2, జనవరి 2012, సోమవారం
కాటు సారా
Categories :
hooch death . krishna . news . TOP . vijayawada
కృష్ణా జిల్లాలో కల్తీసారా విషాదం ప్రభుత్వం మెడకు చుట్టుకొంటోంది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే.. అమాయకుల ప్రాణాలు బలయ్యాయన్న విమర్శలు పెరుగుతున్నాయి. మృతుల సంఖ్య పెరుగుతుండడమూ కిరణ్ సర్కార్‌ను కలవరపెడుతోంది. ఇప్పటికే మైలవరం మండలంలోని పోరాటనగర్ కు చెందిన 18 మంది గిరిజనులు కల్తీసారా కాటుకు బలైపోయారు. ఇవాళ మైలవరం మండలంలోనే మరో చోట కూడా కల్తీసారా తాగి 14 మంది అస్వస్థతకు గురయ్యారు. వరసగా ఇలాంటి ఘటనలు జరుగుతుండడం.. ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. నిన్న పరామర్శించడానికి వెళ్లిన మంత్రి మోపిదేవిని బాధిత కుటుంబాలు నిలదీశాయి. రెండు లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తామని, నాటుసారా తయారీ దారులపై పీడీ యాక్ట్ అమలు చేస్తామంటూ మోపిదేవి ప్రకటించినా బాధితులు శాంతించలేదు.
కల్తీసారాతో అనారోగ్యం పాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉంది. కల్తీ కల్లులో విషపదార్థాలు ఉన్నట్లు ల్యాబ్ రిపోర్టుల్లో తేలింది. ఇది ప్రమాదవశాత్తూ జరిగిందా.. లేక, కావాలనే చేశారా.. అన్న దానిపై అధికారులు దర్యాపు మొదలుపెట్టారు. కల్తీ సారా ఘటన రాజకీయంగానూ దుమారాన్ని సృష్టిస్తోంది. ఇప్పటికే మద్యం సిండికేట్ల వ్యవహారంతో తలబొప్పి కట్టిన కిరణ్ సర్కార్‌కు.. ఇప్పుడు నాటు సారా వ్యవహారం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి