5, ఆగస్టు 2010, గురువారం
కాపీమాస్టర్..
తెలుగు సినీ ఇండస్ట్రీలో రికార్డుల మీద రికార్డులు సృష్టించడం రాజమౌళికే చెల్లుతుంది. తనతోటి డైరెక్టర్లు హిట్లతో పాటు ప్లాప్‌లనూ చూస్తున్నా.. ఈ యంగ్ డైరెక్టర్ మాత్రం ఇంతవరకూ ఒక్క ప్లాప్‌నూ ఎదుర్కోలేదు. కారణమేమిటో తెలుసా...?
స్టూడెంట్ నెంబర్ వన్ నుంచి అన్ని సినిమాలు దాదాపు హిట్‌లుగానో.. బంపర్‌హిట్‌లుగానో అంచనాలను అందుకున్నాయి. తాజాగా తీసిన మర్యాదరామన్న కూడా కలెక్షన్ల విషయంలో నిర్మాతలకు లాభాలనే తెచ్చిపెట్టింది.
ఖర్చు కాస్త ఎక్కువ పెడతాడని రాజమౌళికి పేరున్నప్పటికీ, విజయాల పరంగా చూస్తే నిర్మాతల డైరెక్టర్‌గానే పేరు తెచ్చుకున్నాడు. ఖర్చుకు మించిన లాభాలు వస్తాయి కాబట్టి, రాజమౌళితో సినిమాకు భారీ నిర్మాతలంతా సిద్ధంగానే ఉంటారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. అసలు విషయం మాత్రం వేరు.
సినిమా తీసే విషయంలో రాజమౌళిది క్రియేటివ్ బుర్రే అయినప్పటికీ.. కథ విషయంలో మాత్రం పక్కా కాపీ మాస్టరే. హాలీవుడ్ సినిమాలను కాపీకొట్టి, మనకు తగ్గట్లుగా తీయడంలో రాజమౌళిని మించిన వారు లేరనే చెప్పాలి. పెద్ద సినిమాలకు ఏదో కాపీ కొట్టాడులే అనుకుంటే.. చివరకు మర్యాదరామన్న కూడా కాపీ సినిమానే అని బయటపడేసరికి నేనైతే విస్తుపోయా. "అవర్ హాస్పిటాలిటీ" అనే ఇంగ్లీష్ సినిమాతో పాటు.. "బలగాలు మాలగెట్టి మాలవలయ బ" (గడపదాడితే) అనే కన్నడ సినిమానూ కలగలిపి వండి వార్చి మర్యాదరామన్నగా తీర్చిదిద్దాడు మన కాపీడైరెక్టర్ రాజమౌళి. మరీ ఇంత దౌర్భాగ్యమా..
ఇక ఇప్పుడు మహేశ్‌బాబుతో కొత్త సినిమాకు సిద్ధమయ్యాడు రాజమౌళి. పెద్ద హీరోలతో వరసగా సినిమాలు చేస్తుండడం.. మహేశ్‌బాబుకు ఉన్న ఇమేజ్‌తో పోల్చితే.. ఎంత భారీ సినిమా తీస్తాడో అన్న అభిప్రాయం సినీ ప్రేక్షకులది. అయితే.. ఏ సినిమాను కాపీ కొడతాడో అన్న అనుమానం నాది. కచ్చితంగా సొంతస్టోరీతో మాత్రం రాజమౌళి తీసే ఛాన్సే లేదు. ఆ కాపీ సినిమా ఏంటి.. మహేశ్ సినిమా స్టోరీ ఏమిటన్నది త్వరలోనే బయటపడడం మాత్రం ఖాయం.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
copy aite enti... andaru meela eppudo memu puttaka mundu teesina english cinemalu choodaleru gaa, alage andariki anni bhashallo praveenyam undadu.. ee copy to aina cinema choose avakasam dorikindi ..
He had copied...so what..
Even copying and making hit is an art.
How many copied pictures tumbled at Box office.
We are going for entertainment...who cares whether it was copied or not...
the point is d9id you enjoy the movie or not.
Mastaru...Life is a copy. How many times a day do we copy others..just imagine.
ఎక్సలెంట్ గ చెప్పారు అజ్ఞాతలు.
- ఇంకో అజ్ఞాత.
కాపీ సినిమా దర్శకులు, సంగీత దర్శకులు ఎక్కువైపోయారు. అందుకే మన సినిమాలు నాలుగ్గోడలకే పరిమితమైపోయాయి. ఈ కాపీల గురించి ఊదరకొట్టడానికి మరల విజయయాత్రలొకటి. పాపం తెలుగు సినిమా అభిమాని???
మీ ఫీలింగ్స్ ని నేను అర్ధం చేసుకోగలను. కాపీ కొట్టడం తప్పా కాదా అనేది పక్కన పెడదాం. మన తెలుగు సినిమాలలో హిట్ అయ్యేవి తక్కువ. హిట్ టాక్ వచ్చిన సినిమాలు ఇలా copied అని తెలిస్తే బాధేస్తుంది. ఎందుకంటే originality ఉన్న సినిమాలు ఒక్కటైనా తీసే వాళ్ళే లేరా అని.
హిందీ లో తీసిన Lage raho munnabhai, Munnabhai Mbbs, 3idiots లాగా మన వాళ్ళు కుడా వర్క్ చేసి తీస్తే ఎంత బాగుంటుందో అనిపిస్తూ ఉంటుంది నాకు కుడా.
-SS
సమయాభావం వల్ల ఈ పోస్ట్‌లో పూర్తిగా రాయలేదు. కానీ, ఈ పోస్టులో ఓ కొసమెరుపు కూడా ఉంది. అవర్ హాస్పిటాలిటీ నుంచి ప్రేరణ పొందానని రాజమౌళీనే స్వయంగా ఒప్పుకున్నాడు. కథను ఫ్రీగా కాపీ కొట్టేసి సినిమా తీసేసిన ఈయన గారికి, నెట్‌లో సినిమాను ఫ్రీగా చూసేవారంటే మాత్రం కోపమంట. పైరసీకి వ్యతిరేకంగా యుద్ధం చేస్తారట. మర్యాద రామన్నకు సంబంధించి ఇప్పటికే 300 టోరెంట్ ఫైల్స్‌ను డిలీట్ చేయించామని కూడా చెప్పాడు.
ఇదేమన్నా న్యాయమా..? కాపీరాయుడికి ఆ హక్కు ఉందా?
I dont think he is such a bad director!
even the other directors cant even know what is an english movie they strictly follow their songs and 5 fights formula still and brahmi in second half!
rajamouli creates the tempo when he works and at least for tht tempo ppl watching his films.
he know the pulse of the audience and provide the kind of entertainment in his movies thats all &
thats the difference