విద్యా సంస్కరణల్లో భాగంగా యూపీఏ ప్రభుత్వం 2011 నుంచి పదో తరగతి బోర్డు పరీక్షలు రద్దు చేయాలని నిర్ణయించింది. కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ కూటమి ప్రభుత్వం సోమవారం ఈ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. దేశవ్యాప్తంగా 2011 నుంచి సీబీఎస్ఈ పాఠశాలల్లో పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి కపిల్ సిబాల్ వెల్లడించారు. విద్యార్థులను అధిక ఒత్తిడికి గురిచేసి, కొన్ని సందర్భాల్లో... వారిని ఆత్మహత్యలకు ప్రేరిపిస్తున్నందు వలనే పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలనే నిర్ణయం తీసుకుంటున్నట్లు కపిల్ సిబాల్ తెలిపారు. ఆయన ఓ ఆంగ్ల వార్తా ఛానల్‌తో మాట్లాడుతూ.. కొన్ని రాష్ట్రాల్లో ఐదు, ఎనిమిది తరగతుల్లో కూడా బోర్డు పరీక్షలు నిర్వహిస్తున్నారని చెప్పారు. వచ్చే ఏడాది నుంచి వీటిని కూడా రద్దు చేస్తామన్నారు.
14 ఏళ్లలోపు విద్యార్థుల పనితీరు విశ్లేషణపై ఎలాంటి ఒత్తిడి ఉండరాదన్నదే తమ కోరికని తెలిపారు. విద్యార్థి పనితీరు అంచనాపై గ్రేడింగ్ పద్దతిని రూపొందించనున్నట్లు వెల్లడించారు. యువతకు నాణ్యమైన విద్యను అందించడమే ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్ అని అన్నారు. ఒకే బోర్డు పరీక్ష విధానాన్ని త్వరలో తమ ప్రభుత్వం ప్రవేశపెడుతుందన్నారు. దీని ద్వారా విద్యార్థులకు తమకు నచ్చిన పాఠశాల లేదా విశ్వవిద్యాలయాన్ని ఎంపిక చేసుకునే వెసులుబాటు కలుగుతుందని తెలిపారు.
21, జులై 2009, మంగళవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి