4, సెప్టెంబర్ 2009, శుక్రవారం
ఈ పాపం ఎవరిది?
Categories :
వైఎస్ మృతిపై ఎన్నో అనుమానాలు.. అసలు దారిలో కాకుండా.. మధ్యలోనే హెలికాప్టర్ ఎందుకు దారి తప్పింది.. ప్రమాద సమయంలో యాక్టివేట్ కావాల్సిన ఈఎల్‌టీ ఎందుకు పనిచేయలేదు.. ఇలా ఎన్నో వైఫల్యాలు... వైఎస్‌ను మనకు దూరం చేశాయి.. వైఎస్ మరణం వెనుక ఎన్నో అనుమానాలు. హెలికాప్టర్ నల్లమల అడవుల్లో కూలిపోవడానికి కారణం ఏమిటన్నదానిపై ఎన్నో సందేహాలు. వాతావరణం సరిగా లేకపోవడం వల్లనే.. హెలికాప్టర్ కూలిపోయిందనుకున్నా.. అసలు ఆ ప్రాంతానికి మళ్లించాల్సిన అవసరం ఏముందన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. హైదరాబాద్ నుంచి బయల్దేరిన సీఎం హెలికాప్టర్ కర్నూలు వరకూ ఫ్లైట్ ప్లాన్ ప్రకారమే వెళ్లింది. కానీ కర్నూలు నుంచి మాత్రం తూర్పు వైపు ప్రయాణం మొదలుపెట్టింది. వాతావరణం సరిగ్గా లేకపోవడం.. విజుబులిటీ తక్కువగా ఉండడం వల్లే ఇలా వెళ్లిందనుకున్నా... కొండలు ఎక్కువగా ఉండే ఆత్మకూరు వైపు హెలికాప్టర్‌ను ఎందుకు మళ్లించాల్సి వచ్చిందన్నది అంతుపట్టడం లేదు. ఇలా దాదాపు 18 కిలోమీటర్లు వెళ్లిన తర్వాత.. కొండను ఢీకొని హెలికాప్టర్ పేలిపోయిందని తెలుస్తోంది.యాక్సిడెంట్ జరిగిన తీరు చూస్తుంటే.. తక్కువ ఎత్తులోనే హెలికాప్టర్ ప్రయాణిస్తున్నట్లు కనిపిస్తోంది. కొండలున్న ప్రాంతంలో.. అదీ విజుబులిటీ సరిగా లేని సమయంలో.. తక్కువ ఎత్తులో హెలికాప్టర్‌ను ఎందుకు నడపాల్సి వచ్చిందన్నదానికీ సమాధానం లేదు. ఇక ముఖ్యమైన మరో విషయం.. ఎమెర్జెన్సీ లొకేటర్ ట్రాన్స్‌మీటర్ పనిచేయకపోవడం. ప్రమాదం జరిగినప్పుడు .. ఇది శాటిలైట్‌కు సిగ్నల్ పంపాలి. కానీ సీఎంకు జరిగిన ప్రమాదంలో ఈ సిగ్నల్స్ రాలేదు. స్టేట్ ఏవియేషన్ కార్పొరేషన్ దగ్గర నుంచి కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ దాకా.. ఈఎల్‌టి సిగ్నల్ రాలేదు కాబట్టి వైఎస్‌ది సేఫ్ ల్యాండిగే అని తొలుత తేల్చేశారు. కానీ వాస్తవం వేరన్నది ఇప్పుడు స్పష్టమయ్యింది. ఇక తేలాల్సింది ఇందులో వైఫల్యం ఎవరిదనే? సీఎం ప్రయాణిస్తున్న బెల్-430 హెలికాప్టర్లో వెదర్ రాడార్ కూడా ఉంది. వాతావరణం సరిగా లేదని తెలిసినా.. పైలెట్లు ముందుకు ఎందుకువెళ్లారు.. వైఎస్ మృతి వెనక మిస్టరీ ఈ ప్రశ్నల్లోనే దాగి ఉంది. వీటికి సమాధానాలు వస్తే తప్ప.. అసలు విషయం బయటకు రాకపోవచ్చు. కాక్‌పిట్‌లో రికార్డైన వాయిస్‌ను విశ్లేషిస్తే తప్ప.. ప్రమాదాలకు కారణం తెలిసే అవకాశాలు లేవు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కుట్ర జరిగింది అన్న విషయాన్ని నమ్మబుద్ధి కావడం లేదు. అందరూ చచ్చిపోయాక ఇక కుట్ర చేసి లాభపడేవారు ఎవరు? మావోల ప్రమేయం కూడా అనిపించదు. ప్రస్తుతం అన్నలు ఉన్న పరిస్థితుల్లో ఇంత ముఖ్యమైన వ్యక్తిని టార్గెట్ చేస్తే మన రాష్ట్రంలో పూర్తి అస్థిత్వాన్ని కోల్పోతారు. ప్రజాగ్రహం కూడా ఉంటుంది. అన్నిటికి మించి వై.యస్. మొండితనం, ప్రయాణానికి సంబంధించి అందరు అధికారుల వైఫల్యం, మితిమీరిన నిర్లక్ష్యం కారణాలుగా ప్రస్తుతానికి అనిపిస్తున్నాయి. తప్పులను సరిదిద్దుకునే సంస్కృతి మన వాళ్ళకి ఉండి ఉంటే రాజేష్ పైలట్ నుంచి మన సీఎం దాకా అందరూ క్షేమంగా ఉండేవారు. ఏ కుట్రలు లేకుండా ప్రకృతి పరంగానే ఆయన లోకాన్ని వీడారు అని తేలితే మనసు నెమ్మదిస్తుంది.