16, నవంబర్ 2011, బుధవారం
మేడం ముందుకు మెగాస్టార్..
Categories :
chirnajeevi . congress . sonia . TOP
మెగాస్టార్ చిరంజీవి ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాతో ఆయన సమావేశం కానున్నారు. సాధారణ భేటీనే అని పార్టీ వర్గాలు చెబుతున్నా... చాలా విషయాలపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా చిరంజీవి మంత్రి పదవిపైనా చర్చ జరగొచ్చు..
ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి.. ఆ పార్టీ నేతగా మారిపోయిన చిరంజీవి... అధినేత్రి సోనియాతో సమావేశం కానున్నారు. వారం రోజుల క్రితం చిరంజీవి సోనియా అపాయింట్‌మెంట్‌ను కోరారు. దీనిపై స్పందించిన మేడం.. ఢిల్లీకి రావాలంటూ కబురుపంపారు. అనారోగ్యానికి గురైన సోనియాను పరామర్శించడానికే చిరంజీవి అపాయింట్‌మెంట్ కోరారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
మేడంను పరామర్శించడంతో పాటు.. సొంత విషయాలను కూడా చిరంజీవి ప్రస్తావించే అవకాశాలున్నాయి. పీఆర్పీని విలీనం చేసినప్పుడు ఇచ్చిన హామీని సోనియాకు చిరంజీవి గుర్తు చేయాలనుకుంటున్నారు. రాష్ట్ర కేబినెట్ విస్తరణలతో పీఆర్పీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు, కేంద్ర కేబినెట్‌లో తనకూ మంత్రి పదవి ఇచ్చే విషయాన్ని ప్రస్తావించవచ్చు. ఇక తన కుమారుడు చరణ్ నిశ్చితార్థం, వివాహం సంగతులు కూడా సోనియాకు చిరంజీవి చెప్పనున్నారు. ఈ టూర్‌లోనైనా చిరంజీవి తమకు మంత్రిపదవులను తాయిలంగా తెస్తారన్న ఆశలో పీఆర్పీ ఎమ్మెల్యేలున్నారు. చిరంజీవి వారి ఆశలను నిలబెడతారా లేక.. మరికొంతకాలం ఆగమంటారా అన్నదే ఇప్పుడు కీలకం.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి