20, నవంబర్ 2009, శుక్రవారం
జనంలోకి జగన్
వైఎస్ జగన్మోహనరెడ్డి తన ఇమేజ్‌ను కాపాడుకోవడానికి నేరుగా రంగంలోకి దిగారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారం ముగుస్తున్న తరుణంలో రథయాత్ర మొదలుపెట్టారు. దీనికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది కాంగ్రెస్ పార్టీలో తన తండ్రి ఛరిష్మాను తనకు ఆపాదించుకొని ఇమేజ్ పెంచుకోవడం.. రెండోది పార్టీ కోసం పనిచేస్తానన్న సంకేతాలను అధిష్టానానికి పంపించడం. గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారంపై చివరివరకూ నాన్చుతూ వచ్చిన జగన్.. చివరకు రంగంలోకి దిగాలనే నిర్ణయించుకున్నారు. తండ్రి సెంటిమెంట్‌నూ కంటిన్యూ చేశారు. వైఎస్ చెల్లెమ్మగా పిలుచుకునే.. సబితా ఇంద్రారెడ్డి ఇంతకు ముందు ప్రాతినిధ్యం వహించిన చేవెళ్ల నుంచే వైఎస్ కార్యక్రమాలు మొదలుపెట్టేవారు. ప్రస్తుతం ఆమె మహేశ్వరం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండడంతో.. జగన్ తన ప్రచారాన్ని అక్కడినుంచే మొదలుపెట్టారు. మహేశ్వరం , కర్మాన్‌ఘాట్, మల్కాజ్‌గిరి, ఉప్పల్‌ల్లో నిర్వహించిన రోడ్‌షోలకు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రతిపక్షాలపై జగన్ విమర్శనాస్త్రాలు సంధించారు. ముఖ్యంగా చంద్రబాబును టార్గెట్ చేసుకుంటూ జగన్ ప్రచారం సాగింది. మద్యం దుకాణాలకు తలుపులు బార్లా తెరుచుకున్నది చంద్రబాబు హయాంలోనే అని ఆయన దుయ్యబట్టారు.జగన్ రోడ్‌షోకు విశేష స్పందన లభించడంతో కార్యకర్తల్లో, గ్రేటర్ అభ్యర్థుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. మరోవైపు.. అక్కడక్కడా ముఖ్యమంత్రి జగన్ అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేయడంతో.. జగన్ లోలోపల సంతోషంగా ఉన్నట్లు కనిపించారు. ఏదేమైనా.. తండ్రిలేని లోటు తీర్చడానికి.. ఆ పాత్రలో తాను ఒదిగి పోతాననడానికి ప్రత్యక్ష సంకేతాలను ఈ ప్రచారం ద్వారా కాంగ్రెస్ శ్రేణులకు పంపించగలిగారు జగన్.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
మద్యం దుకాణాలకు తలుపులు బార్లా తెరుచుకున్నది చంద్రబాబు హయాంలోనే అని ఆయన దుయ్యబట్టారు.!!!!!!!!!!!!!!!!
బాబు తలుపులు మాత్రమే బార్లా తెరిచి ఊరుకున్నాడు. రెడ్డి ఏకంగా కిటికీలూ, వెంటిలేటర్లూ, చిమ్నీగొట్టాల్లోగుండా కూడా సరఫరా చేశాడు. మొత్తమ్మీద జనాల చెవుల్లో పువ్వులు పెట్టటంలో అందరూ అందరే.
Janam loki Jagan.. Adavi lo ki Janam.. :-)
Naku telesi inta open ga rastranni dochukonna valle laru. Naku artham kani vishyam entanate inka konta mandi janam vellaki support ela chestaru?