18, నవంబర్ 2011, శుక్రవారం
ఐశ్వర్యది సాధారణ కాన్పట.. నిజంగా గ్రేట్
ఐశ్వర్యారాయ్ అందమైన అమ్మాయికి జన్మనిచ్చిందన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే, సాధారణ కాన్పులో ఈ అమ్మాయి జన్మించడం నిజంగా అద్భుతమైన విషయం. చిన్న మధ్యతరగతి వాళ్లే ఈమధ్య సిజేరియన్ డెలివరీకే ప్రాధాన్యం ఇస్తున్నారు. సాధారణ కాన్పంటే వింతగా చూడాల్సిన పరిస్థితి ప్రస్తుతం నెలకొని ఉంది. ఈ సమయంలో బాలీవుడ్ స్టార్ అయి ఉండీ, ఐశ్వర్య సాధారణ కాన్పులో బిడ్డకు జన్మనివ్వడం ఎంతోమందికి ఆదర్శం కానుంది. అంతేకాదు.. ఐశ్వర్యకు ఇప్పుడు 38 సంవత్సరాలు. లేటు వయస్సులో గర్భం దాల్చడం, ప్రసవించడం కష్టమైన పనే. ఈ వయస్సులో డెలివరీలన్నీ వీలైనంతవరకూ సిజేరియన్ పద్దతిలోనే చేస్తారు. కానీ, ఐశ్వర్య మాత్రం పురిటినొప్పులు పడడానికే నిశ్చయించుకొంది. అందమైన బిడ్డను ప్రసవించింది. ఐశ్వర్య తీసుకున్న నిర్ణయం ఎంతోమందిపై ప్రభావం చూపిస్తుందని వైద్యరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సిజేరియన్ డెలివరీ కన్నా సాధారణ కాన్పులో పుట్టిన బిడ్డలో రోగనిరోధకశక్తి ఎక్కువగా ఉంటుందని, కాలేయం పూర్తిస్థాయిలో ఎదుగుతుందని చెబుతున్నారు. ఏమైనా.. ఐశ్వర్య నిజంగా గ్రేట్.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి