29, ఫిబ్రవరి 2012, బుధవారం
సెహ్వాగ్ ఔట్!
అనుకున్నదే అయ్యింది.. చాలా కాలంగా పేలవమైన ఫామ్ తో ఆడుతున్న భారత క్రికెట్ టీమ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ను బీసీసీఐ పక్కన పెట్టింది. బంగ్లాదేశ్ లో జరిగే ఆసియా కప్ కు ఇవాళ జట్టును సెలక్టర్లు ప్రకటించారు. ధోనీతో విబేధాలు, ఫామ్ లేమి రెండూ కలిసి సెహ్వాగ్ కొంప ముంచాయి. ఆసియా కప్ జట్టుకు ధోనీ కెప్టెన్ కాగా, హోబర్ట్ లో విశ్వరూపం చూపించిన విరాట్ కోహ్లీ వైస్ కెప్టెన్. టీమ్ లో ధోనీ, రైనాలాంటి సీనియర్లున్నా.. కోహ్లీని వైస్ కెప్టెన్ గా నియమించడం ద్వారా, నిలకడగా ఆడేవారికే అవకాశాలుంటాయన్న సంగతిని బీసీసీఐ చాలా స్పష్టంగా చెప్పినట్లయ్యింది. ఇక వందో సెంచరీ చేయడానికి నానా తంటాలు పడుతున్న సచిన్ కు మరోసారి ఆసియా కప్ లో సెలెక్టర్లు అవకాశమిచ్చారు. కనీసం బంగ్లాదేశ్ మీదైనా తన చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకుంటాడని కాబోలు...!
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి