5, అక్టోబర్ 2009, సోమవారం

కాపాడిన శ్రీశైలం

5 comments

శతాబ్దాల తర్వాత.. కృష్ణమ్మ మహోగ్రరూపాన్ని ప్రదర్శించింది. కృష్ణమ్మ వచ్చిన వేగానికి... కర్నూలు, మహబూబ్‌నగర్‌, నల్గొండ, గుంటూరు, కృష్ణా.. ఇలా.. కృష్ణమ్మ ప్రవహించే.. జిల్లాలన్నీ తుడుచుకుపెట్టుకుపోయేంత వరదను తనతో మొసుకువచ్చింది. కానీ.. ఆ దూకుడుకు ముకుతాడు వేసి.. అపార నష్టాన్ని ఆపివేయగలిగింది.. శ్రీశైలం ప్రాజెక్టు. రాష్ట్రాన్ని మహావరద నుంచి రక్షించగలిగింది.
ప్రభుత్వ నమ్మకానికి.. అధికారుల ధైర్యానికి ప్రతీక నిలబడింది.. శ్రీశైలం ప్రాజెక్టు. రాష్ట్ర్రాన్ని మహా ఉత్సాతం నుంచి కాపాడి.. మరో రికార్డును తన ఖాతాలో జమచేసుకుంది. శతాబ్దకాలంగా.. ఎప్పుడూలేనంత ఉగ్రరూపంతో దూసుకొచ్చిన కృష్ణానదిని.. సమర్ధంగా అడ్డుకోగలిగింది.. ఈ ప్రాజెక్టు. శ్రీశైలం ప్రాజెక్టే గనక లేకపోతే... ఈ పాటికి.. కర్నూలు, మహబూబ్‌నగర్, నల్గొండ, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో.. ఒక్క చీమ కూడా మిగిలి ఉండేది కాదన్నది అక్షర సత్యం. కానీ ఈ పరిస్థితి రానివ్వకుండా చేసిన ఘనత.. మన శ్రీశైలం ప్రాజెక్టుది. ఎన్ని విమర్శలు వచ్చినా లెక్కచేయక... ప్రమాదకర స్థాయి వరకూ శ్రీశైలం కృష్ణా వరదను.. శ్రీశైలంలోనే ఆపిన ఇంజనీర్లది. శ్రీశైలం ప్రాజెక్టును నిర్మించేటప్పుడు.. గరిష్టంగా 19 లక్షల క్యూసెక్కుల వరద వస్తుందన్న అంచనాతో డిజైన్ చేశారు. అప్పటివరకూ.. ఈ స్థాయిలో ఎప్పుడూ వరద రాకపోయినా.. ముందుజాగ్రత్తగా ఈ డిజైన్ చేశారు. కానీ.. ఈ సారి మాత్రం.. ఏకంగా 25 లక్షలకు పైబడి వరదనీరు శ్రీశైలాన్ని తాకింది. అయినా.. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. ప్రజల భయాలను పటాపంచలు చేస్తూ.. సమర్థంగా.. ఈ వరద దాటిని తట్టుకొని నిలబడడమే కాకుండా.. కింది ప్రాంతాలకు ఎక్కువమొత్తంలో వరద నీరు వెళ్లకుండా.. నిల్వచేసుకోలిగిందీ ప్రాజెక్టు. అందుకే.. కర్నూలులో ఉన్నంత ప్రళయం... నల్గొండ, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కనిపించడం లేదు.
కృష్ణా వరదను సమర్ధవంతంగా ఎదుర్కొన్న ఈ ప్రాజెక్టును.. జలవిద్యుదుత్పాదన కోసమే.. డిజైన్ చేశారు. కానీ.. రాష్ట్ర వ్యవసాయ అవసరాలను దృష్టిలో పెట్టుకొని.. బహుళార్దసాధక ప్రాజెక్టుగా మార్చారు. 1963 జులైలో.. ఈ ప్రాజెక్టుకు అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ శంకుస్థాపన చేశారు. 1964లో దాదాపు 39.97 కోట్ల రూపాయలు దీని నిర్మాణానికి ఖర్చవుతుందని ప్రాథమికంగా అంచనా వేసినా.. 1984లో నిర్మాణం పూర్తయ్యే నాటికి.. 567.27 కోట్ల రూపాయల వ్యయం అయ్యింది. ఈ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 885 అడుగులు. అయినా.. 904 అడుగుల వరకూ నిల్వచేయగలిగే సామర్థ్యం ఉంది. ఈ స్థాయిని దాటితేనే.. ప్రాజెక్టు పై నుంచి వరద నీరు పొంగే ప్రమాదముంది. ఈసారి రికార్డు స్థాయిలో.. 25 లక్షల క్యూసెక్కులకు పైగా వరదనీరు పోటెత్తడంతో.. ప్రాజెక్టు తట్టుకోలేదనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ ఇంత మొత్తం వరదనూ... ఒకేసారి కిందకు వదలితే.. శ్రీశైలం దిగువ ప్రాంతాలతో పాటు.. నాగార్జున సాగర్, ప్రకాశం బ్యారేజీలకు ముప్పు జరుగుతుందని.. 896 అడుగుల వరకూ నీటిని ఈ సారి అధికారులు పట్టి ఉంచారు. ఇంకా పెరుగుతుందనుకున్న తరుణంలో.. వరద తగ్గుముఖం పట్టడంతో.. శ్రీశైలంలో నీటిమట్టం క్రమంగా తగ్గుతోంది.
శ్రీశైలం ప్రాజెక్టు నీటి నిల్వసామర్థ్యం 263 TMCలే అయినప్పటికీ.. .. ఇందులో కేవలం 223 టీఎంసీలను మాత్రమే వాడుకొనే వీలుంటుంది. కర్నూలు, కడప జిల్లాల్లో.. దాదాపు 2 లక్షల ఎకరాలు ఈ ప్రాజెక్టు కింద సాగవుతున్నాయి. ఇక రాష్ట్ర విద్యుదవసారలను తీర్చుతూ.. కుడి, ఎడమ విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా.. 1670 మెగావాట్ల పవర్ జనరేషన్ ఇక్కడ జరుగుతోంది. వరద కారణంగా.. ఇక్కడ ప్రస్తుతం విద్యుదుత్పత్తి నిలిచిపోయింది.
ఇక 19 లక్షల క్యూసెక్కులను తట్టుకునేలానేలా డిజైన్ చేసినా.. శ్రీశైలం ప్రాజెక్టు కట్టిన స్థలం కారణంగా.. ఇంత భారీవరదను తట్టుకోగలగడం సాధ్య పడగలిగింది. ఈ ప్రాజెక్టుకు ఎర్త్‌డ్యాం ఉండదు.. ఈ ప్రాతను సహజసిద్ధమైన కొండలు నిర్వహిస్తున్నాయి. అందుకని దీనికి గండిపడే అవకాశం లేదు. ఇక ప్రాజెక్టు కొద్దిగా ఎగువ ప్రాంతం U ఆకారంలో మలుపు తిరిగి ఉంటుంది. ఫలితంగా ఎగువ ప్రాంతం నుంచి దూసుకువచ్చే.. వరదనీటివేగం ఇక్కడ తగ్గిపోతుంది. ఫలితంగా డ్యాంపై నేరుగా ఒత్తిడి పడదు. ఇక డ్యాంను పూర్తిగా కాంక్రీట్‌తో నిర్మించడమూ.. ప్రస్తుత భారీ వరదను తట్టుకోగలగడానికి కారణమయ్యింది. మొత్తంమీద మన సాగునీటి ప్రాజెక్టుల సామర్థ్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలవడమే కాకుండా.. మహా ఉత్పాతాన్ని నుంచి రాష్ట్రాన్ని కాపాడిన శ్రీశైలం ప్రాజెక్టుపై ప్రశంసల జల్లుకురుస్తోంది.

5 Responses so far.

  1. Good to know that we too have some projects which lasted the testing times and saved lives of the people.

  2. అత్భుతమైన సమాచారం.
    శ్రీశైలం ప్రాజెక్టు జైహో!!

  3. అజ్ఞాత says:

    గత కొద్ది సంవత్సరాలుగా మొదలెట్టి కట్టబడుతున్న ప్రాజెక్ట్లతో పోలిస్తే శ్రీశైలం మంచి ప్రమాణాలతో కట్టబడింది అన్నమాట నిజమే.

    కాకపోతే "ఒకేసారి కిందకు వదలితే.. శ్రీశైలం దిగువ ప్రాంతాలతో పాటు.. నాగార్జున సాగర్, ప్రకాశం బ్యారేజీలకు ముప్పు జరుగుతుందని.. 896 అడుగుల వరకూ నీటిని ఈ సారి అధికారులు పట్టి ఉంచారు." అన్నమాట మాత్రం సత్యదూరమే!!

    అసలు మన చచ్చిన దేముడు గారు అధికారం లోకి, వచ్చే వరకు శ్రీశైలం లో 834 అడుగుల ఎత్తువరకు మాత్రమే నీళ్లు పట్టి ఉంచే వారు, దానికి ఒ G.O. లాంటిది కూడా ఎదో ఉండేది, దానికి కారణాలు ఒకవేళ పైనుండి వరద వస్తే ముందు జాగ్రత్త కోసం, అంతే కాక జలవిద్యుత్తు కోసం ఆ ఎత్తు సరిపోతుంది, ఆ పైన నీళ్లు ఉంచితే అవి చాలా వరకు dead storage అవుతాయి కాబట్టి.
    అలా దశాబ్దాల తరబడి అమలు చేస్తున్న పద్దతిని ఓ దేముడు గారు వచ్చి official గా 854 అడుగులు ఉంచాలని G.O. pass చేయించారు. ఎందుకోసమో మీరు ఊహించుకోవచ్చు. అలా అధికారం ఉంది కదా అని pass చేయించుకొన్న G.O. తో బాటు, తన influence తో unofficial గా 880 అడుగులు వరకూ అట్టిపెట్టి ఉంచుతున్నారు, కింద సాగర్ లో కనీసం మూడో వంతు కూడా నిండ లేదు అని తెలిసినా!!
    మొన్న వరదలకు ముందు శ్రీశైలం నుండి నీళ్లు వదిలేటప్పటికి సాగర్ లో కేవలం మూడో వంతో అంతకంటే తక్కువ నేఏళ్లు ఉన్నాయ్యి అన్న నిజం మీకు తెలియకపోవచ్చు.
    చివరగా, మొత్తం నీళ్ళు శ్రీశైలం నుండి వదలాలని మోజు పడ్డా ధెర్మపెబువులు (అన్ని గేట్లు ఎత్తివేసినా) మొన్న వదిలిన నీళ్ల కంటే ఎక్కువ వదలలేరు, అన్నది మాత్రం నిజం. ఇక శ్రీశైలం పట్టి ఉంచింది ఎక్కడ, వరదలు రాకముందు? ఇప్పుడు చేతులు కాలాక (కర్నూల్, మహబూబ్నగర్ మునిగాక) ఎదో ప్రయత్నిస్తున్నరంటారా ఒప్పుకొంటాను.

    ఇక ఇప్పటికయినా, ఇన్ని వేల కోట్లు , ఇన్ని వందల మంది ప్రాణ నష్టం జరిగాక అన్నా, కడప దేముళ్లను కాదని, బుద్ధిగా శ్రీశైలం storage ఎత్తు ఇంతకముందు లాగానే 834 అడుగులో, లేక గరిష్టం గా 850 అడుగులు దగ్గర మన పాలకులు ఆపుతారన్న నమ్మకం మీకేమైనా ఉన్నదా? నాకయితే లేదు.

    ఇప్పటికయినా కాస్తో కూస్తో చదువుకొన్న వాళ్లు అయినా ఈ అపారనష్టానికి కారణమయిన దేముడు ఆయన బిడ్డల factories ఎవో గుర్తిస్తే బాగుంటుందెమో అలోచించండి.

    కొసమెరుపు: ఇల్లు కాలి ఒకడేస్తుంటే, చుట్ట కాలి ఇంకోడు ఏడ్చినట్లు, ఈ విపత్కర సమయంలో కర్నూల్ మునిగిపోవటానికి మూల కారణమయినా వాని పేరు తో ఓ జిల్లా ను మార్చటం మాత్రం ముఖ్యమయ్యింది కాశయ్యకు :(

  4. ఆ జిల్లా పేరు మార్చడం రోశయ్యకి పూర్తిగా ఇష్టమయ్యే చేశాడా ? అనేదాంట్లో నాకు సందేహాలున్నాయి. కాంగ్రెస్ పార్టీలో గత నెలరోజుల్లో నెలకొన్న భావాత్మక వాతావరణాన్ని కాదనలేక చేసినట్లుంది. చెయ్యకపోతే జగన్ వర్గం రెచ్చిపోతుందన్న భయం కూడా ఒక కారణం కావచ్చు. వై.ఎస్. స్మృతులకి తాను వ్యతిరేకిని కాదని నిరూపించుకోవడానిక్కూడా చేసి ఉండొచ్చు.

  5. Madhu Kadapa says:

    pada hari chala baga raasavu... kaani nijaalu chala varaku telyevanukuntaa meeku. sreesailam dam okappudu 834 adugula storage vunchalannadi nijam...kaani poodikavalla...lekapothe potireddy paadu nundi pampalsina water mottam farmers ki reach avatam anedi yadardam. eeno lakshal mandi raithulaki aakattuki neeru adandadanedi vastavam...entho mandi prati roju neeti kosam chavulu saitham lekka cheyyatam ledannadi jagamerigina satyam.... nagarjuna sagar lo chooste rendu pantalaku saripadinanta water vachedi vastavam... rayalaseemo lo taagadaaniki kooda neeru vachedi KC kenal nundi--from srisailam dam anedi kooda satyam...

    eevanni aalochindi YS gaaru size penchide meekemaina NOPPAA...factory anedi ikkada secondary issue....ippatikaina ardam ayyindanukuntaa...MR agnaataaa

Labels

TOP (604) POLITICS (313) news (297) telangana (177) congress (117) entertainment (98) seemandhra (66) tdp (58) jagan (47) tollywood (45) chandrababu (36) bjp (30) cinema (28) ysrcp (28) CRICKET (27) kcr (26) election (25) trs (25) downloads (24) balakrishna (23) modi (22) sports (22) డౌన్‌లోడ్‌ (22) bifurcation (21) hyderabad (18) sonia (18) terrorist (17) cm kiran (15) division (15) cbi (14) samaikya protest (14) sex (14) technology (14) chiranjeevi (13) chirnajeevi (13) rahul gandhi (13) ANDHRA PRADESH (12) shinde (12) vijayawada (12) bollywood (11) cm (11) ramadasu (11) sachin (11) sankeertana (11) upa (11) youtube (11) kiran kumar (10) special (10) పాటలు (10) jail (9) ntr (9) ramcharan (9) health (8) world (8) anna hazare (7) dilsuknagar blast (7) pawan kalyan (7) POLLING (6) acb (6) botsa (6) cabinet note (6) case (6) deeksha (6) mahesh babu (6) padayatra (6) pavan (6) police (6) science (6) t note (6) varma (6) పుస్తకాలు (6) HOME MINISTRY (5) afzal guru (5) aishwarya (5) apngo (5) arrest (5) babu (5) delhi (5) digvijaysingh (5) gali (5) hang (5) india vs australia (5) kavuri (5) liquor (5) pranab (5) protest (5) results (5) sania (5) tjac (5) variety (5) vijayamma (5) తెలంగాణ (5) GOM (4) INDIAN MUJAHIDEEN (4) IPL (4) advani (4) all party meeting (4) bail (4) breaking news (4) cabinet (4) capital (4) china (4) death (4) dhoni (4) employees (4) gujarat (4) jayalalitha (4) life (4) maoist (4) ministers (4) murder (4) nagarjuna (4) pakistan (4) pallam raju (4) president (4) resign (4) retirement (4) tsunami (4) ఆరోగ్యం (4) సానియా (4) Amitab (3) BIHAR (3) FODDER SCAM (3) LALU PRASAD YADAV (3) MANMOHAN (3) assembly (3) businessman (3) byelection (3) cash for vote (3) court (3) crime (3) dasari (3) dgp (3) divotional (3) dl ravindra reddy (3) flood (3) ganesh immersion (3) haryana (3) helicopter (3) hindutva terrorism (3) hyderabad blasts (3) ias officer (3) india (3) jayasudha (3) ktr (3) letter (3) madyam (3) mamatha (3) mobile (3) photos (3) prajarajyam (3) priyanka (3) puri jagan (3) resigns (3) rohit sharma (3) scam (3) space (3) specail (3) sridevi (3) sriram rajyam (3) sushma swaraj (3) tamilnadu (3) tirumala (3) tirupati (3) train (3) tv9 (3) up results (3) virat kohli (3) voters (3) చంద్రబాబు (3) తిరుపతి (3) తిరుమల (3) నక్సల్స్‌ (3) మావోయిస్ట్‌ (3) BALAPUR LADDU (2) CHALO ASSEMBLY (2) CHIDAMBARAM (2) COAL SCAM (2) POLITITCS (2) airlines (2) akbaruddin (2) akkineni (2) america (2) anti rape bill (2) ap capital (2) attack (2) attarintiki daredi (2) australia (2) baba ramedv (2) bapu (2) bezawada (2) bomb blast (2) budget (2) building (2) business (2) car (2) cheating (2) clarke (2) core committee (2) daggubati book (2) death centence (2) deepika (2) delhi tour (2) diamond (2) digvijay (2) dlf (2) electricity (2) emotions (2) etv (2) family war (2) farmers (2) flex dispute (2) governor (2) harikrishna (2) heroin (2) heroine anjali (2) highcourt (2) indian railway (2) jaggareddy (2) jaipur one day (2) jana sena party (2) jd sheelam (2) kajal (2) kamal hasan (2) kasab (2) kedarnath (2) kerala (2) kodandaram (2) kollywood (2) krishna district (2) kvp (2) laddu (2) lanka vs india (2) lb stadium meeting (2) loan waiver (2) lokesh (2) love (2) march (2) mayabazar (2) merger (2) mim (2) money (2) mopidevi (2) movie (2) mps resign (2) nadendla manohar (2) nagababu (2) national (2) naxal (2) nayana tara (2) nda (2) new party (2) norway couple (2) padma awards (2) parliament (2) payyavula keshav (2) petrol (2) pm post (2) power cuts (2) power strike (2) prabhas (2) purandeshwari (2) raids (2) rajyasabha (2) ramoji (2) rastrapathi (2) records (2) rift in bjp (2) robert vadra (2) rtc (2) sale (2) samaikya (2) samaikya shankaravam (2) sanjay dutt (2) sashikala (2) satya sai (2) satyam (2) secret note (2) settlers (2) sharmila (2) sharukh (2) sonia angry (2) south india shopping mall (2) speaker (2) spy (2) strike (2) strike call off (2) sunil reddy (2) supreme court (2) syndicate (2) taj mahal (2) tamil cinema (2) tihar jail (2) transfer (2) ttd (2) tv18 (2) up (2) uppal test (2) vamshi (2) venkanna (2) vileenam (2) vishaka (2) war (2) wineshop (2) ఈవీఎం (2) గ్లోబల్‌వార్మింగ్ (2) చిరంజీవి (2) నాసా (2) రాజశేఖరరెడ్డి (2) వైఎస్‌ (2) హైదరాబాద్ (2) 10 pack (1) 1000 tonnes gold (1) 1000cr club (1) 11 yrs boy became father (1) 16 years (1) 24gantalu (1) 30 floor building (1) 30 years 60 transfers (1) 360 hours (1) 5day work (1) 5kg cylinder (1) 9 wickets (1) ACCOUNTS (1) ALAKANANDA (1) BANKS (1) Briton (1) Briton Pm (1) Chhattisgarh (1) Cockroaches (1) DEPOSITS (1) DHARI DEVI (1) External Affairs (1) Finland (1) GVK (1) HYDRO POWER PROJECT (1) IED (1) JASHODABEN (1) MALALA (1) MIN CARDS (1) MNIC (1) MODI WIFE (1) MOM (1) NIMS (1) NOMINATION (1) OATH TAKING CERMONY (1) ORDINENCE (1) OSMANIA HOSPITAL (1) RECORD PRICE (1) RESIGN WITHDRAW (1) Rs. 20 kg rice (1) SARVEY (1) SHAILAJANATH (1) SRC (1) TELANGANA GOVERNMENT (1) TWENTY 20 (1) UK (1) UTHARAKAND (1) VOTE MISSING (1) abhaya case (1) abhishesk (1) abhishesk bachan (1) abuse (1) accident (1) adhinayakudu (1) ads (1) aiadmk (1) air india (1) ajith singh (1) ak antony (1) ali khan (1) all time record (1) alliance (1) anam ramnarayana (1) andaman (1) andhra (1) android app (1) animals (1) animation (1) anushka (1) aob (1) ar rehman (1) aradhya (1) arasavalli (1) archakulu (1) armoor (1) armur (1) arushi talwar (1) asaduddin (1) ashok babu (1) ashok khemka (1) asi (1) asia cup (1) asif ali zardari (1) assets (1) assom (1) atheist (1) atrocities (1) attack on maa tv (1) attahrintiki daredi (1) audio release (1) awards (1) ayodhya (1) azhaharuddin (1) babu assets (1) babu bike ride (1) babu food (1) bachan (1) badhsha (1) bahubali (1) bail for sale (1) bajaj (1) balaji (1) balakrishna daughter wedding card (1) ball of the century (1) ban (1) bandh (1) bandla ganesh (1) bangalore (1) bangaru talli (1) battle (1) bcci (1) beauty parlour (1) bengal (1) bengalore one day (1) betiB (1) bharataratna (1) bharathi (1) bhubaneshwar (1) bhuvaneshwar (1) bike racing (1) bikshagalla jac (1) bimari poster (1) blast (1) blog (1) blue film (1) boat (1) bokaro express (1) bombay bomb blast (1) books (1) brahmanandam (1) brand Ambassador (1) breast milk (1) bride (1) bride dance (1) brother anil (1) bundh (1) bussiness (1) butta renuka (1) byeelection (1) cameron (1) cancer (1) cannes (1) cartoon (1) cases (1) cash (1) cash seize (1) cashflow (1) cave (1) cellphone (1) censor board (1) central ministers (1) century (1) chakrapani (1) chanchalguda (1) chandra babu toungue slip (1) chardham yatra (1) charges (1) chennai airport (1) chicken rate (1) chicken@Rs.70 (1) child selling (1) child sexual abuse (1) children in the bus (1) chowtala (1) coffin (1) collapse (1) collections (1) colours awards (1) cooldrinks (1) cosmic ghost (1) courier (1) court notice (1) crash (1) credit card (1) culture (1) cwc (1) cyber crime (1) daggubati (1) danam (1) dance (1) dancing frogs (1) daughter (1) daundia kheda (1) dead (1) decision (1) delivery (1) dengue (1) devineni nehru (1) devineni uma (1) dhyanchand (1) diabetes (1) differences (1) divorce (1) dkaruna (1) dmk (1) doosukeltha (1) double century (1) double murder case (1) dowry (1) dravid (1) droupadi (1) drugs (1) dubai link (1) dubbing serials protest (1) ed (1) element (1) emaar (1) emmar (1) energy saving (1) environment (1) escape plan (1) etela (1) ex cm jail (1) excavation (1) extention (1) facebook (1) fake currency (1) fake notes (1) female selection (1) fever (1) film photo (1) fine (1) first look (1) first week collections (1) fish (1) five state election (1) flood area visit (1) folding car (1) formers (1) gabbarsingh (1) gaddafi (1) gadde (1) ganapathi (1) ganesh (1) gang rape (1) gas (1) geerareddy news (1) geeta reddy (1) george bailey (1) getups (1) girl (1) gmr (1) go air (1) goa (1) golden temple (1) gotlam accident (1) govindudu andarivadele (1) gudiwada (1) guinnes record (1) gun culture (1) guntur (1) hanta virus (1) hanuman junction (1) harish rao (1) harrasment (1) helicopter scam (1) high alert (1) hike (1) himachal govt (1) himalayas (1) hindu (1) hiriko (1) homeshop18 (1) hooch death (1) hooda (1) hot photos (1) hotel dasapallah (1) house (1) hrutik roshan (1) huffingtonpost.com (1) hug (1) humanity (1) income tax (1) india pakistan world cup (1) india vs lanka (1) india vs westindies (1) india won (1) indian origin (1) indian scientists (1) indonesia (1) indonesia open (1) indu links (1) inflation (1) ink attack (1) inspiring (1) iphone (1) iron ore mines (1) isro (1) it raids (1) italy (1) jac (1) jagan case (1) jarawa tribe (1) jc (1) jeedimetla (1) jesus (1) journalist protest (1) jsp (1) jumpings (1) jyothisam (1) jyothy (1) kalam (1) kanimuri bapiraju (1) kanna (1) kapil sibal (1) katama rayuda song (1) katrina (1) kavitha (1) kbc 7 (1) kbr park firing (1) kedarnath old photo (1) kesineni nani (1) khammam (1) kingfisher (1) kings punjab (1) kiran kumar reddy (1) kishan ji (1) kiss (1) kiss scene (1) kk (1) kodali nani (1) kohinoor (1) kolkata test (1) komatireddy (1) koneru prasad (1) koratala shiva (1) koun banega crorepati (1) krishna (1) krishna devaraya (1) krishna flood (1) krishnavamshi (1) krrish-3 (1) kuppam (1) kurnool (1) lady vip (1) lagadapati (1) lagadapati sawal (1) land pooling (1) landmine blast (1) lavanam (1) lease cancel (1) levy (1) libya (1) lobbying (1) loksabha (1) lord balaji (1) lord shiva (1) love jihad (1) made in telangana (1) madhya pradesh (1) maha sankalpam (1) malaika (1) manam (1) manasarovar yatra (1) mangalagiri (1) mangalyan (1) manisha (1) mansoon (1) maos turnover (1) markus bantle (1) marlapadu (1) mars (1) match fixing (1) maxwell (1) meat (1) media (1) meera kumar (1) mega family (1) mejarity (1) metro rail (1) migration (1) milatary coup (1) minister (1) minister son arrest (1) ministers resign (1) miss universe (1) missing (1) mlas (1) mohan babu (1) money transfer scheme rangarajan (1) mono rail (1) moon (1) mother milk (1) mount kailash (1) movie on arushi (1) mp (1) mps (1) mr perfct (1) mulayam (1) mumbai (1) mumbai blast (1) muni koti (1) muslim (1) nagam janardhan reddy (1) nagapur test (1) nalgonda (1) nandamuri wedding (1) nandi (1) nannapaneni (1) narasimhan (1) nato (1) ncp (1) ncs sugar factory (1) new rules (1) new scheme (1) newzealand (1) nimajjanam (1) nityananda (1) no assembly teermanam (1) no chain (1) no power generation (1) nobel peace price (1) noconfidence motion (1) noida (1) nomophobia (1) notice (1) nuclear power plant (1) nude (1) nude dance (1) nude pose (1) nukarapu surya prakasharao release (1) nun (1) obama (1) obama care (1) obesity (1) obuleshu (1) old (1) omc (1) one nation one card (1) onion price (1) online sale (1) operation (1) operation three star (1) original painting (1) over speed (1) over weight (1) padmashree (1) palakollu (1) panchayat election (1) paper (1) parliament attack (1) patna blast (1) patolla (1) pattabhi (1) penguin (1) petrol bunks (1) phokhran (1) photo shoot (1) pin (1) plane (1) plane ticket charges (1) pm (1) pm candidate (1) pmo (1) police checking (1) police security (1) police van (1) political entry (1) polling dates (1) polling percentage (1) poonam (1) population (1) potato (1) power (1) pradeep kasni (1) pre poll survey (1) pregnant (1) priests (1) prince William (1) problem (1) property (1) prostitution (1) prp (1) psycho (1) publicity (1) pujara (1) pune warriors (1) punishment (1) punjab (1) pv narasimharao (1) rabert vadra (1) rachabanda (1) ragging (1) rail budget (1) railway budget (1) railway charges (1) railway minister (1) railway station (1) rains (1) rajamouli (1) rajanarshimha (1) ramana deeskhitulu (1) ramayanam (1) ramleela (1) rampshow (1) ranchi (1) rani rudrama (1) ravi prakash (1) ravindra jadeja (1) rayala seema (1) rayala telangana (1) rbi (1) record chase (1) red plate (1) regional (1) rehman (1) reject (1) release post pone (1) reliance (1) renuka chowdary (1) research (1) reservations (1) revanth reddy (1) rpt (1) rythu garjana (1) sad (1) sahara (1) sai kumar (1) sailajanath (1) saina (1) samajwadi win (1) samara deeksha (1) samba (1) sangareddy (1) sanghi temple road murder (1) sarees (1) satya sai maha samadhi (1) satya-2 (1) save andhra pradesh (1) save fuel (1) savitri (1) school (1) school bus (1) secret behind kedarnath survival (1) secunderabad (1) seemandhra vidyut jac (1) sehwag (1) seize (1) seized (1) september 17 (1) setaire (1) sewage (1) sexual harassment (1) shami (1) shani (1) shankarrao (1) sharad pawar (1) shaving (1) shikar dhawan (1) shilpa shetty sarees (1) shiva temple (1) shutdown (1) shwetha basu prasad (1) sikkim (1) singapore (1) sixteen (1) slap (1) slipped (1) sms (1) sonam kapoor (1) sonia assets (1) sonia warns rahul (1) sony (1) sorangam (1) southwest monsoon (1) special package to seemandhra (1) special state (1) special status (1) spy reddy (1) src report (1) srilanka (1) stalin (1) starwar (1) state (1) state formation day (1) statement (1) states reorganisation (1) stone attack (1) stone pelting (1) suicide (1) sunny leone (1) super innings (1) super match (1) survey (1) suryaa (1) swiping (1) t bill (1) t leaders meet (1) t20 world cup (1) tamannah (1) tamil (1) tarun tejpal (1) tata nano (1) tata pixel (1) tax (1) tax abolished (1) tbill (1) tcong mps (1) teen sex (1) tehelka (1) tehseen aktar (1) telangana formation day (1) telugu vari charitra verpatu vadam (1) temple (1) tennis (1) termination (1) tg venkatesh (1) tomb (1) tourism (1) town for sale (1) transco (1) tribes (1) triseries (1) ttd chairman (1) ttdp fire (1) tuglaq road (1) tv artists (1) twin blasts (1) unique wedding (1) us shooting (1) us shutdown (1) usa (1) ut (1) utv movie (1) vaartha (1) vaastu (1) valasa (1) varun gandhi (1) varun tej (1) veena malik (1) viagra (1) victory (1) vikaruudin (1) vimochana dinam (1) violence (1) vishakha tour (1) vishnu (1) vishwaroopam (1) vizianagaram (1) viziayanagaram (1) vote (1) vote for cash (1) warangal (1) warning (1) water bill default (1) water bomb (1) water pollution (1) websites (1) west godavari (1) west indies (1) whitehouse (1) wife killed husband (1) will (1) without beard (1) yachaka jac (1) yarlagadda (1) yasin bhatkal (1) young india (1) ys accident (1) ysr (1) zee 24 gantalu (1) అసదుద్దీన్ (1) ఆంధ్ర (1) ఇంటర్నెట్ (1) ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (1) ఉగ్రవాదం (1) ఉచిత బియ్యం (1) ఎటిఎం (1) ఎన్డీఏ (1) ఐపీఎల్‌ (1) కట్నం (1) కత్రీనా కైఫ్‌ (1) కరీంనగర్‌ (1) కిరీటం (1) కేరళ (1) కేసీఆర్‌ (1) కొవ్వూరు ఎమ్మెల్యే (1) కోటిలింగాల (1) కౌగిలి (1) ఖగోళం (1) గఢాఫీ (1) చందమామ (1) జగన్ (1) జేసీ దివాకర్‌రెడ్డి (1) టిఆర్‌ఎస్‌ (1) టిటిడీ (1) డీజీపి (1) దగ్గుబాటి (1) ద్రౌపది (1) నగదు బదిలీ (1) నగదు బదిలీ పథకం (1) నాగార్జున (1) నిమజ్జనం (1) పటేల్‌ (1) పిఆర్పీ (1) ప్రణబ్ (1) ప్రభాస్ (1) ప్రొటెం స్పీకర్‌ (1) ఫోటోలు (1) బడ్జెట్‌ (1) బిజినెస్ (1) బిల్లా (1) బీటీ వంకాయ (1) బొద్దింకలు (1) మంత్రులు (1) మజ్లిస్ (1) మణెమ్మ (1) మహాకూటమి (1) మాయాబజార్ (1) మూడో కూటమి (1) యార్లగడ్డ (1) రజనీకాంత్ (1) రహమాన్‌ (1) రహ్మాన్ ఇంటర్వ్యూ (1) రహ్మాన్‌ (1) రాజకీయాలు (1) రామారావు (1) రాయలసీమ (1) రిగ్గింగ్‌ (1) రుతుపవనాలు (1) లిబియా (1) వజ్రం (1) వరదలు (1) విడాకులు (1) వినాయకచవితి (1) విశ్వం (1) వేంకటేశ్వరుడు (1) వైఎస్ మృతి (1) వైరస్ (1) శాతవాహనులు (1) శివపుత్రులు (1) శ్రీశైలం నీళ్ళు (1) సచిన్ (1) సత్యం (1) సానియా పెళ్లి ఫోటోలు (1) స్మశానం (1)