30, జులై 2009, గురువారం
గూగుల్ దెబ్బకు...
Categories :
ఒకప్పుడు పోటాపోటీగా పనిచేసిన మైక్రోసాఫ్ట్, యాహూలు చేతులు కలిపాయి. అదీ ఇంటర్నెట్ దిగ్గజం.. గూగుల్‌ను ఎదుర్కొనేందుకు. పదేళ్లకు కుదిరిన ఈ ఒప్పందం ప్రకారం యాహూ సైట్లను మైక్రోసాఫ్ట్ బింగ్ ఇంజన్ ద్వారా సెర్చ్ చేయొచ్చు. ఇందుకు ప్రతిగా ...తమ యాడ్ రెవెన్యూలో కొంత భాగాన్ని మైక్రోసాఫ్ట్‌కు యాహూ చెల్లిస్తుంది. యాహూనూ ఎదుర్కొనేందుకు ఇదే బెస్ట్ అండ్ లాస్ట్ ఛాన్సని రెండు కంపెనీల వర్గాలు వ్యాఖ్యానించాయి. ఈ ఒప్పందంతో గూగుల్‌కు గట్టి పోటీ ఇవ్వగలమని ఈ రెండు కంపెనీలు భావిస్తున్నాయి. ప్రస్తుతం గూగుల్ మార్కెట్ వాటా 65శాతం కాగా... యాహూకు 19శాతం, మైక్రోసాఫ్ట్‌కు 8శాతం వాటా ఉంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి