
దేశానికి వారసత్వ రాజకీయాలు రాబోయో తరాలకి కూడా తప్పేటట్లు లేదు. అన్న రాహుల్ ..గాంధీ కోసం ఉత్తర ప్రదేశలో ప్రచారము చేస్తున్న ప్రియాంక గాంధీ తన అన్నని ప్రధానమంత్రిగా చూడాలని అనుకుంటున్నట్లుగా చెప్పారు.2004 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వము అధికారము చేపడుతున్న సందర్భములో సోనియా గాంధీని ప్రధాన మంత్రిగా చేయాలని కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించారు. అయితే ఆమె విదేశీయత పై సర్వత్రా విమర్శలు వెలువడటం, బిజెపి దాని అనుభంద పార్టీలు, కొంత మంది వ్యక్తులు సోనియ గాంధీ పై ఒక్క సారిగా విరుచుకు పడటం, ఆందోళనలకి ప్రయత్నించటంతో ఆమె వెనక్కి తగ్గవలసి వచ్చింది.2009 ఎన్నికలకి ముందే మన్మోహన్ సింగ్‌ని మళ్లీ ప్రధాని అభ్యర్దీగా ప్రకటించి వివాదాలకు ఆస్కారము లేకుండా వ్యూహాత్మకంగా అడుగు వేయడము జరిగింది. 2004 ఎన్నికల తరువాత ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఉన్నా మొత్తము పెత్తనము అంత రాజ్యాంగతరశక్తిగా సోనియ గాంధీ ఒక ప్రధానిగానే అధికారాన్ని చెలాయించారు. ఇప్పుడు కూడా అదే విధముగా మన్మోహన్ సింగ్ ని అడ్డంపేట్టుకుని మళ్లీ చక్రం తిప్పటానికి ప్రయత్నిస్తుండటం విశేషం.కాంగ్రెస్ పార్టీకి ప్రచారము చేయటానికి రాహుల్ గాంధీ, ప్రియాంక , సోనియాలతో పాటు ప్రియాంకా పిల్లలైన రేహాన్, మైరాలను వెంటబెట్టుకొని ప్రియాంక గాంధీ ఉత్తర ప్రదేశ్‌లో వారితో మా మామకి ఓటేయ్యండి అని అనిపిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే మరో తరాన్ని కూడా భారత ప్రజలు మోయక తప్పదా అని ప్రజలకి అనుమానం వస్తోంది.ప్రియాంక పిల్లలు బ్యాడ్జీలు పంచడం, పిల్లలతో కలిసి ఆడుతూ ప్రచారము చేయటము అక్కడ ప్రజలలో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. పుట్టుకతోటే వీరికి కూడా రాజకీయాలు అబ్బాయి అని ఆశ్చర్యపోతున్నారు. కాంగ్రెస్ నాయకులు దేశ వ్యాప్తంగా ఇవి అన్ని చూసి ఆనందపడుతున్నారు. మనకి రాబోయో రోజులలో కూడా ఢోకలేదు అని గాంధీల కుటుంబము ఉన్నంత వరకు అధికారము తమదేనని ఆనంద పడుతున్నారు
అందరిలాగానె మీరు కూడా పప్పులొ కాలు వెసారు. Rahul is elder to Priyanka. Read the links below. చదువుకున్న మీలాంటివాళ్ళను కూడా మొసం చెయగలిగారు. They are using Gandhi's name to rule India and convert Hindus. Shame on Hindus for not figuring out this fraud.
If possible educate ignorent massess of Indians (Hindus) about this fraud.
http://en.wikipedia.org/wiki/Rahul_Gandhi
http://en.wikipedia.org/wiki/Priyanka_Gandhi