1, అక్టోబర్ 2009, గురువారం
ఊరిస్తున్న స్టాక్ మార్కెట్లు
Categories :
స్టాక్‌మార్కెట్లు.. మళ్లీ ఇన్వెస్టర్లలో ఆశలు రేపుతున్నాయి. దాదాపు 16 నెలల తర్వాత.. మళ్లీ.. 17 వేల మార్కును సెన్సెక్స్ దాటింది. కీలకమైన ఈ స్థాయిని సెన్సెక్స్ అధిగమించడంతో.. ఇక అందరి దృష్టి.. 20 వేలను ఎప్పుడు దాటుతుందనే.. అందుకే.. .. చిన్న చిన్న ఇన్వెస్టర్లు మళ్లీ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నారు.
సెప్టెంబర్ నెల స్టాక్‌మార్కెట్లకు మళ్లీ జీవం పోసింది. ఎప్పుడూ లేనంతగా.. సెన్సెక్స్ గత నెలలో వృద్ధి చెందింది. సెప్టెంబర్ ఏడో తేదీకల్లా.. 16 వేల పాయింట్లను చేరుకున్న BSE సెన్సెక్స్.. 30వ తేదీ నాటికి.. 17 వేల మార్కును అధిగమించింది. గత ఏడాది మే 23 తర్వాత.. మళ్లీ ఈ స్థాయిని సెన్సెస్ అధిగమించడం ఇదే ప్రథమం. అంతేకాదు.. ఈ నెలలో మొత్తం 20 ట్రేడింగ్ సెషన్లు జరగ్గా.. అందులో 14 సెషన్లలో.. మార్కెట్ లాభాల్లోనే కొనసాగింది. నష్టాల్లో ఉన్న ఎన్నో స్టాక్స్.. ఈ మధ్య కాలంలోనే ఇన్వెస్టర్లకు మళ్లీ లాభాలను కళ్ల జూపించాయి. మొత్తంమీద.. గతంలో డౌన్‌ఫాల్‌లో తీవ్రంగా నష్టపోయిన పోర్ట్‌ఫోలియో లన్నీ మళ్లీ వాటిని అధిగమిస్తున్నాయి. స్టాక్‌మార్కెట్లు పూర్తిగా పాజిటివ్‌జోన్‌లోకి వచ్చాయన్నడానికి .. సెన్సెక్స్ సెవెంటీన్ థౌంజెండ్ మార్క్‌ను క్రాస్ చేయడమే నిదర్శనం. ఇప్పుడు 17 వేల స్థాయిలో కదలాడుతున్న బీఎస్‌ఈ ప్రధాన సూచి.. ఈ ఏడాది మార్చిలో కేవలం 8 వేల పాయింట్ల వద్దే ఉంది. అంటే.. ఆరునెలల వ్యవధిలోనే.. తొమ్మిదివేల పాయింట్లకు పైగా లాభపడిందన్నమాట. అందుకే.. మళ్లీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి.. లాభాలు సంపాదించడానికి ఎంతోమంది సిద్ధమవుతున్నారు. అంతేకాదు.. మార్కెట్లలో కొద్దిపాటి కరెక్షన్లు ఉన్నా.. ముందుకు వెళ్లడమే ఖాయమంటూ వస్తున్న వార్తలూ.. ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని పెంచుతున్నాయి. ముఖ్యంగా ఈ దీపావళికి మరో వెయ్యిపాయింట్లదాకా లాభపడొచ్చన్నది స్టాక్ అనలిస్టుల అంచనా. వచ్చే ఏడాదికల్లా 19 వేలను.. మరో రెండేళ్లలో.. 20 వేల పాయింట్లనూ దాటొచ్చని చెబుతున్నారు. ఇప్పుడు తెలివిగా ఇన్వెస్ట్ చేస్తే మాత్రం తక్కువ కాలంలోనే ఎక్కువ మొత్తాలను రాబట్టుకునే అవకాశం ఉంది. అయితే... మార్కెట్లు వరసగా పెరుగుతున్న తరుణంలో.. ప్రాఫిట్ బుకింగ్‌ల కారణంగా కొద్దిపాటి కరెక్షన్లు చోటు చేసుకోవడం సహజమే. అయితే.. ఇంతకు ముందులా.. భారీ స్థాయిలో నష్టపోకపోవడం ఉండదని అభయం ఇస్తున్నారు.. మార్కెట్ విశ్లేషకులు. అందుకే.. మార్కెట్ పడుతున్నప్పుడు మంచి స్టాక్స్ కొనడం.. సరైన లక్ష్యాలను విధించుకొని.. వాటిని అందుకోగానే అమ్ముకోవడమే.. ఇప్పుడు ఇన్వెస్టర్లు చేయాల్సింది. రెండుమూడు సంవత్సరాలుగా స్టాక్‌మార్కెట్ల అనుభవాలను దృష్టిలో పెట్టుకొని.. జాగ్రత్తగా అడుగులు వేస్తే మాత్రం.. స్వల్పవ్యవధిలో లాభాలు అందుకోవచ్చు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి