28, డిసెంబర్ 2011, బుధవారం
పటోళ్లను చంపింది ఎవరు?
రివల్యూషనరీ పాట్రియాటిక్ టైగర్స్ వ్యవస్థాపకుడు పటోళ్ల(పట్లోళ్ల) గోవర్ధన్ రెడ్డి నిన్న అత్యంత దారుణంగా, పట్టపగలే హత్యకు గురయ్యాడు. అయితే, ఇతన్ని హత్య చేసింది ఎవరు..? పైగా పట్టపగలే నడిరోడ్డుపై, జనం మధ్యన హత్య చేయడానికి కారణం ఏమిటి..? తాను హత్యకు గురవుతానని పటోళ్లకు ముందే తెలిసిపోయిందా..? పారిపోతుండగా అతన్ని గొంతుకోసి చంపేశారా..? ఈ ప్రశ్నలే ఇప్పుడు తేలాల్సి ఉంది.
పటోళ్ల హత్య జరగడానికి ముందు కొన్నికీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. అతని అనుచరుడు అనిల్ తో కలిసి ఇంటినుంచి బయలుదేరిన పటోళ్ల.. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో వికారాబాద్ ఎమ్మెల్యే ప్రసాద్ను కలవడానికి వెళ్లాడు. అతని పీఏ రాములును కలుసుకున్నాడు. మధ్యాహ్నం 1.36 కు తన భార్య వింద్యారెడ్డికి ఫోన్ చేసి క్షేమంగానే ఉన్నానని చెప్పాడు. సాయంత్రంలోగా ఇంటికి రాకపోతే, బీసీ సంఘం అధ్యక్షుడు కృష్ణయ్యను కలవాలని చెప్పాడు. అప్పటికే పటోళ్లకు తనను హత్య చేయడానికి కుట్ర జరుగుతోందన్న విషయం అర్థమైనట్లుంది. ఎమ్మెల్యే క్వార్డర్స్ దగ్గర ఆటో ఎక్కి ఆబిడ్స్ పోనివ్వమన్న పటోళ్ల, మధ్యలో సందుల్లో నుంచి తీసుకువెళ్లాని ఆటో డ్రైవర్ కు చెప్పాడు. బొగ్గుల కుంట దగ్గరకు వచ్చేసరికి, బైక్ ల పై వచ్చిన దుండగులు ఆటోకు అడ్డంగా ఆపి, కత్తులతో ఒక్కసారిగా పటోళ్లపై దాడి చేశారు. ఆటోలో ఉన్న అనిల్ కూడా వారికి సహకరించాడు. ఆటో డ్రైవర్ పారిపోకుండా పట్టుకున్నాడు. పటోళ్ల గొంతు కోయడంతో పాటు, పొట్టలోనూ విచక్షణారహితంగా పొడిచి చంపారు. అక్కడికక్కడే పటోళ్ల చనిపోయాడంటే ఎంత కిరాతకంగా పొడిచారో ఊహించుకోవచ్చు. ఉప్పల్ సమీపంలో ఓ ల్యాండ్ సెటిల్ మెంట్ వివాదంలోనే పటోళ్ల హత్య జరిగినట్లు తెలుస్తోంది. నయూంను కొంతకాలం క్రితం పటోళ్ల బెదిరించినట్లూ సమాచారం. ఆ నేపథ్యంలోనే అతన్ని నయీం గ్యాంగ్ హత్య చేసినట్లు తెలుస్తోంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి