30, జులై 2009, గురువారం
అవినీతిమయం ఇందిరమ్మ పథకం
Categories :
అవినీతి ఆరోపణలతో అట్టుడికి పోతున్న ఇందిరమ్మ పథకంలో భారీ ఎత్తున డబ్బులు మాయమవుతున్నాయి..చేరాల్సిన చోటుకు డబ్బులు వెల్లడం లేదని అధికారులు గుర్తించారు.. పోలీసులకు సమాచారం అందించారు.. రంగంలోకి దిగిన పోలీసులు అసలు కారకులు కంప్యూటర్ ఆపరేటర్లే అని గుర్తించారు. దీనికి సంబంధించి.. రామ్మోహన్‌రావు, రాజశేఖర్‌రెడ్డి, సూర్యనారాయణ, శ్రీనివాసులు..అనే నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు చేసేది మాత్రం చిన్న పాటి డేటా ఎంట్రి ఆపరేటర్ ఉద్యోగం..వీరి ఆశలు ..ఆశయాలు మాత్రం ఎంత మోసమైనా చేసి కోట్లాది రూపాయలు సంపాదించాలని.. పేరుకు డేటా ఎంట్రీ ఉద్యోగమైనా వీరే కీలకం..చిన్న కంప్యూటర్ కీ బటన్ తో ఇందిరమ్మ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 18,487 మంది అకౌంట్లకు కోట్లాది రూపాయలు నెట్ బ్యాంకింగ్ ద్వారా పంపిణీ అవుతుంటాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణలో జరగాల్సిన ఈ పని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు చేయడంతో వారు ఓ పెద్ద స్కామ్‌కు ప్లానేశారు. డబ్బుల పంపిణీ క్రమంలో ఉన్న లొసుగుల ఆధారంగా మరో బినామీ అకౌంట్ల పేరు మీద డబ్బులు పడేలా ఏర్పాటు చేసుకున్నారు.. సక్సెస్ అయ్యారు.. ఆలస్యంగా గుర్తించిన అధికారులు 2 కోట్ల 29 లక్షల రూపాయలు మాయమైనట్లు గుర్తించారు. దీంతో విషయం కాస్తా పోలీసులకు చేరింది..కూపీ లాగిన పోలీసులు ఈ స్కాంకు కారణం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా గుర్తించారు....గత కొద్ది రోజులుగా విపరీతంగా డబ్బులు ఖర్చు చేస్తూ కార్లలో తిరుగుతున్నారని తెల్సుకొని అదుపులోకి తీసుకున్నారు.. విచారణలో అసలు విషయం బయట పడింది.. అయితే ఈ స్కాంలో కొందరు బ్యాంకు సిబ్బంది హస్తం వుందని గుర్తించి వారి కోసం గాలించడంలో పోలీసులు నిమగ్నమయ్యారు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి