24, ఏప్రిల్ 2010, శనివారం
రెండు దశాబ్దాల హబుల్..
Categories :
నింగిలోని రహస్యాలను నేలకు అందించింది.. హబుల్ టెలిస్కోప్. మనకు తెలియని ఎన్నో విషయాలను.. అద్భుతమైన చిత్రాలుగా పంపించింది. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ.. ప్రయోగించిన ఈ టెలిస్కోప్.. విశ్వంలోకి చేరి.. రెండు దశాబ్దాలు పూర్తయ్యింది. ఇప్పటికీ అద్భుతంగా పనిచేస్తూ.. తనకు తిరుగులేని నిరూపించుకొంది హబుల్ టెలిస్కోప్..
విశ్వంలో ఎన్నో వింతలు.. మరెన్నో రహస్యాలు.. ఈ భూమి మీద నుంచి మాత్రమే చూస్తే.. మనకు కనిపించేది కేవలం ఐదు శాతమే. మరి.. మిగిలినదంతా ఎలా తెలియాలి.. ఈ ప్రశ్నే .. నాసాను ఓ మహా ప్రయోగానికి సిద్ధం చేశాయి. నింగిలోనూ ఓ టెలిస్కోప్ ఉంటే బాగుంటుందనుకున్న నాసా.. హబుల్ టెలిస్కోప్‌ను సరిగ్గా 20 ఏళ్ల క్రితం.. అంటే.. ఏప్రిల్ 24, 1990న ప్రయోగించింది.
అంతరిక్షంలోకి అడుగుపెట్టిన హబుల్.. విశ్వంలో మనకు తెలియని ఎన్నో విషయాలను చిత్రాల రూపంలో చూపించింది. అయితే.. ప్రయోగం తర్వాత.. కీలకమైన మిర్రర్‌ను సరిగ్గా పెట్టలేదన్నసంగతి శాస్త్రవేత్తలకు తెలిసింది. దీంతో. . 1993లో తొలిసారి దీనికి రిపేర్ చేశారు. ఆ తర్వాత.. నాసానే ఆశ్యర్యపోయే ఫోటోలను తీయగలిగింది హబుల్ టెలిస్కోప్.1997 హబుల్ తీసిన అంగారక గ్రహం ఫోటోలు నాసా పరిశోధనలకు ఎంతగానో ఉపయోగపడ్డాయి.
హబుల్‌ను ప్రయోగించి ఇరవైఏళ్లు పూర్తైన సందర్భంగా ప్రత్యేక ఉత్సవాలను నాసా నిర్వహిస్తోంది. 2014 వరకూ.. హబుల్ టెలిస్కోప్ పనిచేస్తుందని నాసా అంచనా. అయితే.. ఇంకా ఎక్కువకాలం పనిచేసినా మనం ఆశ్చర్యపోనక్కరలేదు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి