధం చేసుకుంటారని భావిస్తున్నాను.
అజ్ఞాతల కామెంట్లను అనుమతించాలా లేదా అన్న విషయంలో నాకంటూ కొన్ని అభిప్రాయాలున్నాయి. పేర్లు చెప్పుకోకపోయినా, మంచి స్పందనను తెలియజేసేవారు చాలా మంది ఉన్నారు. బహుశా వాటిని మోడరేట్ చేసి, ఎంపిక చేసినవే ప్రచురించవచ్చు కదా అన్న అభిప్రాయం మీకు కలగవచ్చు. కానీ, నేను పొగడ్తలనే కాదు, విమర్శలనూ కోరుకుంటున్నాను. అయితే అవి వ్యక్తిగతంగా ఉండకూడదన్నదే నా భావన. ఒక పోస్టు రాసినప్పుడు దానిలో తప్పొప్పులను తెలుసుకోవాలన్నదే నా ప్రయత్నం. ప్రతీ కామెంటునూ పరిశీలించి ప్రచురించేంత వీలు నాకు లేదు. ఈ విషయంలో ఎవరినైనా నొప్పిస్తే మన్నించండి.
ఇక కామెంట్లు రాసేవారికి నా మనవి. ప్రతీ పోస్టుపైనా అందరికీ ఉపయోగపడే చర్చజరగాలన్నది నా ఆంకాక్ష. పేరు చెప్పుకొని అభిప్రాయం చెప్పినా, పేరు చెప్పకుండా అభిప్రాయం చెప్పినా తప్పులేదు. మీ అభిప్రాయాలను వ్యక్తం చేయడమూ తప్పు కాదు. అది మీ భావప్రకటనా స్వేచ్ఛలో భాగమే. కానీ, అది మరొకరికి ఇబ్బంది కలగనంతవరకూ సమస్య ఉండదు.
ఇప్పటివరకూ జరిగిన చర్చ పూర్తిగా తప్పుదారి పట్టింది కాబట్టి ఈ పోస్టుకు రాసిన అన్ని కామెంట్లనూ తొలగిస్తున్నాను.
బ్లాగు మిత్రులు అన్యధా భావించవద్దని మనవి.
సతీష్ దేవళ్ల
Good response. Appreciate that.
----------------------
అజ్ఞాతల కామెంట్లను అనుమతించాలా లేదా అన్న విషయంలో నాకంటూ కొన్ని అభిప్రాయాలున్నాయి. పేర్లు చెప్పుకోకపోయినా, మంచి స్పందనను తెలియజేసేవారు చాలా మంది ఉన్నారు. బహుశా వాటిని మోడరేట్ చేసి, ఎంపిక చేసినవే ప్రచురించవచ్చు కదా అన్న అభిప్రాయం మీకు కలగవచ్చు. కానీ, నేను పొగడ్తలనే కాదు, విమర్శలనూ కోరుకుంటున్నాను
----------------------
"అజ్ఞాతల కామెంట్లను అనుమతించాలా లేదా అన్న విషయంలో నాకంటూ కొన్ని అభిప్రాయాలున్నాయి"- వెరీ గుడ్. అసలు అజ్ఞాతల కామెంట్లను మొత్తానికే అనుమతించవద్దని ఎవరూ కోరుకోరు. మరియు మీరు చేసిన విజ్ఞప్తి కూడా బాగానే ఉంది. కానీ ఆ ప్రకారంగా మన అజ్ఞాత మిత్రులందరూ విషయానికి సంబంధించిన వ్యాక్యలు మాత్రమే, అసంబద్ధం కాని భాషలోనే వ్రాస్తారని ఆశిద్దాం. ఒకవేళ అలా జరగకపోతే ఏం చెయ్యాలో కూడా దయచేసి ఆలోచించండి.
"ప్రతీ కామెంటునూ పరిశీలించి ప్రచురించేంత వీలు నాకు లేదు" అన్న మీ అసహాయత కూడా అర్ధం చేసుకోగలదే. కానీ బ్లాగు ఉద్దేశ్యం పక్కదారి పట్టే పరిస్థితి వస్తే ఏం చెయ్యాలోకూడా ఆలోచించండి.