2, జనవరి 2012, సోమవారం
ఛీ..ఛీ.. సిగ్గేస్తోంది
"ఛీ..ఛీ..సిగ్గేస్తోంది. అద్దంలో నా మొహం చూసుకోవడానికే నాకు సిగ్గుగా ఉంది.. " ఈ మాటలన్నది కాంగ్రెస్ సీనియర్ నేత కే.కేశవరావు. తెలంగాణ ఉద్యోగ సంఘాల డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, తెలంగాణ వాదుల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నారు. కేసీఆర్ తనయుడు కేటీఆర్ అయితే.. కేశవరావు గారూ అంటూనే, కాంగ్రెస్‌ను ఏకి పారేశారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను అసహ్యించుకునే పరిస్థితి వచ్చిందంటూ విమర్శించారు. అందరి ప్రసంగాలు అయ్యాక, చివరగా మైక్ అందుకున్న కేకే... ఎంతో ఉద్వేగంగా మాట్లాడారు. తాను కాంగ్రెస్ నేతలను కలిసికట్టుగా నడిపించడంలో విఫలమయ్యాయని ఒప్పుకున్నారు. కేసీఆర్ వల్లే రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ అంశం చేరిందన్నారు. అయితే, తాము తెలంగాణ ఉద్యమం విషయంలో వెనక్కి తగ్గలేదని, ఎంతకైనా వెనుకాడమన్నారు. అవసరమైతే ప్రాణ త్యాగాలకూ సిద్ధమన్నారు. తెలంగాణను ఏతాత దిగివచ్చినా అడ్డుకోలేడని అన్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి