2, నవంబర్ 2009, సోమవారం
అస్తమిస్తున్న సూరీడు..
Categories :
చిరంజీవి ఎంతో కష్టపడి సాధించుకున్న సూరీడు అస్తమించనున్నాడా.. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే అలానే కనిపిస్తోంది. కాంగ్రెస్‌తో ప్రజారాజ్యం పార్టీ పొత్తుకు సిద్ధమవడం వెనక.. భారీ వ్యూహామే ఉందని తెలుస్తోంది. త్వరలోనే.. కాంగ్రెస్‌లో ప్రజారాజ్యం పార్టీ విలీనం కావచ్చని ఊహాగానాలు చెలరేగుతున్నాయి.
రాష్ట్ర రాజకీయాల్లో ఎవరూ ఊహించని పరిణామం. చిరంజీవి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రజారాజ్యం పార్టీ.. కాంగ్రెస్ పార్టీతో పొత్తు కుదుర్చుకొంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని ఈ రెండు పార్టీలు నిర్ణయించుకున్నాయి. రెండు రాజకీయ పార్టీలు పొత్తు పెట్టుకోవడం సాధారణమే అయినా.. కాంగ్రెస్- ప్రజారాజ్యం పార్టీలు పొత్తు పెట్టుకోవడమే అందరినీ విస్మయపరుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీకి వ్యతిరేకంగా పుట్టుకొచ్చి.. అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన పార్టీ ప్రజారాజ్యం. తమ పోటీ తెలుగుదేశంతో కాదని.. కాంగ్రెస్‌తోనే అని చిరంజీవి చాలాసార్లు కుండబద్దలుకొట్టినట్లు అప్పట్లో చెప్పారు. అయితే.. ఎన్నికల ఫలితాలతో.. దిమ్మతిరిగిన ప్రజారాజ్యం పార్టీ నేతలు... ప్రజల్లో తమ పార్టీకి ఊహించినంత ఆదరణ లేదని గ్రహించారు. పైగా.. రాష్ట్రమంతా పోటీ చేసినా 18 స్థానాలు మాత్రమే దక్కడం.. చిరంజీవి సొంత జిల్లాలోనే ఓడిపోవడం ఆ పార్టీ నేతలకు మింగుడుపడలేదు. అప్పటినుంచీ.. మేథోమథనం చేస్తున్న ప్రజారాజ్యం.. గ్రేటర్ ఎన్నికల్లో ఒంటరిగా దిగకూడదని నిర్ణయించుకొంది. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే తప్ప కొద్దిపాటి సీట్లు కూడా రావని అంచనాకు వచ్చింది. అయితే.. చిరంజీవి లాంటి ప్రజాకర్షక నేత నాయకత్వం వహిస్తున్న పీఆర్పీ.. సీట్ల విషయంలో కాంగ్రెస్ ముందు ఉంచిన డిమాండ్.. ఆ పార్టీలో గుబులు పుట్టిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్‌లో మొత్తం 150 సీట్లుంటే.. కేవలం 30 సీట్లు కావాలంటూ అల్లు అరవింద్ కోరడాన్ని పీఆర్పీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. అడగడమే 30తో మొదలెడితే.. పదో పదిహేనో ఇస్తారే తప్ప అన్నీ వచ్చే అవకాశమే లేదని కొంతమంది పీఆర్పీ నేతలు చెబుతున్నారు. దీనికితోడు.. హైదరాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చేసే అన్నిస్థానాల్లోనూ చిరంజీవి ప్రచారం చేయడానికీ అరవింద్ అంగీకరించారు. కాంగ్రెస్‌తో సన్నిహిత సంబంధాలకోసమే.. ఈ ఎన్నికల్లో ఈతరహా పొత్తుకు పీఆర్పీ సిద్దపడినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం చూస్తుంటే. .క్రమంగా పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారని.. పార్టీ అధినాయకత్వానికి ఈ ఆలోచన కూడా ఉందని.. సన్నిహిత వర్గాల సమాచారం.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
నమ్ముకోతగిన వాళ్ళని నమ్ముకోకుండా నమ్మకూడని వారిని నమ్ముకుని నట్టేట్లో మునిగి ఇప్పుడు నక్కతోక పట్టుకుని ఈదుదామనుకుంటున్నాడు..
చిరంజీవి చేసిన మొదటి తప్పు తెలుగు దేశం నుంచి ఫిరాయించిన వాళ్ళని పార్టీలో చేర్చుకోవడం. అభిమాన సంఘాల నుంచి వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇచ్చినా చిరంజీవికి ఈ గతి పట్టేది కాదు. ఇప్పుడు చిరంజీవికి ఒకే ఆప్షన్ మిగిలింది. ప్రజారాజ్యంని కాంగ్రెస్ లో విలీనం చేసేయ్యడం. అలా చెయ్యకపోతే ప్రజారాజ్యం పార్టీ మూత పడిపోతుంది. పార్టీని మూసెయ్యడం కంటే విలీనం చెయ్యడం కొంచెం గౌరవకరంగా ఉంటుంది. అందుకే చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసే ఆలోచనలో ఉన్నాడు. బురద తొక్కడం ఎందుకు? కాలు కడగడం ఎందుకు? అన్నట్టు తప్పులు చెయ్యడం ఎందుకు? ఈ పరిస్థితికి దిగడం ఎందుకు? అనుకోవాలి.