29, ఫిబ్రవరి 2012, బుధవారం
మనమే నెంబర్ వన్!
భారతదేశం కొత్త రికార్డును అందుకొంది. ప్రమాదకరమైన మాదకద్రవ్యం హెరాయిన్ను దక్షిణాసియాలో అత్యధికంగా ఉపయోగిస్తున్న దేశాల్లో మనదేశమే మొదటిస్థానంలో ఉందన్న సంగతిని ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక బయటపెట్టింది. ఇంతకాలం ఆఫ్ఘనిస్తాన్ నుంచి దక్షిణాసియా దేశాలకు, యూరప్ దేశాలకు మాదకద్రవ్యాల సరఫరాలో మనదేశం సంధానకర్తగా ఉండేది. అయితే.. కొంతకాలంగా మనదేశంలోనూ హెరాయిన్ వినియోగం పెరిగిపోయింది. పబ్ కల్చర్ పెరగడం, యువతను టార్గెట్ చేసుకుని మాఫియా ముఠాలు వీటిని సరఫరా చేస్తుండడంతో హెరాయిన్, కొకైనా ఇతర మాదకద్రవ్యాల వినియోగం పెరిగింది. హైదరాబాద్లోనూ ఇటీవలి కాలంలో ఎన్నో ముఠాలు డ్రగ్స్ ను సరఫరా చేస్తూ పట్టుబడడం గమనార్హం.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి