15, అక్టోబర్ 2009, గురువారం
అమెరికాలా మారుతున్న చైనా
ప్రపంచంలో అమెరికా పోషిస్తున్న పెద్దన్న పాత్రను.. ఆసియాలో చైనా పోషించాలని ఉవ్విళ్లూరుతోంది. సైనికంగా బలం పెంచుకున్న చైనా.. చిన్నాపెద్ద దేశాలను ఇప్పటికే తన మాట వినేలా చేసుకొంది. అయితే.. మనదేశం మాత్రమే.. ఇంతవరకూ చైనాకు సమాంతరంగా ఎదుగుతున్నాం. మనల్ని కూడా తన మాట వినేలా చేసుకుంటే.. ఇక కమ్యూనిస్టు రాజ్యానికి ప్రపంచంలో తిరుగుండదు. అందుకే.. సరిహద్దుల్లో అలజడి సృష్టించి.. కయ్యానికి కత్తి దూస్తోంది. భారత్‌తో మానసిక యుద్దాన్ని చేస్తూ.. కవిస్తోంది. సైనికంగా.. ఆయుధ పాటవం పరంగా.. విశేషమైన సంపత్తిని సిద్ధం చేసుకున్న ఈ కమ్యూనిస్టు దేశం.. మనపై ఆధిపత్యం సాధించాడనికి.. సరిహద్దులను ఎంచుకొంది. ఈనెల మూడో తేదీన ఆ రాష్ట్రంలో ప్రధాని పర్యటించారు. ఇటీవల మనల్ని చీటికీ మాటికి రెచ్చగొడుతున్న చైనా.. అరుణాచల్‌లో ప్రధాని పర్యటనను పెద్ద ఇష్యూగా మార్చేసింది.మన్మోహన్ పర్యటించిన పది రోజుల తర్వాత.. అరుణాచల్ ప్రదేశ్‌లో పోలింగ్ జరుగుతున్న కీలక తరుణంలో... అక్టోబర్ 13న .. ఓ వివాదాస్పద ప్రకటన చేసింది. ఈ ప్రాంతంలో భారత ప్రధాని పర్యటించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో.. కొంతకాలంగా.. నివురు గప్పిన నిప్పులా సాగుతున్న భారత్-చైనా వివాదం తారాస్థాయికి చేరింది.
అరుణాచల్‌ప్రదేశ్‌ను తమ అంతర్భాగమని చైనా చెప్పుకుంటుందనడానికి ఇది ఓ నిదర్శనం మాత్రమే. భారతదేశంలో భాగమైన ఈ ప్రాంతాన్ని తమలో కలుపుకోవడానికి చైనా ఎంతోకాలంగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. తాజాగా మన ప్రధాని పర్యటనపైనా అభ్యంతరం వ్యక్తం చేసిందంటే.. డ్రాగన్ దేశం ఎంత దూకుడుగా వ్యవహరిస్తుందో అర్థం చేసుకోవచ్చు. చైనా అభ్యంతరాలపై.. ఈసారి మన దేశం తీవ్రంగా స్పందించింది. అన్ని రాష్ట్రాల్లానే.. అరుణాచల్‌కూడా భారత్‌లో అంతర్భాగమేనని విదేశాంగమంత్రి ఎస్.ఎం.కృష్ణ ప్రకటించారు. అన్ని రాష్ట్రాలకు వెళ్లినట్లే.. అరుణాచల్‌కు వెళతామని... దీనిపై చైనాకు అభ్యంతరమెందుకని ప్రశ్నించారు. దీనిపై.. భారత్‌లోని చైనా రాయబారికి కూడా సమాచారం పంపించింది.
చైనా భారత్‌ల మధ్య సరిహద్దు సమస్యను పరిష్కరించుకోవడానికి ఎంతో కాలంగా రెండు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. చాలాసార్లు చర్చలు కూడా జరిపాయి. అయితే.. సిక్కిం విషయంలో తప్ప మిగిలిన విషయంలో ముందడుగు పడలేదు. ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్ పై చైనా లేవనెత్తుతున్న అభ్యంతరాలపై మన దేశం తీవ్ర అసంతృప్తితో ఉంది. చైనా సరిహద్దుల్లో ఈ రాష్ట్రం ఉండడంతో.. తరచుగా ఆదేశ సైనికులు భారత భూభాగంలోకి చొరబడుతున్నారు. మొత్తంమీద ఇంతకుముందుతో పోల్చితే.. చైనా తన కవ్వింపు చర్యలను ముమ్మరం చేసిందని.. ఈ సంఘటనతో తేలిపోయింది. దీనిపై.. దేశంలోని ప్రధాన ప్రతిపక్షం బిజేపీ తీవ్రంగా మండిపడుతోంది. యూపీఏ మెతకవైఖరి వల్లే చైనా రోజుకో సమస్యను సృష్టిస్తోందని ఆరోపిస్తోంది. ఇప్పటికైనా గట్టిగా సమాధానం ఇవ్వకపోతే.. పరిస్థితి మరింత తీవ్రంగా మారుతుందని హెచ్చరిస్తోంది.
సరిహద్దుల్లో నిత్యం ఏదో చోట.. అశాంతిని సృష్టించడానికి చైనా ఆర్మీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఒక్క 2008లోనే 270 సార్లు మన భూభాగంలోకి చైనా సైనికులు చొరబడ్డారని, 2300 సార్లు.. సరిహద్దుల్లో అదుపుతప్పి ప్రవర్తించారని ఇండియన్ ఆర్మీ రికార్డులు చెబుతున్నాయి. అంతేకాదు.. సరిహద్దు గ్రామాల్లో భారతీయులను చైనా సైనికులు బెదిరిస్తున్నారు. ముఖ్యంగా కాశ్మీర్‌లో... గొర్రెల కాపర్లను సమీపానికి రానివ్వడం లేదు. ఆ ప్రాంతాల్లో వీరు వేసుకునే టెంట్లను కూడా.. చైనా సైనికులు దౌర్జన్యంగా తొలగిస్తున్నారు. చైనా సైనికుల కదలికలను గమనించడంతో పాటు.. వారి చొరబాట్లను అడ్డుకోవడానికి.. ఈ గొర్రెలకాపర్లకు శాశ్వత గృహాలను ప్రభుత్వం నిర్మించి ఇవ్వాలని.. లడక్ అటోనమస్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ ప్రతిపాదిస్తోంది.
అరుణాచల్ ప్రదేశ్‌లో భారత ప్రధాని పర్యటనపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసిన అక్టోబర్ 13కు ఎంతో ప్రాధాన్యం ఉంది. అదే రోజు.. అరుణాచల్‌లో పోలింగ్ జరుగుతుండడం ఒకటైతే.. చైనాలో పాకిస్తాన్ ప్రధాని గిలానీ పర్యటిస్తుండడం మరో కారణం. పాకిస్తాన్‌ను మంచి చేసుకోవడం కోసం.. ఈ ఆరోపణలు చేసి ఉండొచ్చన్న భావనా వ్యక్తమవుతోంది. ఉపఖండంలో భారత్‌ను అస్థిరపరచడానికి వేగంగా పావులు కదుపుతున్న.. ఆసియా పెద్దన్న చైనా.. పాకిస్తాన్‌తో చాలాకాలంగా సత్సంబంధాలు కొనసాగిస్తోంది. భారీగా ఆయుధాలను.. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తోంది. ఇదే సమయంలో శ్రీలంక, మయన్మార్, నేపాల్‌తోనూ వాణిజ్య బంధాలను ఏర్పరుచుకుంది. పాకిస్తాన్‌లోని గ్వదర్, శ్రీలంకలోని ట్రింకోమలి నౌకాశ్రయాల నిర్మాణంలో పాలుపంచుకొంటోంది. దీంతో పాటు.. మయన్మార్‌లోని కోకోదీవుల్లో నౌకాస్థావరాలనూ ఏర్పాటు చేసుకొంది. ఈ మొత్తం వ్యవహారాన్ని చూస్తుంటే.. భారత్‌చుట్టూ కీలక ప్రాంతాల్లో తన బలగాలను మోహరించడానికి చైనా ముమ్మరంగా ప్రయత్నిస్తున్నట్లు అర్థమైపోతుంది.
సైనిక పాటవంగా చూస్తే.. చైనాకు తిరుగులేదనే చెప్పొచ్చు. 7స్వతంత్ర దేశంగా ఆవిర్భవించిన తర్వాత.. సాయుధ సంపత్తిపై చైనా పాలకులు విశేషంగా దృష్టి కేంద్రీకరించారు. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో అత్యాధునిక ఆయుధాలను తయారు చేసుకున్నారు. సైనిక బలగాన్ని ఇబ్బడిముబ్బడిగా పెంచుకున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద మిలటరీగా చైనాపీపుల్స్ ఆర్మీని తయారు చేశారు. మొత్తం 22 లక్షల 55 వేల మంది సైనికులు చైనా మిలటరీలో ఉన్నారంటే.. ఆర్మీకి అక్కడి ప్రభుత్వం ఎంతగా ప్రాధాన్యం ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇక మన సైన్యం కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నా.. చైనాతో పోల్చితే మాత్రం తక్కువే. మొత్తం 13 లక్షల 25 వేల మంది ఇండియన్ ఆర్మీలో ఉన్నారు. ఆయుధ బలం విషయానికొస్తే.. చైనాకు 7 వేల 580 యుద్ధ ట్యాంకులు ఉండగా. మన వద్ద 3 వేల 978 ఉన్నాయి. యుద్ధంరంగంలో కీలక పాత్ర పోషించే శతఘ్నులు చైనాకు 12 వందలుంటే.. మన వద్ద 150 మాత్రమే ఉన్నాయి. వైమానిక బలం చూస్తే.. చైనాకు 2 వేల 643 యుద్ధవిమానాలుంటే.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు 852 మాత్రమే ఉన్నాయి. తన సైనిక సామర్థ్యం ఏమిటనేది.. చైనా ప్రపంచానికి.. ఇటీవలే చాటిచెప్పింది. నేషనల్ డే సందర్భంగా ప్రపంచమంతా విస్తుపోయాలా.. సైనిక పరేడ్‌ను నిర్వహించింది. ఓ రకంగా ప్రపంచ దేశాలకు.. ముఖ్యంగా భారత్‌కు తన బలాన్ని చూపించడానికే.. ఇంత పెద్ద ఎత్తున పెరేడ్ నిర్వహించి ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు.
అణ్వాస్త్రాలు మన అమ్ముల పొదిలో ఉండడంతో... కేవలం యుద్ధపరంగా భారత్‌పై చైనా విజయం సాధించలేదనేది ఖాయం. అందుకే.. ఇంటా బయటా.. అశాంతిని కలగించి.. మనల్ని దెబ్బతీయాలని చైనా భావిస్తోంది. భారతదేశంతో కీలక సంబంధాలు కలిగిఉన్న నేపాల్‌లో తన ప్రాబల్యం పెంచుకోవడానికి వేగంగా చైనా పాలకులు పావులు కదుపుతున్నారు. నేపాల్‌లో పెద్ద ఎత్తున్న రైల్వే ప్రాజెక్టులు చేపట్టడానికి ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. చైనాలోని కీలక ప్రాంతాలతో.. టిబెట్ మీదుగా.. నేపాల్‌ను కలుపుతూ.. ఈ రైల్వేలైన్‌లు ఏర్పాటు చేయనున్నారు. నేపాల్ నుంచి కోరంకోరం మార్గం ద్వారా.. పాకిస్తాన్‌కూ రైల్వే లైన్ ఏర్పాటు చేయాలన్నది చైనా లక్ష్యం. ఇది సాకారమైతే.. మన సరిహద్దుల్లో భద్రత పెను ప్రమాదంలో పడినట్లే. ఇదే సమయంలో అరుణాచల్ ప్రదేశ్ విషయంలో అమలు చేసిన ప్రణాళికనే.. కాశ్మీర్‌లోనూ ఉపయోగించడానికి చైనా సిద్దమయ్యింది. అరుణాచల్ వాసులను.. భారతపౌరులుగా గుర్తించడానికి ఇష్టపడని చైనా.. వారికి ప్రత్యేకంగా పేపర్ వీసాలను మంజూరు చేస్తోంది. తాజాగా.. కాశ్మీర్‌లోని ప్రజలకు ఇదే తరహాలో పేపర్‌వీసాలను మంజూరు చేసి కొత్త వివాదాన్ని సృష్టించింది. దీనిద్వారా.. జమ్మూకాశ్మీర్‌ను.. భారత్‌లో అంతర్భాగంగా గుర్తించమని చైనా తేటతెల్లం చేసింది. అయినా మన ప్రభుత్వానికి మాత్రం చీమకుట్టినట్లైనా లేదు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
చైనా భారత వ్యతిరేక కార్య కలాపాలకు పాల్పడుతున్న విషయం సత్యం. మంచి టపా వ్రాశారు.
Why this episode of Arunachalpradesh alone? It has been the policy of China to destabilise India in all respects by financing the red corridor, getting their stooges in India to dance to their tunes in Parliament, black mailing the Government into policies which are harmful for the Nation, trying to occupy Nepal with their red goons there(thank God this effort appears to have failed for the present).
India should come out of its worthless panchasheel and teach lesson to all the neighbours. Its not easy but it should be done gradually. We also should allign ourselves with those enemies of China and ensure that China does not wag its tail.