ముచ్చటగా మూడోసారి కూడా టీం ఇండియా ఓడిపోయింది. ఉప్పల్ హోంటీంలకు అచ్చిరాదని మరోసారి తేలిపోయింది. ఇంతకు ముందే.. 24గంటలు హెచ్చరించినట్లు ఉప్పల్‌లో వాస్తుదోషాలు ఉండడం వల్లే గెలవాల్సిన మ్యాచ్‌లో టీం ఇండియా ఓడిపోయినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సచిన్ సుధీర్ఘపోరాటం.. ఓరకంగా వృథా అయ్యిందనే చెప్పాలి. ఇటీవలి కాలంలో ఎప్పుడూ ఆడనంతగా టెండుల్కర్ చెలరేగి ఆడాడు. 351 పరుగులు చేయాల్సి ఉన్నా, ఛేజింగ్ టీం ఇండియా వల్ల కాదులే అని ఎంతోమంది అనుకున్నా.. పరుగుల వరద పారించి అందరిలోనూ ఆశలు నింపాడు. అంతా సజావుగా సాగితే విజయం మనదే అయ్యిండేది. కానీ సచిన్ అవుట్ కావడంతోనే పరిస్థితి మారిపోయింది. అనవసర పరుగుకోసం ప్రయత్నించి జడేజా అవుటయ్యాడు. టెయిలెండర్లు పెద్దగా ఆడలేకపోయారు. కేవలం మూడు పరుగుల తేడాతో ఓడిపోవడాన్ని క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
అయితే.. ఈ మొత్తం వ్యవహారంలో మరోసారి వాస్తు ప్రభావం చర్చకు వస్తోంది. ఈశాన్యంలో ఎత్తు ఉండడం.. నైరుతిలో స్విమ్మింగ్‌పూల్ ఉండండతో పాటు.. చాలా దోషాలు ఉన్నాయని వాస్తు విద్వాన్ దంతూరి పండరీనాథ్ చెబుతున్నారు. ఇంటిలో వాస్తు సరిగ్గా లేకపోతే.. కుటుంబ పెద్దకు ఎలాంటి సమస్యలు వస్తాయో.. గ్రౌండ్ వాస్తుదోషం హోంటీంపై పడుతుందంటున్నారు. స్టేడియం గుండ్రంగా ఉంటుంది కాబట్టి.. వాస్తు వర్తించదని కొంతమంది లేవనెత్తిన వాదనను అంగీకరిస్తూనే.. స్టేడియం చుట్టూ ఉన్న ప్రహారీ వల్ల సమస్యలంటున్నారు. ఏదేమైన మ్యాచ్‌కు ముందే.. వాస్తు పరిశీలించిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు వినోద్.. ఈ ఓటమితో కలత చెందారు. వీలైనంత త్వరగా దోషనివారణ చేయాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు.
6, నవంబర్ 2009, శుక్రవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
మా ఊర్లో ఒక సామెత...
ఆడలేక..పాత గజ్జెలని...!
irrespective of the result,Sachin was fantastic yesterday. He displayed each and every shot that's there/not there, in a cricket book.
thanks for the post.
Adi kudaa nijame nemo andi .......Vaastu doshame ...edynaa prakrutiki manam eduru eduru eedalemu kadaa.
ala anukunte tappe,
australians gamelo chala professionlasim chupetaru manavallu chatagadu ani malli nirupincharu.sachin is no doubt he is an cricket god to many younger and upcoming indian cricketers.